twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముగిసిన శకం: వర్మను ఇక ఎవరూ అక్కు పక్షి అని తిట్టలేరు....!

    ట్విట్టర్ వదిలిన వర్మ ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచాడు. ట్విట్టర్లో వాడిన rgvzoomin ఐడితోనే ఇన్‌స్టాగ్రామ్ లో చెలరేగిపోనున్నాడు ఈ వివాదాస్పద డైరెక్టర్.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు వారికి ట్విట్టర్ బాగా పరిచయం అయిందంటే అందుకు ప్రధాన కారణంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని చెప్పక తప్పదేమో? టాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్లు ఎవరూ ట్విట్టర్లో ఫేమస్ కాని రోజుల్లో అంటే May 27, 2009 వర్మ ఖాతా తెరిచాడు. సరిగ్గా 8 సంవత్సరాల అనంతరం వర్మ అదే మే 27న ట్విట్టర్ కు బై బై చెప్పాడు.

    ఒకప్పుడు దర్శకుడిగా బాగా పాపులారిటీ సంపాదించిన వర్మ గత కొన్నేళ్లుగా ట్విట్టర్ పక్షిగా ఫేమస్ అయ్యాడు. కొన్ని సందర్భాల్లో అసలు వర్మ నిజ జీవితంలో కాకుండా ట్విట్టర్లోనే జీవిస్తాడేమో? అనే సందేహం వచ్చింది చాలా మంది. ఎలాంటి వారైనా, ఎంతటి హోదాలో ఉన్నా ట్వీట్లతో ఏకి పారేయడం, అదే స్థాయిలో పొగడటం వర్మకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అన్నంతగా ట్విట్టర్‌ ను ఆయధంగా చేసుకుని చెడుగుడు ఆడేసిన వర్మ.... అదే స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నాడు.

    అక్కు పక్షి అని తిట్టలేం

    అక్కు పక్షి అని తిట్టలేం

    కొన్ని సందర్భాల్లో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ గోలను భరించలేక ఆయన్ను ట్విట్టర్ పక్షి అని, అక్కు పక్షి అని విమర్శలు చేసిన వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇకపై వర్మను అక్కు పక్షి అనిగానీ, ట్విట్టర్ పక్షి అని గానీ తిట్టపోయలేరు. ఎందుకంటే వర్మ ట్విట్టర్‌ను వదిలేసాడు. మే 27, 2017 రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ శకం ముగిసింది.

    ఇపుడు ఇన్‌స్టాగ్రామ్ లో

    ఇపుడు ఇన్‌స్టాగ్రామ్ లో

    వర్మ ట్విట్టర్ వదిలేసాడని అభిమానులు బాధ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ట్విట్టర్ వదిలిన వర్మ ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచాడు. ట్విట్టర్లో వాడిన rgvzoomin ఐడితోనే ఇన్‌స్టాగ్రామ్ లో చెలరేగిపోనున్నాడు ఈ వివాదాస్పద డైరెక్టర్.

    అందుకే ఈ నిర్ణయం

    ఇక నుండి నేను ఏది మాట్లాడినా ఫోటోలు, వీడియోల రూపంలో చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఇనిస్టాగ్రామ్ లోకి మారాను అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

    దీన్ని కూడా అలా మారుస్తాడా?

    దీన్ని కూడా అలా మారుస్తాడా?

    ట్విట్టర్ పేజీని వివాదాలకు వేదికగా మార్చిన వర్మ.... ఇపుడు ఇన్‌స్టాగ్రామ్ ను కూడా అలాగే మారుస్తాడా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

    English summary
    Filmmaker Ram Gopal Varma has decided to quit micro-blogging site, Twitter. The 55-year-old director, who has had his share of Twitter fights and trolls, joined the social media platform on May 27, 2009.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X