twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ ‘పవర్’ టాక్ ఎలా ఉందంటే... (ట్వీట్ రివ్యూ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజ నటించిన ‘పవర్' మూవీ ఈ రోజు(సెప్టెంబర్ 12) గ్రాండ్‌గా రిలీజైంది. గతంలో రవితేజ నటించిన ‘బలుపు', ‘డాన్ శ్రీను' చిత్రాలతో పాటు ‘మిస్టర్ పర్ ఫెక్ట్' చిత్రాలకు స్టోరీ అందించిన పాపులర్ స్క్రీన్ రైటర్ కెఎస్ రవింద్ర(బాబీ) తాజాగా ‘పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాంబినేషన్ అదిరిపోవడంతో ఈ చిత్రంపై ముందు నుండి భారీ అంచనాలే ఉన్నాయి.

    రొమాంటిక్ యాక్షన్ స్టోరీకి హై రేంజిలో కామెడీ కంటెంట్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ రచయితలు కోన వెంకట్, మోహన్ కృష్ణ, కె చక్రవర్తి లాంటి వారు ఈచిత్రానికి కథా సహకారం అందించారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేసారు. విక్రమార్కుడు, మిరపకాయ్ తర్వత మూడోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనినించారు. హాట్ హీరోయిన్లు హన్సిక, రెజీనా రవితేజతో రొమాన్స్ చేస్తూ సినిమాకు మరింత గ్లామర్ అద్దారు.

    కన్నడ ఫిల్మ్ మేకర్ రాక్ లైన్ వెంకటేష్ ఈచిత్రాన్ని తన సొంత బేనర్ రాక్ లైన్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కించారు. భారీ బడ్జెట్, భారీ తారగణం కలిగిన చిత్రం కావడంతో ప్రమోషన్లు కూడా అదే రేంజిలో నిర్వహించారు. రిలీజ్ విషయంలోనూ నిర్మాతన తన రేంజి చూపిస్తూ ఎక్కువ థియేటర్లలో విడుదల చేసారు. తమన్ అందించిన సంగీతానికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అభిమానుల కోసం ప్రత్యేకంగా బెనిఫిట్ షోలు వేసారు. మరి సినిమా చూసిన అభిమానులు ట్విట్టర్ ట్వీట్స్ రూపంలో సినిమాపై తమ అభిప్రాయాలు బయటప పెట్టారు.

    సినిమా ఫస్టాప్ వినోదాత్మకంగా ఉందని...అయితే సెకండాఫ్ లో హెవీ సెంటిమెంటు పెట్టంతో సినిమా ఓవరాల్ యావరేజ్ అని అంటున్నారు. స్లైడ్ షోలో ఫ్యాన్స్ అభిప్రాయాలు....

    కార్తీక్

    కార్తీక్

    పవర్ మూవీ సెకండాఫ్ బోరింగ్‌గా ఉంది. జస్ట్ యావరేజ్. రభసకు ఈక్వల్ గా ఉంది.

    యతి

    యతి

    మాస్ మహారాజ ఇంట్రడక్షన్ బాగుంది. ‘మాస్ అంటే బస్ పాస్ కాదు బే' డైలాగ్ బాగుంది. బ్రహ్మీ ఆణిముత్యం, ఫస్ట్ సాంగ్, దేవుడా దేవుడా...సాంగులు స్క్రీన్ పై బాగున్నాయి.

    Dr Prasadbabu @pb_tfi_fan

    Dr Prasadbabu @pb_tfi_fan

    ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ జస్ట్ ఓకే. ఓవరాల్ ఓకే మూవీ.

    Madhu ‏@madhuroyal1

    Madhu ‏@madhuroyal1

    రవితేజ, బ్రహ్మీ, సప్తగిరిలతో ఫస్టాఫ్ ఓకే...సెకండాఫ్ లెస్ కామెడీ. హెవీ సెంటిమెంట్. ఓవరాల్ యావరేజ్.

    SKN ‏@SKNonline

    SKN ‏@SKNonline

    ఎంటర్టెన్మెంట్, యాక్షన్, గ్లామర్, గుడ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్..పవర్ ఫస్టాఫ్ ఓకే...పైసా సూల్ మూవీ. హిట్ అవుతుంది.

    Soma Sekhar @Tollywood_King

    Soma Sekhar @Tollywood_King

    ఫస్టాప్ ఎంటర్టెనింగ్ ఎలిమెంట్స్ తో బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.

    Vikram Reddy @urslovelyvikram

    Vikram Reddy @urslovelyvikram

    అక్కడక్కడ కామెడీ పేలింది అంతే. ఫస్టాఫ్ యావరేజ్ అంతే. తమన్ బాబు సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ నలిపేస్తున్నాడు.

    RJV ‏@RJV4U

    RJV ‏@RJV4U

    పవర్ ఫస్టాఫ్ అలా అలా సాగి పోయింది. సబ్జెక్ట్ రోటీన్ అయినా...రవితేజ ఎనర్జీ లెవల్స్ సూపర్.

    Arun ‏@euniverse800

    Arun ‏@euniverse800

    పవర్ మూవీ ఎబో యావరేజ్. జస్ట్ ఒకసారి చూడొచ్చు.

    Shrinu Nakka ‏@Imshri09

    Shrinu Nakka ‏@Imshri09

    రోటీన్ స్టోరీ. కామెడీ సీన్లు బాగున్నాయి. కొత్తదనం లేదు.

    RJV ‏@RJV4U

    RJV ‏@RJV4U

    ఫస్టాఫ్ యావరేజ్. సెకండాఫ్ సాగదీసారు. గొప్పగా ఏమీ లేదు, కొత్తగా అస్సలు లేదు. జస్ట్ ఒకసారి టైంపాస్.

    SARKAR ‏@sunil77132

    SARKAR ‏@sunil77132

    ఫస్టాప్ కామెడీ బాగుంది. సాలిడ్ యాక్షన్. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.

    English summary
    Popular Scriptwriter Bobby aka KS Ravindra, who has penned story for Blockbuster Telugu movies like Balupu, Mr Perfect and Don Seenu, is now turning independent director with Mass Maharaja Ravi Teja's latest outing Power the promos of which have created lot curiosity among the film goers. This much-talked about film has released in theatres across the globe today (September 12).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X