twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పండగ చేస్కో’ చిత్రంలో రామ్ న్యూ లుక్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హ్యాట్రిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'సింహా' నిర్మాత పరుచూరి కిరీటి యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్టెనర్ 'పండగ చేస్కో'. ఈ చిత్రం నాన్ స్టాప్‌గా షూటింగ్ జరుగుతోంది.

    ఈ చిత్ర విశేషాలను దర్శకుడు గోపీచంద్ మలినేని తెలియజేస్తూ 'మా పండగ చేస్కో చిత్రం షూటింగ్ నాన్ స్టాప్‌గా జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. కాస్ట్యూమ్ తో పాటు రామ్ గెటప్ కూడా డిఫరెంట్ డిజైన్ చేయడం జరిగింది. అందరు ఆర్టిస్టులు పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. సెప్టెంబర్‌లో అమెరికా షెడ్యూల్ ప్లాన్ చేసాం. నవంబర్ 15 వరకు జరిగే షూటింగుతో టోటల్ గా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. రామ్ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్లుగా హీరో క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టెనర్‌గా రూపొందే ఈ చిత్రానికి 'పండగ చేస్కో' టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ గా ఉంటుంది. థమన్ చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇస్తున్నారు. యూత్ తో పాటు అందర్నీ ఎంటర్టెన్ చేసే సినిమా ఇది' అన్నారు.

    Ram's new look for 'Pandaga Chesko'

    ఎనర్జిటిక్ స్టార్ రామ్, రాకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్, సాయి కుమార్, రావు రమేష్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, సుప్రీత్, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యు సింగ్, వెన్నెల కిషోర్, ప్రభాస్ శీను, ఫిష్ వెంకట్, తేజస్విని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: అనిల్ రావిపూడి, కెమెరా: ఆర్థర్ విల్సన్, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సంగీతం: థమన్, పాటలు: భాస్కర భట్ల, శ్రీమణి, డాన్స్: రాజు సుందరం, కాస్ట్యూమ్స్: రమేష్, మేకప్: టి.నాగు, చీఫ్ కో-డైరెక్టర్ : బి.సత్యం, ప్రొడక్షన్ కంట్రోలర్: యోగానందం, సమర్పణ: పరుచూరి ప్రసాద్, నిర్మాత: పరుచూరి కిరీటి, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: గోపీచంద్ మలినేని.

    English summary
    
 Ram's new look from his next film, Pandaga Chesko. The movie shooting is progressing at brisk pace. The movie team is planning a long schedule in America in the month of September.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X