twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ 'న్యూక్లియర్' కథ... ఇలాగే తీస్తే ఇండియన్ సినిమా ఒక మెట్టెక్కినట్టే...

    |

    రామ్ గోపాల్ వర్మ ఒక హైపర్ యాక్టివ్, ఓవర్ యాట్టిట్యూడ్ ఫెల్లో మనందరికి తెలిసిన ఒక క్రియేటివ్, రఫ్ పర్సనాలిటీ... కానీ వర్మలో ఒక సున్నితమైన కోణం ఉంది చిన్న పిల్లాడిలా త్వరగా రియాక్టయ్యే గుణం, ప్రతీ చిన్నదానికీ చలించిపోయే మనస్తత్వమూ ఉంది. ఆ మస్తత్వమే కొన్నిసార్లు పిచ్చిపట్టిందా ఇతనికి..? అనిపించేలా అతను చేసే కామెంట్లు కానీ వర్మ్ చెప్పే 99% మాటలు నిజమే అని అందరికీ తెలుసు ఎటొచ్చీ వాటిని మనం ఒప్పుకోలేం... వర్మ బయటికే చెప్పేస్తూంటాడు... అందుకే వర్మ ని బండబూతులు తిట్టే మనిషి కూడా వర్మ మీద ప్రతీ క్షణం ఒక కన్నేసి ఉంటాడు... వర్మ ఏం చెప్తాడూ అని ఎదురు చూస్తాడు.. మనకు కనిపించే డైరెక్టర్ వర్మ వేరూ...

    ఇండియాలో ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో కేవలం రెండున్నర లక్షల రూపాయలతో కూడా ఒక ఫీచర్ ఫిలిం (ఐస్ క్రీమ్) తీసి సంచలనం సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తీసే మిగతా సినిమాలు కూడా తక్కువ బడ్జెట్లోనే ఉంటాయి. అలాంటి వర్మ త్వరలో రూ.340 కోట్లతో ఒక ఇంటర్నేషనల్ సినిమా తీయబోతున్నాడు. అదే.. న్యూక్లియర్. రెండు నెలల కిందటే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసింది 'సీఎంఏ గ్లోబల్' సంస్థ. ఈ చిత్రం మేలో సెట్స్ మీదికి వెళ్తుందని.. రెండు మూడేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుంటుందని తెలిపాడు వర్మ. తాజాగా ఈ సినిమా కథను కూడా విప్పి చెప్పేశాడు వర్మ. ఈ సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలు..

    ఇంటర్నేషనల్ సినిమా:

    ఇంటర్నేషనల్ సినిమా:

    దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీసారు. తొలిసారిగా ఆయన ఇంటర్నేషనల్ సినిమాను తెర కెక్కిస్తూ బడ్జెట్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి మామూలుగా లక్షల్లోనే తన సినిమాని పూర్తి చేసేతూంటాడు వర్మ ఇక భారీ బడ్జెట్ అంతే అదీ వర్మ తీస్తున్నాడూ అంటే ఒక సారి ఆలోచించాల్సిందే.

    ఎక్కువ బడ్జెట్ :

    ఎక్కువ బడ్జెట్ :

    కొద్ది రోజుల క్రితం దాకా 'బాహుబలి' చిత్రమే ఇండియాలో భారీ బడ్జెట్ చిత్రమని అనుకున్నాం కానీ దానికన్నా ఎక్కువ బడ్జెట్ తో శంకర్ - రజనీల 'రోబో2.0' తెరకెక్కుతోంది. మరిప్పుడు వాటి రెండింటినీ మించి వర్మ ప్లాన్ చేస్తున్నారు. రూ. 340 కోట్ల భారీ బడ్జెట్ తో 'నూక్లియర్' పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

    పబ్లిసిటీ ఎత్తుగడా:

    పబ్లిసిటీ ఎత్తుగడా:

    అమెరికా, చైనా, రష్యా, యెమెన్, భారత దేశాల్లో చిత్రీకరణ జరుపుతామని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా చెప్పగానే చాలామంది షాక్ తిన్న మాట వాస్తవం, ఎప్పటిలాగానే మరో సారి పబ్లిసిటీ ఎత్తుగడా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.. ఎందుకంటే అప్పుడప్పుడూ ఇలాంటి జలక్ లివ్వటం వర్మ కి సరదా కదా మరి.

