»   »  ‘బాహుబలి’...అవంతికను శివుడు రేప్ చేసాడు!

‘బాహుబలి’...అవంతికను శివుడు రేప్ చేసాడు!

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా ఇటీవల విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో యువతకు నచ్చిన రొమాంటిక్ సీన్ ఏదంటే..... శివుడు, అవంతిక మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశం. ఆపై వచ్చే పచ్చబొట్టేసిన సాంగ్. అయితే ఈ సీన్‌పై మహిళా జర్నలిస్టు అన్నా వెట్టికాడ్ రాసిన వ్యాసం ఇపుడు చర్చనీయాంశం అయింది.

‘ది రేప్ ఆఫ్ అవంతిక' పేరుతో ప్రముఖ ఆంగ్లపత్రికలో రాసిన ఆ వ్యాసంలో ఆమె దర్శకుడు ఆ సీన్‌ను మలిచిన తీరును తప్పుబట్టారు. అవంతిక అనుమతి లేకుండా దొంగచాటుగా పచ్చబొట్టు వేయడం, అవంతిక అనుమ‌తి లేకుండా ఆమె జుట్టు ముడివిప్పి... ఆమె వ‌స్ర్తాలు తొల‌గించి...అడవిలో దొరికే సహజ రంగులతో ఆమెకు లిప్ స్టిక్ అద్దడం, కాటుక పెట్టడంపై విమర్శలు గుప్పించారు.

 <iframe width=" title=" " data-cl-slideshow="" data-cl-title=" " data-cl-description="" data-cl-imageid="46947-0"/>

శివుడి పాత్ర అవంతిక పాత్ర పూర్తిగా తప్పుగా ప్రవర్తించింది. బాహుబలి లాంటి అద్భుతమైన విజువల్స్, పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాలో ఓ అపరిచితుడు, ఓ అమ్మాయిని ఇలా చేసి...ఆమెను ముగ్గులో దించి ప్రేమ‌లో ప‌డేయ‌డం చూస్తే యువ‌త‌కు ఎలాంటి సందేశం ఇచ్చిన‌ట్ల‌వుతుద‌ని ఆమె త‌న వ్యాసంలో ప్ర‌శ్నించారు.

బాహుబలి సినిమాపై ఈ కోణంలో ఇప్పటి వరకు ఎవరూ ఆలోచించలేదు. సదరు మహిళా రచయిత లేవనెత్తిన అంశాలు ఆలోచించ దగినవే అని కొందరు అంటుంటే..... చిన్న విషయాన్ని మరీ బూతద్దంలో పెట్టి చూస్తున్నారు, సినిమాను సినిమాలాగా చూడాలి అని మరికొందు అంటున్నారు. ‘ది రేప్ ఆఫ్ అవంతిక' వ్యాసంపై రాజమౌళి అండ్ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary
A piece written by journalist Anna Vetticad for The Hindu newspaper is now creating a rage online.
Please Wait while comments are loading...