» 

హన్సికతో రవితేజ రొమాంటిక్‌గా.. (‘పవర్’ లోకేషన్ స్టిల్స్)

Posted by:

హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజ హీరోగా రాకలైన్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'పవర్'(అన్ లిమిటెడ్). ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది. రెజీనా సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం బల్గేరియాలోని అందమైన లొకేషన్లలో పాటల చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ లొకేషన్ స్టిల్స్ సోషల్ నెట్వర్కింగ్ ద్వారా విడుదల చేసారు.

రవితేజ, హన్సిక ఎంతో రొమాంటిక్‌గా ఉన్న ఈ ఫోటోలు మాస్ మహారాజా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రిషి, రావు రమేష్, మిర్చి సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖా వాణి, జోగి బ్రదర్స్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.

స్లైడ్ షోలో 'పవర్' లొకేషన్ స్టిల్స్....

రవితేజ మార్కు సినిమా

రవితేజ ఇమేజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి హండ్రెడ్ పర్సంట్ సూట్ అయ్యే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కమర్షియల్ ఎంటర్టెనర్

ప్రయోగాలకు వీలైనంత దూరంగా ఉంటూ...నిర్మాతలకు నాలుగు డబ్బులు తెచ్చే సినిమాలు చేస్తున్నారు రవితేజ. ‘పవర్' కూడా ఆ కోవకు చెందినదే.

నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మాట్లాడుతూ ‘తెలుగులో మొట్ట మొదటి సారి మా బేనర్లో చేస్తున్న ‘పవర్' టీజర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే తెలుగులో మా చిత్రం పెద్ద హిట్టవుతుందనే నమ్మకం మరింత పెరుగుతోంది అన్నారు.

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సంగీతం : ఎస్ఎస్. థమన్, ఫోటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటర్: గౌతం రాజు, మాటలు : కోన వెంకట్, స్ర్కీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, కో డైరెక్టర్: నందగోపాల్ కురుళ్ల, ప్రొడక్షన్ కంట్రలర్: పి.ఎ.కుమార్ వర్మ, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్(బాబి).

Read more about: ravi teja, power, bobby, hansika, రవితేజ, బాబి, పవర్, హన్సిక
English summary
Ravi Teja's Power movie location stills released. Hansika and Regina are his co-stars in this action entertainer, which has Ravi Teja playing the role of a cop. K S Ravindranath, who worked as a story writer for Balupu, is making his debut as a director with this film.

Telugu Photos

Go to : More Photos