    అణు బాంబుల వల్ల:

    అణు బాంబుల వల్ల:

    చిత్రం వివరాల్లోకి వెళితే... అణు బాంబుల వల్ల సంభవించే విధ్వంసం పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అణుబాంబులు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లి, మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉంటుందో హెచ్చరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'నూక్లియర్' సినిమా పోస్టర్ కూడా వర్మ విడుదల చేశారు.

    సర్కార్ 3:

    సర్కార్ 3:

    కాగా, అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో తెరకెక్కిస్తున్న 'సర్కార్ 3' సినిమా షూటింగ్ లో వర్మ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. రూ.340 కొట్ల భారీ బడ్జెట్ తో తన సినిమాని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఆ సినిమా టైటిల్ 'న్యూక్లియర్'. ఈ విషయమై ఆయన ట్విట్టర్ లో పోస్టర్ వేసి , సినిమా గురించి రాసుకొచ్చారు.

    టెర్రరిజం నేపథ్యంలో :

    టెర్రరిజం నేపథ్యంలో :

    'న్యూక్లియర్ టెర్రరిజం నేపథ్యంలో సాగే కథ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం చర్చనీయాంశంగా మారింది. రోజూ నిద్ర లేవగానే ఎక్కడో ఒక చోట ఉగ్ర దాడి గురించి వింటూనే ఉన్నాం. విమానాలతో టవర్లను కూల్చేయడం.. రోడ్డు మీద వెళ్తున్న ప్రజలను ట్రక్కుతో చిదిమేయడం లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి.

    ఆటంబాంబు వల్ల :

    ఆటంబాంబు వల్ల :

    ఈ నేపథ్యంలోనే 'న్యూక్లియర్‌' సాగుతుంది. ఒక ఆటంబాంబు వల్ల ముంబయి స్ట్రగుల్ అవుతుంది. అది పేలితే మూడో ప్రపంచయుద్ధం వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో భారత్, పాకిస్థాన్‌లను ఒప్పించి.. దాన్ని నిర్వీర్యం చేయడానికి అమెరికా తన బలగాలను మోహరిస్తుంది. తర్వాత ఏమైందన్నదే ఈ కథ.

    సినిమా ఇంగ్లిష్ లోనే :

    సినిమా ఇంగ్లిష్ లోనే :

    'సర్కార్‌ 3' తర్వాత.. అంటే 2017 మేలో 'న్యూక్లియర్‌' షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఇండియాతో పాటు అమెరికా, చైనా, రష్యా, ఇండోనేషియల్లో షూటింగ్‌ చేయాల్సి ఉంటుంది. అమెరికన్లు, చైనీయులు, రష్యన్లు, బ్రిటిషర్లు, యెమనీస్‌ ఇందులో నటిస్తారు. సినిమా ఇంగ్లిష్ లోనే ఉంటుంది'' అని వర్మ తెలిపాడు.

    ప్రపంచ వ్యాప్తంగా :

    ప్రపంచ వ్యాప్తంగా :

    ఇప్పటివరకు వర్మ వివాదాలు ఇండియాకే పరిమితం. కానీ ఈసారి ప్రపంచ వ్యాప్తంగా తన మార్క్ ప్రయోగాన్ని చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు రెండు ప్రపంచ యుద్ధాల గురించి విన్న మనం.. త్వరలో మూడవ ప్రపంచ యుద్ధాన్ని చూస్తాం.

