twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా మారిందంటూ రేణు దేశాయ్

    By Srikanya
    |

    హైదరాబాద్ :" చాలా మారిపోయింది. 15 సంవత్సరాల క్రితం అంబాసిడర్ లు, ఆటో రిక్షాలు ఉండేవి..ఇప్పుడు అన్నీ పోష్ కార్లే ....ఎయిర్ పోర్ట్ నుంచి సిటీకు వచ్చే 15 కిలోమీటర్లు చాలా ఆనందాన్ని కలుగ చేస్తున్నాయి ", అంటూ హైదరాబాద్ గురించి రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. అలాగే హైదరాబాద్ తనకు హోమ్ టౌన్ అని అంది. ఇక తనకు హైదరాబాద్ లో ఇరానీ చాయ్ చాలా ఇష్టమైనదని అంది. అలాగే చట్నీస్ రెస్టారెంట్ లో స్లిమ్ ఇడ్లీ తినేదాన్నని, బిర్యాని అంటే చాలా ఇష్టమని వివరించింది.

    తెలుగు పరిశ్రమకి వస్తే అమ్మ ఇంటికి వచ్చినట్టే. మరాఠీ పరిశ్రమలో ఉంటే అత్త ఇంట్లో ఉన్నట్టు అన్నారు రేణుదేశాయ్‌. పవన్‌కల్యాణ్‌ నుంచి విడిపోయాక పూణేలో నివాసం ఉంటున్న రేణుదేశాయ్‌ సొంత పరిశ్రమ మరాఠీలో సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. తన దర్శకత్వంలోని రెండో సినిమా ఇష్క్‌ వాలా వ్‌ తెలుగులోనూ త్వరలో రిలీజవుతోంది.

    రేణు దేశాయ్ మాట్లాడుతూ...చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినీపరిశ్రమకి వస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. రెండేళ్ల నుంచి మరాఠీలో సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నా. మంగళాష్ఠక్‌ నా తొలి సినిమా. మరాఠీలో పెద్ద విజయం సాధించింది. ప్రస్తుతం రెండో సినిమా ఇష్క్‌ వాలా లవ్‌ కి దర్శకత్వం వహించాను. చిత్రీకరణ సహా తెలుగు అనువాదం కూడా పూర్తయింది. 17న రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ హుదూద్‌ ప్రభావంతో సినిమాలన్నీ వాయిదా పడ్డాయి.

    ఇష్క్‌ వాలా లవ్ ఓ చక్కని రొమాంటిక్‌ లవ్‌స్టోరి. యూనివర్శల్‌ కాన్సెప్టుతో తెరకెక్కింది. అమ్మాయి-అబ్బాయి కలుస్తారు. ప్రేమించుకుంటారు. గొడవపడి విడిపోతారు. సంఘర్షణ నడుస్తుంది. నవతరం అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యని ఈ సినిమాలో చర్చించాం. పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగిన ఓ అమ్మాయి అత్త ఇంటికి వెళ్లాక ఎన్నో చికాకుల్లో పడుతుంది. అది సబబేనా? అనేది టచ్‌ చేశాం. ప్రేమ పెళ్లి అంటే ఒకప్పుడు భయపడేవారు. ఇప్పుడు జనరేషన్‌ మారింది.

    నా నిజ జీవిత అనుభవాలేవీ తెరపై చూపించలేదు. నా బంధువులు, స్నేహితుల్ని ఇలా చూశాను. వారంతా పెళ్లిళ్లు ఆలస్యంగానే చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత పెద్ద పొజిషన్‌లో ఉన్న ఉద్యోగాల్నే వదులుకోవాల్సిన పరిస్థితి. అవన్నీ తెరపై చూపిస్తున్నాం. సమస్యని చూపిస్తున్నాం కదా! అని సీరియస్‌గా ఉండదు. ఫన్నీగా ఉండే చిత్రమిది. అదినాధ్‌-సులగ్న పాణిగ్రాహి జంట చక్కగా నటించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఆహ్లదకర చిత్రమిది. శ్రీ ఆద్య ఫిల్మ్‌స సమర్పణలో అకీరా ఫిలింస్‌ పతాకంపై తెరకెక్కించాం.

