» 

ఇక రానా వంతు... మొదలు పెట్టాడు

Posted by:

హైదరాబాద్ : సినిమా ప్రమోషన్ కి పబ్లిసిటీ...ముఖ్యంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ బాగా అవసరమవుతోంది. తన బాబాయ్ తాజా చిత్రం మసాలా ప్రమోషన్ ని మొదలెట్టాడు. దగ్గుబాటి రానా దగ్గుబాటి రానా,సురేష్ బాబు, వెంకటేష్ కలిసి మసాలా చిత్రం ప్రెవైట్ స్క్రీనింగ్ వేయించుకుని చూసారు. సినిమా పొగడ్తలలో ముంచెత్తుతూ ట్వీట్ చేసాడు.

రానా ట్వీట్ లో... "ఇప్పుడే మసాలా చూసాను...రామ్ ,వెంకటేష్ నటన అవుట్ స్టాండింగ్... పూర్తిగా నవ్వించే చిత్రం. వాచ్ క్లైమాక్స్ ఇన్ మై ఐమాక్స్...".వెంకటేష్, రామ్ ప్రధాన పాత్రల్లో విజయభాస్కర్‌.కె దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం 'మసాలా' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు క్లీన్ 'U' సర్టిఫికెట్ జారీ చేసింది. నవంబర్ 14న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

హిందీలో విజయవంతమైన 'బోల్‌ బచ్చన్‌' ఆధారంగా రూపొందుతోంది. వెంకటేష్‌, రామ్‌ సరసన అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డి.సురేష్‌బాబు, స్రవంతి రవికిషోర్‌ నిర్మాతలు. డి.రామానాయుడు సమర్పకులు. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం మొత్తం రన్నింగ్ టైం 145 నిమిషాలు. ఇద్దరు హీరోలను ఏమాత్రం తగ్గకుండా సినిమాలో ఫోకస్ చేసారు. వెంకటేష్, రామ్ ఇంట్రడక్షన్ సాంగ్ సినిమా ప్లస్సవుతుందనే టాక్ వినిపిస్తోంది. పాటలన్నీ ఎంతో అందంగా చిత్రీకరించారట.

సినిమా మొత్తం ఫుల్ కామెడీతో వినోద ప్రధానంగా సాగిందని, వెంకటేష్, రామ్ తమ కెరీర్లోనే బెస్ట్ పెర్పార్మెన్స్ ఇచ్చారని, సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా సాగుతోందని, నిర్మాణ విలువలు బాగున్నాయని....హిందీలో హిట్టయిన సినిమాకు రీమేక్ కావడం, వెంకీ, రామ్ లాంటి స్టార్లు నటించడంతో సినిమా మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు.

Read more about: ram, venkatesh, masala, rana, రామ్, వెంకటేష్, మసాలా, రానా
English summary
Rana Daggubati tweeted “Just watched #Masala Venki and Ram were outstanding!! A total laugh riot. “Audience watch the climax in my Imax”.
Please Wait while comments are loading...