twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మూడేళ్లుగా శ్రీను వైట్ల - వర్మ మధ్య విబేధాలు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘ఆగడు' సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ చిత్రంపై, దర్శకుడు శ్రీను వైట్లను ఉద్దేశించి ట్విట్టర్ ద్వారా సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. వర్మ ఇలా రెచ్చి పోవడాని కారణం....‘ఆగడు' చిత్రంలో వర్మను ఉద్దేశించి కొన్ని సెటైరిక్ సీన్లు ఉండటమే అని తెలుస్తోంది.

    వాస్తవానికి శ్రీను వైట్ల, రామ్ గోపాల్ వర్మ మధ్య మూడేళ్ల క్రితమే విబేధాలు మొదలయ్యాయని ఫిల్మ్ నగర్ టాక్. 2011లో వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం అప్పలరాజు' చిత్రంలోని ఓ పాటలో ‘నమో వెంకటేశ అన్న శ్రీను వైట్లకి పంగ నామమే మిగిలె చివరికి' అనే సెటైర్ ఉంది. ఈ పాటలో ఒక్క శ్రీను వైట్ల మీదే కాదు చాలా మంది దర్శకులపై సెటైర్లు ఉన్నాయి.

    మిగతా డైరెక్టర్లు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా...శ్రీను వైట్ల మాత్రం సీరియస్ గానే తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ జనాలు చర్చించుకుంటున్నారు. ‘దూకుడు' సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం మహేష్ బాబుకు బదులు రామ్ గోపాల్ వర్మ ఫోటోను విలన్లకు పంపుతాడు. ఆ తర్వాత ‘బాద్ షా' చిత్రంలో కూడా వర్మ రియల్ లైఫ్ క్యారెక్టర్ ను ఫోకస్ చేసేలా రివేంజ్ నాగేశ్వరరావు అనే క్యారెక్టర్ పెట్టారు. ఇందులో కొన్ని డైలాగులు కూడా వర్మను టార్గెట్ చేసే విధంగా ఉంటాయి.

    Reason behind RGV satires Aagadu

    తాజాగా ఆగడు చిత్రంలోనూ వర్మపై సెటైర్లు ఉన్నాయి. వర్మ ఎప్పుడూ ట్విట్టర్లో ట్వీట్స్ చేయడాన్ని సెటైరిక్ గా చూపించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న వర్మ ‘ఆగడు' సినిమా చూసిన తర్వాత....ఆ సినిమాపై ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేయడం మొదలు పెట్టారు.

    ‘ఆగడు' 75 కోట్ల సినిమా అయితే ‘మగధీర' 750 కోట్ల సినిమా అవుతుందని సెటైర్లు వేసాడు. ‘ఆగడు చిత్రంలోని డైలాగ్ అండ్ డైలాగ్ మ్యాడ్యులేషన్స్ స్పెషల్ అవార్డు కోసం ఆస్కార్‌కు పంపాలి. వారు నిజంగా ప్రపంచ సినిమాలో నిలబడతారు' అంటూ వర్మ సెటైర్లు వేసారు. ను వైట్ల, మహేష్ బాబుల సబ్జెక్టివ్ డెరివేషన్ చూస్తే లియోనార్డో కాప్రియో మరియు మార్టిన్ స్కోర్సెస్ గుర్తొస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు వర్మ.

    English summary
    Ram Gopal Varma made some sarcastic comments on 'Aagadu' in his microblogging page.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X