    Renu Desai about 15 years back Hyderabad

    మా అబ్బాయి అకీరా నందన్‌ సినీఆరంగేట్రంపై ఎలాంటి ప్లాన్‌ చేయలేదు. వాస్తవంగా ఈ సినిమాలో చిన్నపిల్లాడితో ఓ సన్నివేశం ఉంది. కొందరు పిల్లల్ని పరిశీలించాక అకీరా అయితే సరిపోతాడు కదా! అనిపించింది. ఒకే ఒక్క సన్నివేశం. తల్లీ బిడ్డల అనుబంధంపై ఉంటుంది. ఆ సన్నివేశంలో అకీరా మెరుపులా కనిపిస్తాడు. ఓ తల్లిగా ఎమోషనల్‌ సన్నివేశమిది. చాలా సెంటిమెంట్‌ ఎటాచ్‌మెంట్‌ కుదిరింది. అకీరా తెరంగేట్రంపై పవన్‌ కల్యాణ్‌కి కూడా చెప్పాను. తను నవ్వేశారు.

    మంచి కథలతో రచయితలు వస్తే, తెలుగులోనూ దర్శకత్వం వహించి, నిర్మించడానికి సిద్ధం. అలాగే నేను నటించాలంటే విషయం ఉన్న కథ, పాత్ర లభించాలి. ప్రస్తుతానికి మరాఠీతో పాటు హిందీలోనూ అవకాశం ఉంది. అక్కడా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నా. ఏదైనా సమస్య ఉంటే నేనున్నా అని పవన్‌ మాటిచ్చారు. నా సినిమాకి ఏదైనా సమస్య వస్తేనే పవన్‌ని సాయం అడుగుతా. ఇప్పటివరకూ ఏ సమస్యా లేదు. సమస్య లేనప్పుడు సహాయం అవసరం కూడా లేదు. నా సినిమాల కథల విషయంలో పవన్‌తో చర్చిస్తుంటాను.

    పుణె వెళ్లిపోయి అక్కడ మరాఠి సినిమాలు చేసుకుంటున్న రేణు దేశాయ్.. వీలైతే ఇక్కడ కూడా పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేస్తానని చెబుతోంది. ఇటీవలే ఆమె డైరెక్ట్ చేసి నిర్మించిన చిత్రం ఇష్క్ వాలా లవ్ మూవీ త్వరలోనే తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది.
    ఇష్క్ వాలా లవ్' కన్నా ముందే 'మంగలాస్టక్ వన్స్ మోర్' చిత్రాన్ని నిర్మించిన రేణు తాజాగా మరో హిందీ సినిమాని డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారట.

    అయితే మరి నేరుగా తెలుగులో ఎప్పుడు నటిస్తారు, ఎప్పుడు డైరెక్ట్ చేస్తారని అడగ్గా.. త్వరలోనే ఆరోజూ వస్తుందని చెబుతూ వీలైతే పవన్ తోనే ఓ సినిమా చేయాలనుందని తన మనసులో మాటని బయటపెట్టిందామె. అన్నట్లు ఇష్క్ వాలా లవ్ మూవీలోనూ రేణుతోపాటు ఆమె తనయుడు అకీరా చిన్నపాటి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

    అలాగే ...చిత్ర నిర్మాణానికి సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ తనకు గురువు అని సినీనటి, దర్శకురాలు రేణుదేశాయ్ అన్నారు. తాను 1999 నుంచి చిత్ర నిర్మాణంలో మెలుకువలు నేర్చుకుంటున్నానని ఆమె తెలిపారు. నా జీవితంలో పవన్ కళ్యాణ్ కంటే మంచి టీచర్ ఎవరూ లేరు అని సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో రేణు దేశాయ్ తెలిపారు. ఫిల్మ్ మేకింగ్ పరిపూర్ణతను సాదించడానికి సహకరించిన పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటానని ఆమె అన్నారు.

    అయితే జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా చోటు చేసుకుంటాయని, తాను తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను వాస్తవానికి ఆగస్టు 26 తేదిన విడుదల చేయాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాల వలన ట్రైలర్ విడుదల కార్యక్రమం సెప్టెంబర్ 2 తేదికి వాయిదా పడింది. అయితే ఆరోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడం యాదృచ్చికంగా జరిగిందన్నారు.

    అయితే తనకు ఫిల్మ్ మేకింగ్ లో మెలుకువలు నేర్పిన పవన్ కళ్యాణ్ జన్మదినం రోజున విడుదల చేయడం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తానని ఆమె అన్నారు. ఎక్కడో చదివాను, యాదృచ్చికంగా జరిగే సంఘటనలు మన ఆలోచనలకు దేవుడు ఇచ్చే సమాధానాలని.. ఇదే విషయాన్ని పవన్ తో చెప్పితే నవ్వి ఊరుకున్నారని రేణుదేశాయ్ తెలిపారు.

    English summary
    "Hyderabad used to be full of ambassadors and auto-rickshaws, and now there are all posh cars. Traveling from airport to city through this 15 km stretch real makes me happy", says Renu Desai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X