twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ, ఖైదీ వివాదం ముదురుతోంది.., చేయి దాటకముందే.... పొద్దున్నుంచీ వర్మ ట్వీట్లు ఇవే

    ఒక్క రోజు సైలెంట్ గా ఉన్న వర్మ గౌతమీపుత్ర శాతకర్ణి వచ్చిందో లేదో ఇంకో సారి వృంబించాడు... బాలయ్య తన 100వ సినిమాతో మెగా ఫ్యామిలీకంటే 150 రెట్లు గొప్పగా కనిపిస్తున్నాడూ అంటూ ట్వీట్

    |

    సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నాలుగు రోజుల విరామం తర్వాత మళ్లీ ట్వీట్లకు పనిచెప్పాడు. జనవరి 8న చివరిసారిగా వర్మ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఇవాళే కొద్దిసేపటి క్రితమే ట్వీట్స్ మొదలుపెట్టాడు. దీంతో వర్మ మళ్లీ మొదలెట్టేశాడు అటు బాలయ్యని పొగుడుతూనే ఇంకో పక్క మెగా సినిమా ని ఏకిపారేయ్యటం మొదలు పెట్తాడు అసలే తిక్క గా ఉండే వర్మని మరింత గిల్లి కయ్యం పెట్టుకున్నాడు నాగబాబు.

    "కుసంస్కారీ, అక్కుపక్షీ అంటూ" అనేయ్యటం తో వెంటనే ట్వీట్ల యుద్దం మొదలు పెట్టాడు రకరకాలు గా నాగ బాబు తో అడుకున్న వర్మ నిన్న కాస్త ఊపిరి పీల్చుకున్నాడు... అయితే ఈ ఉదయం నుంచీ ఎప్పుడైతే గౌతమీ పుత్ర శాతకర్ణి రిజల్ట్ తెలిసిందో ఇంక అక్కడినుంచీ వర్మ విజృంబన కొనసాగుతోంది... ఇక సాయంత్రం వరకూ ఇంకా ఎన్ని వస్తాయో ఏమో... ఒక్క సారి ఆట్వీట్లనీ ఆ గొడవనీ చూస్తే...

     రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి:

    రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి:


    రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు దెబ్బతిన్న పులి.... మొన్న 'ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ..... మెగా బ్రదర్ నాగబాబు రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమ నుండి ముంబై వెళ్లి అక్కడ సినిమాలు తీసుకుంటున్న ఒకడు

     వాడో అక్కు పక్షి :

    వాడో అక్కు పక్షి :


    ట్విట్టర్లో ఎప్పడూ ఏదో ఒకటి వాగుతుంటాడు, వాడో అక్కు పక్షి...వాడికి ఇపుడు సినిమాలు తీయడం చేతకావడంలేదు, పిచ్చికూతలు కూస్తాడు. ముందు వాడు మంచి సినిమాలు తీయడంపై దృష్టి పెడితే బాగుంటుందిని హెచ్చరించారు. నాగబాబు కామెంట్స్‌తో రామ్ గోపాల్ వర్మ వెంటనే ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు.

    నాకు చాలా ఇష్టం:

    నాకు చాలా ఇష్టం:

    చిరంజీవికి క్షమానణలు చెబుతూ ట్వీట్స్ చేసారు. 'నాగబాబు గారు మీరు ట్విట్టర్లో లేరు కాబట్టి నా ఈ ట్వీట్లు మీకు ఎవరైనా చూపిస్తారని ఆశిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేనేదో నా స్టైల్ లో అందరి మీదా, అన్నింటి మీదా ఏదో ఒక ఓపీనియన్ చెబుతూ ఉంటాను.
     చిరంజీవి గారికి సారీ:

    చిరంజీవి గారికి సారీ:


    వొట్టి మీ ఫ్యామిలీ మీదే కాదు. నా ట్వీట్లు మోడీ గారి దగ్గరి నుండి బచ్చన్ గారి వరకు, చివరకు నా మీద నేను కామెంట్స్ చేసుకుంటూ ఉంటాను. కానీ మీరు చాలా అఫెండ్ అయి హర్ట్ అయ్యారని నాకు తెలిసింది కనుక నేను జెన్యూన్ గా మీకు, మీ ఫ్యామిలీకి సారీ చెబుతున్నాను. నా ఉద్దేశ్యం వేరే అయినా మీరు హర్ట్ అయ్యారు కనుక చిరంజీవి గారికి కూడా నా తరుపున దయచేసి సారీ చెప్పండి. థాంక్స్' అంటూ వర్మ ట్వీట్ చేసారు.

     యూటర్న్ :

    యూటర్న్ :


    ఇలా రామ్ గోపాల్ వర్మ రియాక్షన్ చూసి కొందరు షాక్ తిన్నారు కూడా ఎవరికీ సారీ చెప్పని వర్మ చిరు కి భయపడ్డాడు అనికూడా అన్నారు... అయితే కొద్ది సేపట్లోనే రాము అంటే ఏమిటో చూపించటం మొదలు పెట్టాడు. చిరంజీవి కుటుంబానికి క్షమాపణలు చెప్పిన కొద్దిసేపటికే రామ్ గోపాల్ వర్మ యూటర్న్ తీసుకున్నారు. నాగబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలతో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

     ఎవరో తన ఖాతాను హ్యాక్ చేసి :

    ఎవరో తన ఖాతాను హ్యాక్ చేసి :


    ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలు తనవి కావని చెప్పుకున్నారు. ఎవరో ఇడియట్ తన అకౌంట్‌ను హ్యాక్ చేశాడని అన్నారు. తానెప్పుడూ తెలుగులో ట్వీట్ చేయలేదని, ఎవరో తన ఖాతాను హ్యాక్ చేసి కామెంట్లు పెట్టారని చెప్పారు. ఆ తర్వాత నాగబాబుపై విరుచుకుపడ్డారు.