    కాలేజ్ గొడవల్లో:

    కాలేజ్ గొడవల్లో:

    న్యూక్లియర్ సినిమా గురించి గర్వపడుతున్నాను. మామూలు కాలేజ్ గొడవల్లో, సైకిల్ చైన్లతో కొట్టుకునే నేపధ్యంలో, నేను తీసిన "శివ" తో మొదలైన నా కెరియర్ ఇప్పుడు దేశాల మధ్య జరుగుతున్న గొడవల్లో న్యూక్లియర్ బాంబులు పేల్చుకునే నేపధ్యంలో ఇంగ్లీష్‌లో నిర్మించబోతున్న"న్యూక్లియర్" సినిమా వరకూ వచ్చినందుకు, నేను ఒకింత కాకుండా చాలా చాలా గర్వపడుతున్నాను''... అని చెప్పి తన రఫ్ నెస్ వెనక ఉండే నిజమైన వర్మ మనసు ఎలాంటిదో చెప్పేసాడు.

    న్యూక్లియర్ బాంబు:

    న్యూక్లియర్ బాంబు:

    రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా వేసిన అణుబాంబు ప్రభావానికి ఇప్పటికీ హిరోషిమా, నాగసాకి ప్రాంతాల్లో గడ్డి కూడా మొలవలేదు. అలాంటిది భవిష్యత్తులో వచ్చే యుద్ధంలో న్యూక్లియర్ బాంబు వాడితే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో చూపించనున్నారు. ఈ బాంబుతో ప్రపంచం ఎలా అంతం అవుతుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తానంటున్నారు వర్మ.

    అణ్వాయుధాలు

    అణ్వాయుధాలు

    మరిప్పుడు అవే అణ్వాయుధాలు, అణుబాంబులు అవాంఛిత వ్యక్తుల చేతుల్లో పడితే పరిస్థితి ఏంటి..? అన్న దానిపైన కథను అల్లి తీసేందుకు సిద్ధమైపోయాడు రామ్‌గోపాల్ వర్మ. దానికి సంబంధించిన విషయాలను అతడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ‘‘తొలిసారిగా అంతర్జాతీయ సినిమా తీయబోతున్నాను. దాని బడ్జెట్ 340 కోట్లు. ఆ సినిమా పేరు న్యూక్లియర్. నేను ఇప్పటిదాకా ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కథలు, నవలలెన్నో చదివాను.

    భారీ బడ్జెట్‌

    భారీ బడ్జెట్‌

    కానీ, ఇప్పటిదాకా న్యూక్లియర్ వంటి కాన్సెప్ట్‌తో రాలేదు. భారత్‌లో ఇప్పటిదాకా ఏ సినిమాకు పెట్టనంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. సినిమా కథ డిమాండ్‌కు అనుగుణంగానే ఆ బడ్జెట్‌ను నిర్ణయించాం. 70 ఏళ్ల క్రితం జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై వేసిన అణుబాంబుల మోత ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. మరి అలాంటి విధ్వంసం ఇప్పుడు జరిగితే..

    ప్రపంచం అంతం:

    ప్రపంచం అంతం:

    అదీ ముంబై లాంటి పెద్ద నగరాలపై అణు బాంబును వేస్తే... అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. అంతటితో ప్రపంచం అంతం'' అని ట్వీట్ చేశాడు. కాగా, భారత్, అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల్లో, ఆయా దేశాలకు చెందిన నటీనటులతో సినిమాను తీస్తామని, సర్కార్-3 షూటింగ్ అయిపోగానే వెంటనే సినిమాను పట్టాలెక్కిస్తామని వెల్లడించాడు. సీఎంఏ గ్లోబల్ అనే నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో న్యూక్లియర్ తెరకెక్కనుంది. ఈ అణుబాంబుల వల్ల కలిగే అనర్థాలను ప్రపంచ దేశాలకు కళ్లకు కట్టబోతున్నాడన్నమాట.

    English summary
    This is the story of Ram Gopal Varma announced his first international project titled "NUCLEAR," which will be made at the whopping budget of Rs 340 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X