twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోపంగా వర్మ తాజా ట్వీట్ లు: వాళ్ళు ఊర కుక్కలు.., ముళ్ళ బూట్లతో తన్నాలి అంటూ ....

    దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి మీద దాడి సంఘటన మీద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించాడు. బ‌న్సాలీపై దాడి చేసిన రాజ్‌పుత్ కార్ణి సేన కార్య‌క‌ర్త‌ల‌ను ఊర‌కుక్క‌ల‌తో పోల్చాడు..

    |

    మనో భవాలు దెబ్బతినటం ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్న పదం. దీనికి అన్నిటికన్నా ముందుగా బలయ్యేది సినిమా.., సినీ దర్శకులూ, నటులే... ఒక చారిత్రకాంశాన్ని సినిమాగా తీస్తున్నప్పుడు ఖచ్చితంగా కొంత నాటకీయతను జోడించాల్సి వస్తుంది కేవలం మనం విన్నంత వరకే చూపించాల్సి వస్తే అదొక డాక్యుమెంటరీ అవుతుంది. చరిత్రలోని ఒక సంఘటనని తీసుకొని దాని చుట్టూ కథ అల్లుకుంటాడు దర్శకుడు కానీ.... వేరుగా తీస్తున్నారంటూ ఆ దర్శకుడి పైనే దాడి చేస్తే...???

    ఇప్పుడు బాలీవుడ్ లో వస్తున్న "పద్మావతి అనే సినిమా" విషయం లో అదే జరిగింది... బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న పద్మావతి మూవీ షూటింగ్‌కి వ్యతిరేకంగా కర్నిసేన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పద్మావతి చిత్రంలో చారిత్రాత్మక అంశాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించిన కర్నిసేన కార్యకర్తలు..జైగఢ్ కోట వద్ద జరుగుతున్న షూటింగ్‌ను అడ్డుకున్నారు. రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని ఖండించిన రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ లు కూడా సంచలనం అయ్యాయి...

     పిడిగుద్దులు:

    పిడిగుద్దులు:

    పద్మావతి సినిమా యూనిట్ పై రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు సంజయ్‌లీలా బన్సాలీ ని చెంపదెబ్బలు కొట్టడంతో పాటు పిడిగుద్దులు కురిపించారు. ఘటన జైగఢ్ కోట వద్ద జరిగింది. దాడితో సినిమా టీం మొత్తం షాక్‌కు గురైంది. సినిమాలో రాజ్‌పుత్ రాణిని హీనంగా చూపిస్తున్నారని రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు ఆరోపించారు.

    జాతికి క్షమాపణలు చెప్పాలని:

    జాతికి క్షమాపణలు చెప్పాలని:

    సినిమాలో రాజ్‌పుత్ రాణిగా దీపికా పదుకొణే, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీకి రాణి పద్మావతికి మధ్య ప్రేమాయణం జరిగినట్లు దృశ్యాలు చిత్రీకరిస్తున్నారని రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చరిత్రను వక్రీకరిస్తూ తీసిన దృశ్యాలను తొలగించి భన్సాలీ జాతికి క్షమాపణలు చెప్పాలని రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ ఘటన మీద రామ్ గోపాల్ వర్మ స్పందించాడు

    'పద్మావతి'గానే :

    'పద్మావతి'గానే :

    12, 13శతాబ్దాలకు చెందిన రాణి పద్మావతి గాథ ఇది. సినిమా పేరు కూడా 'పద్మావతి'గానే నిర్ణయించారు. వివాహితురాలై పద్మావతిని అలౌద్దిన్ ఖిల్జీ మోహించడం.. ఆమె కోసం అతడు సృష్టించిన రక్తపాతం కథాంశంగా ఈ సినిమా రూపొందనుంది. చారిత్రాత్మక కథ...అందులోనూ భన్సాలీ డీల్ చేస్తున్న సబ్జెక్ట్‌ కాబట్టి సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    ప్రేమకథాంశం :

    ప్రేమకథాంశం :

    బాజీరావ్ మస్తానీ తరువాత అంతకంటే మరో భారీ చిత్రం ‘రాణి పద్మావతి'ని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఈ చిత్రం కూడా సున్నితమైన ప్రేమకథాంశం చుట్టూ అల్లుకున్నదే అని తెలుస్తోంది. అయితే ఇందులో భారీ యుద్ధ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

    భారీ అంచనాలు:

    భారీ అంచనాలు:

    ఆ వార్ సీక్వెన్సులు బాహుబలి కంటే భారీగా ఉండేలా భన్సాలీ తెరకెక్కిస్తున్నాడు అని ముంబై చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వార్ సన్నివేశాల్లో భారీతనం అంటే - ప్రస్తుతానికి బాహుబలి చిత్రం మాత్రమే ఒక ల్యాండ్ మార్క్. దాన్ని మించిన స్థాయిలో వార్ ఎపిసోడ్ లు తెరమీదికి వస్తాయంటే... ప్రేక్షకులకు అంతమించిన నయనానందకరం ఏముంటుంది...? మొత్తానికి భన్సాలీ పద్మావతిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాజీరావ్ సూపర్ హిట్ కావడంతో దర్శకుడు భన్సాలీ కూడా మాంచి ఫామ్ లో ఉన్నాడు.

