twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామాయణానికి సుప్రీమ్‌ సినిమాకూ ఓ లింకుందట అదేంటంటే....?

    |

    "సుప్రీమ్‌ చిత్రం భావోద్వేగాలతో ముడిపడిన అంశం. వాణిజ్య విలువలు, వినోదాంశాలు పుష్కలంగా ఉంటాయి. పతాక సన్నివేశాల్లో చివరి 20 నిమిషాలు కీలకం. ఆరుగురు వ్యక్తులు ఆ ఎపిసోడ్‌ను రక్తికట్టిస్తారు. వారు ఎవరనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్" అని అంటున్నారు అనిల్‌ రావిపూడి. తొలి చిత్రం 'పటాస్'తో విజయాన్ని చవిచూసిన ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'సుప్రీమ్‌' ఈ రోజే విడుదల కానుంది..

    సినిమాలో హీరో సాయి ధరమ్ టాక్సీ డ్రైవర్‌ బాలు గా కనిపించనున్నాడు. బాలూ టాక్సీ పేరు సుప్రీమ్‌. రోడ్డుమీద ఎవరైనా అనవసరంగా హారన్ కొడితే చాలు ఉన్న పనిని పక్కనపెట్టి వారితో గొడవకు దిగుతాడు బాలు. ఇక హీరోయిన్ పేరు బెల్లం శ్రీదేవి కామెడీ పోలీస్‌.మరీ కర్తవ్యం రేంజ్ కాదుగానీ అందం కోసం ఈ లేడీ పోలీస్ ని వాడుకున్నారన్న మాట.

    Ramayana is inspiration for supreme..!?

    రామాయణానికి సుప్రీమ్‌ సినిమాకూ ఓ లింకుందట అదేంటంటే.... అక్కడ రాముడి ఆజ్ఞ మీద హనుమంతుడు వాయువేగంతో వెళ్తాడు. ఇక్కడ మా హీరో కారు వేగంతో వెళ్తాడు. ఇంతకీ బాలు కి ఆజ్ఞ జారీ చేసిన రాముడు ఎవరు? రాజేంద్రప్రసాద్‌గారా? సాయికుమార్‌గారా? హీరోయినా? బాలు సుప్రీమ్‌ తో కలిసి ఎన్ని సాహసాలు చేసాడూ అనేది తెరమీదే చూడాలి. కీలక పాత్రలో ఓ బాలనటుడు కూడా నటించాడట. అయితే అతని పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్....

    ఇంకో విశేషం ఏమిటంటే "అందం హిందోళం... అధరం తాంబూలం.."ను ఇందులో రీమిక్స్ చేయడం... ఈ పాట కోసం భారీ సెట్టింగ్స్ వేయడంతో పాటు.. వందల మంది డ్యాన్సర్లను ఉపయోగించారు. అందరికీ చాలా కాస్ట్లీ కాస్ట్యూమ్స్ వాడారు. దీని వల్ల ఈ పాట చిత్రీకరించే సమయంలో రోజుకు రూ.25 లక్షల దాకా ఖర్చయిందట. ఇంత భారీ ఖర్చుతో ఐదారు రోజులు పాటు ఈ పాటను చిత్రీకరించారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో వచ్చిన రిచెస్ట్ సాంగ్స్‌లో ఇదీ ఒకటిగా నిలవనుందట..

    English summary
    Sai Dharam tej's Supreme Telugu film, written and directed by Anil Ravipudi Releasing Today
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X