     అనువాదం చేయించుకోండి:

    అనువాదం చేయించుకోండి:


    "నాగబాబు సారూ... మీకు ఇంగ్లీషు అర్థం కాకపోతే ఎవరైనా ఇంగ్లీష్ తెలిసిన మిత్రుడితో నా ట్వీట్లను తెలుగులోకి అనువాదం చేయించుకోండి" అని సూచించారు. "మీ అన్నయ్య గురించి మీకు 0.1 శాతం కూడా తెలియదు. మీ అన్న గొప్పతనం గురించి ఎందుకు మాట్లాడుతారు" అని అన్నారు.

     ఇచ్చిన సలహాలే :

    ఇచ్చిన సలహాలే :


    ప్రజారాజ్యం పార్టీ నాశనానికి నాగబాబు ఇచ్చిన సలహాలే కారణమని ఆయన దుయ్యబట్టారు. "నువ్వు ఎంతు ఘాటుగా మాట్లాడితే అంత ఘాటుగా నేను సమాధానం ఇస్తాను" అని చెప్పారు. తన కెరీర్ గురించి మాట్లాడే ముందు నాగబాబు ఆయన జబర్దస్త్ కెరీర్ ఏమిటో చూసుకోవాలని ఆయన అన్నారు. తన కెరీర్ బాగానే ఉందని ఆయన అన్నారు. ఖైదీ నంబర్ 150 సినిమా ట్రైలర్ ఫెంటాస్టిక్ అని కూడా అన్నారు.

     బాగానే ఉండేది:

    బాగానే ఉండేది:


    అక్కడితో కథ ముగిసిపోతే బాగానే ఉండేది ఒక్క రోజు సైలెంట్ గా ఉన్న వర్మ గౌతమీపుత్ర శాతకర్ణి వచ్చిందో లేదో ఇంకో సారి వృంబించాడు... బాలయ్య తన 100వ సినిమాతో మెగా ఫ్యామిలీకంటే 150 రెట్లు గొప్పగా కనిపిస్తున్నాడూ అంటూ ట్వీట్ చేసి ఖైదీ సినిమా ఎక్కడ ఉందో చెప్పాడు. అయితే ఇదొక మచ్చు తునక మాత్రమే... దీనికి ముందూ కొన్ని ట్వీట్ లు ఉన్నాయి... వెనక మరికొన్ని రావొచ్చు...

    100 చీర్స్ నీకూ బాలయ్య కీ :

    100 చీర్స్ నీకూ బాలయ్య కీ :

    క్రిష్ నా జడ్జిమెంట్ ఇంకో సారి నిజం చేసావ్ 100 చీర్స్ నీకూ బాలయ్య కీ అంటూ ఇంకో ట్వీట్ కూడా ఉంది. మొత్తానికి నాగబాబు అనవసరంగా రామ్ ని కెలికాడు. అప్పటికే ఎప్పుడో ముగిసి పోయిన గొడవ ని పకి లేపి అన్నయ్య మీద తన ప్రేమని చూపించుకున్నా అనుకున్నాడు గానీ మరీ ఇలా పుట్తలో ఉన్న పాము ని కదుపుతున్నా అని మర్చిపోయాడు.
     తెలుగు సినిమా:

    తెలుగు సినిమా:


    గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ ప్రశంసలు జల్లు కురిపించడం విశేషం. తెలుగు సినిమాను గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లారని దర్శకుడు క్రిష్‌ను వర్మ ఆకాశానికెత్తేశాడు. హీరో బాలకృష్ణ, డైరెక్టర్‌ క్రిష్‌కి సెల్యూట్‌ అంటూ రామ్‌గోపాల్‌వర్మ ట్వీట్ చేయడం కొసమెరుపు.

     ఆ అక్కసుతోనే:

    ఆ అక్కసుతోనే:


    యధార్ధ కథతో సినిమాను గర్వించేలా చిత్రీకరించారని, అరువు తెచ్చుకునే కథ కంటే యధార్థ అంశంతో సినిమా తీసి అకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారని రామ్‌గోపాల్‌వర్మ పరోక్షంగా చిరు సినిమాను విమర్శించారు. నాగబాబు వర్మను అక్కు పక్షి అన్న దగ్గర్నుంచి పూర్తి యాంటీగా మారాడని, ఆ అక్కసుతోనే చిరంజీవి సినిమాపై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని ఆర్జీవీపై చిరు అభిమానులు మండిపడుతున్నారు.

    English summary
    "What Bahubali started GPSK is taking telugu cinema way more forward and even now if Mega people don't realise they might become Mini" Tweets Ram Gopal varma
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X