     దీపికపడుకొనే:

    దీపికపడుకొనే:

    బాజీరావు మస్తానీ, పీకూ సినిమాలతో దీపికపడుకొనే బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది. అయితే హాలీవుడ్ మూవీ త్రీబుల్ ఎక్స్ లో ఛాన్స్ రావడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలకు నో చెప్పింది. ఇప్పుడు త్రీబుల్ ఎక్స్ మూవీ కంప్లీట్ కావడంతో మళ్లీ బీటౌన్ లో తన జోరు చూపించడానికి రెడీ అవుతుంది.

    డిఫరెంట్ రోల్స్:

    డిఫరెంట్ రోల్స్:

    రామ్ లీల, పికూ, బాజీరావ్ మస్తానీ చిత్రాల్లో దీపికపడుకొనే డిఫరెంట్ రోల్స్ ప్లే చేసింది. ఈ మూవీస్ సక్సెస్ కావడంతో పాటు ఈ బ్యూటీకి నటిగా మంచి పేరు తెచ్చాయి. దీంతో తాజాగా ఈ భామ మరో వైవిధ్యభరితమైన చిత్రాన్ని అంగీకరించింది. పద్మావతి టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీకి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నాడు.

    భన్సాలీని కొట్టి :

    భన్సాలీని కొట్టి :

    ఈ నేపథ్యం లో నే సంజయ్ లీలా భన్సాలీపై దాడి జరిగింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం 'పద్మావతి' షూటింగ్ జరుగుతుండగా సెట్స్ లోకి ప్రవేశించిన కొందరు ఆందోళన కారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సెట్స్ ను ధ్వంసం చేయడంతో పాటు భన్సాలీని కొట్టి జుట్టుపట్టి లాక్కెల్లారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఓ కోటలో షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

    అవమాన పరిచే విధంగా:

    అవమాన పరిచే విధంగా:

    రాజ్ పుత్ వంశానికి చెందిన రాణి పద్మిణిని అవమాన పరిచే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆరోపిస్తూ... రాజ్ పుత్ కర్ణి సేన సభ్యులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాలతో షూటింగ్ ఆగిపోవడంతో పాటు సెట్స్ లో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. 'పద్మావతి' చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్ టైటిల్ రోల్ చేస్తున్నారు.

    రణవీర్ సింగ్ :

    రణవీర్ సింగ్ :

    అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్ సింగ్ నటిస్తున్నారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడినట్లు సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించినట్లు ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. పద్మిణి రాణి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని, పద్మిణి ఆత్మాభిమానం గల రాణి అని,

     సినిమా తీస్తే సహించబోమని:

    సినిమా తీస్తే సహించబోమని:

    చిట్టోర్‌గఢ్ కోటపై దాడి జరిగినపుడు ఆమె అల్లావుద్దీన్ కు లొంగిపోకుండా ఆత్మత్యాగం చేసిందని ఆందోళనకారులు వాదిస్తున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమా తీస్తే సహించబోమని, 'పద్మావతి' సినిమాలో వారి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నట్లు చూపిస్తే ఊరుకోబోమని ఆందోళన కారులు హెచ్చరించారు.

    ముళ్లున్న బూట్ల‌తో త‌న్నాలి అంటూ:

    ముళ్లున్న బూట్ల‌తో త‌న్నాలి అంటూ:

    ఈ సంఘటన మీద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించాడు. బ‌న్సాలీపై దాడి చేసిన రాజ్‌పుత్ కార్ణి సేన కార్య‌క‌ర్త‌ల‌ను ఊర‌కుక్క‌ల‌తో పోల్చిన వ‌ర్మ వారిని ముళ్లున్న బూట్ల‌తో త‌న్నాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. భార‌త్‌లో ఇటువంటి దాడులు జ‌ర‌గ‌డం శోచ‌నీయ‌మ‌న్న వ‌ర్మ, మూవీ మేకర్లకు సెన్సార్ బోర్డ్ తో సమస్యలుంటాయనుకున్నా... కానీ సంజయ్ లీలా బన్సాలీ దాడి ఘటనతో ఏ కోతీ, కుక్క, ఆఖరికి గాడిదలు కూడా సెన్సార్ బోర్డ్ అయిపోఅయని అర్థమవుతోంది అంటూ తన కోపాన్ని వెళ్ళ గక్కాడు.

    వర్మతో పాటు:

    వర్మతో పాటు:

    రాణి ప‌ద్మావ‌తి, అల్లావుద్దీన్ ఖిల్జీల‌కు సంబంధించి బ‌న్సాలీకి తెలిసినంత చ‌రిత్ర‌లో కార్ణిసేన కార్య‌క‌ర్త‌ల‌కు ఒక్క శాతం కూడా తెలియదనీ, ఇటువంటి దాడులను వ్యతిరేకుంచాల్సిందే అన్న అర్థం వచ్చే వ్యాఖ్యలు చేసారు. వర్మతో పాటుగా పలువురు బాలీవుడ్ దర్శకులూ నటులూ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

    English summary
    Bollywood celebrities, including filmmaker Ram Gopal Verma, Anurag Kashyap and Sonam Kapoor have expressed their anger after Rajput Karni Sena workers created ruckus and vandalised the sets of filmmaker Sanjay Leela Bhansali's 'Padmavati' in Jaipur, saying the entire film fraternity should come together and take a stand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X