twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ గురించి రేణు దేశాయ్ ఏం మాట్లాడింది?

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''అకిరాను తెరకు పరిచయం చేయడం సెంటిమెంట్‌గా భావించాను. అకిరా నటిస్తాడన్న మాట చెప్పినప్పుడు పవన్‌కల్యాణ్‌కి నవ్వేశారు. ఈ సినిమా విషయంలో పవన్‌ అందించిన ప్రోత్సాహం మరిచిపోలేనిది. 'నీకు ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నాను' అని పవన్‌ నాకు ధైర్యం చెప్పాడు అంటూ చెప్పుకొచ్చారు రేణు దేశాయ్.

    ‘బద్రి', ‘జాని' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రేణూ దేశాయ్‌ తర్వాత పవన్ తో జీవన ప్రయాణం మొదలెట్టారు. అయితే రకరకాల కారణాలతో ... పవన్‌కల్యాణ్‌ నుంచి విడిపోయాక తన స్వస్థలం పూణేకు వెళ్లిపోయారు. ప్రస్తుతం మరాఠీ సినిమాలను తీస్తున్న ఆమె తాజాగా ‘ఇష్క్‌ వాలా లవ్‌' అనే సినిమాతో డైరెక్టర్‌గానూ మారారు. ఆ సినిమాను అదే పేరుతో తెలుగులో డబ్‌ చేసిన ఆమె దాని ప్రమోషన్‌ నిమిత్తం హైదరాబాద్‌ వచ్చారు..

    భారతీయ వివాహ వ్యవస్థలో ఎన్నో మార్పులొస్తున్నాయి. ఇరవయేళ్ల క్రింది నాటి పరిస్థితులు నేడు లేవు. నేటితరం అమ్మాయిలకు పెళ్లి విషయంలో కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. వివాహం తమ కెరీర్‌కు ప్రతిబంధకంగా మారుతుందనే అభద్రతాభావంలో వారున్నారు. ఇలాంటి సున్నితమైన అంశాల్ని చర్చిస్తూ ప్రేమ, పెళ్లి, కెరీర్‌పై నవతరం మనోభావాలకు దర్పణంలా ఇష్క్‌వాలా లవ్ చిత్రాన్ని రూపొందించానని చెప్పారు రేణూదేశాయ్. ఈ సందర్భంగా సినిమా గురించి, పవన్ గురించి రకరకాల విషయాలు మాట్లాడారు

    మురిసిపోయా...

    మురిసిపోయా...

    ''నేను దర్శకత్వం వహించిన తొలి సినిమాతో మా అబ్బాయిని తెరకు పరిచయం చేయడం ఒక తల్లిగా నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అకీరాని తెరపై చూసుకొని మురిసిపోయా'' అన్నారు రేణుదేశాయ్‌.

    పవన్ ఫ్రెష్ గా ఉందన్నారు

    పవన్ ఫ్రెష్ గా ఉందన్నారు

    ఇదివరకు నిర్మించిన 'మంగలాష్టక్‌ వన్స్‌మోర్‌'ను పవన్‌ కల్యాణ్‌ చూశారు. 'ఇష్క్‌ వాలా లవ్‌' ప్రచార చిత్రాల్ని చూసి ఫ్రెష్‌గా ఉన్నాయని చెప్పారు. ఆయన ఈ సినిమా ట్రైలర్‌ చూశారు. ఆయనకు నచ్చింది. తెలుగు వెర్షన్‌ ఇప్పుడే పూర్తయింది కాబట్టి త్వరలోనే ఆయనకు చూపిస్తాను. ‘మంగళాష్టక్‌ ఒన్స్‌ మోర్‌'ను ఆయన చూశారు.

    పవన్‌కల్యాణ్‌ అవసరం లేదు

    పవన్‌కల్యాణ్‌ అవసరం లేదు

    కల్యాణ్‌బాబు ఒకటే చెప్పారు.. ‘ఏదైనా సమస్య ఉంటే నేనున్నాను' అని. నిర్మాతగా నా మొదటి సినిమాకు ఎలాంటి సమస్యా రాలేదు. అలాగే ఇప్పుడు ‘ఇష్క్‌ వాలా లవ్‌'ను కూడా ఇప్పటి దాకా ఎలాంటి సమస్య లేకుండా హాయిగా పూర్తిచేశాం. మరాఠీలో మంచి డిస్ట్రిబ్యూటర్స్‌ రిలీజ్‌ చేశారు. తెలుగులో కూడా బాగా రిలీజ్‌ కాబోతోంది. ప్రస్తుతం ఆయన సపోర్ట్‌ తీసుకోవాల్సిన అవసరం కనిపించలేదు.

    పవన్ తో ..డిస్కస్ చేసాను...చేస్తాను

    పవన్ తో ..డిస్కస్ చేసాను...చేస్తాను

    మొదటి సినిమా చేసేప్పుడే కథను ఆయనతో డిస్కస్‌ చేశాను. అలాగే ఈ సినిమా చేసేప్పుడు కూడా ఆయనతో మధ్యమధ్యలో చర్చిస్తూనే ఉన్నాను. భవిష్యత్తులోనూ ఆయనతో నా ప్రాజెక్టుల గురించి డిస్కస్‌ చేస్తాను.

    నా కథ కాదు

    నా కథ కాదు

    నా నిజ జీవిత సంఘటనలు ఏమీ ఈ సినిమాలో లేవు. ఈ సినిమా కథను నేను ఆరేడేళ్ల క్రితం రాసుకున్నా. దాన్ని డెవలప్‌ చేసుకుంటూ వచ్చా. ఇది పూర్తిగా కల్పిత కథ. నా రియల్‌ లైఫ్‌ మీకందరికీ తెలుసు. సినిమా చూస్తే, నా జీవితానికీ, ఈ సినిమా కథకూ ఏ సంబంధమూ లేదని అర్థమైపోతుంది.

    అకిరా పరిచయం చేస్తున్నానంటే..

    అకిరా పరిచయం చేస్తున్నానంటే..


    తొలిగా ఈ సినిమాలోనే అకిర ఎందుకు చేశాడని చాలామంది అడుగుతున్నారు. అకిరను ఈ సినిమాతో పరిచయం చెయ్యాలని నేను ప్లాన్‌ చెయ్యలేదు. ఇందులో హీరోయిన్‌ చిన్నపిల్లలతో మాట్లాడే సీన్‌ ఒకటి ఉంది. నేను డైరెక్టర్‌గా పరిచయమవుతున్న సినిమాలో నా కొడుకు నటుడిగా పరిచయమైతే బాగుంటుంది కదా అనిపించింది. ఆ ఆలోచన నాకు ఎమోషనల్‌గా, సెంటిమెంటల్‌గా అనిపించింది. స్నేహితులుతో, మా కుటుంబ సభ్యులతో ఈ విషయం మాట్లాడాను. అందరూ ఓకే అన్నారు. కల్యాణ్‌బాబుకు చెబితే, ఆయన నవ్వారు.

    అకిరా చేసిన సీన్...

    అకిరా చేసిన సీన్...

    అకిర ఒక్క సీను మాత్రమే ఇందులో చేశాడు. అది రెండు నిమిషాల సీను. అతను వచ్చి హీరోయిన్‌తో మాట్లాడి వెళ్లిపోతాడు. అది ఓ తల్లిగా నాకు వెరీ ఎమోషనల్‌ మూమెంట్‌.

    ఖుషీ డైరక్టర్ మ్యూజిక్ డైరక్టర్ గా...

    ఖుషీ డైరక్టర్ మ్యూజిక్ డైరక్టర్ గా...

    ఎస్‌.జె. సూర్యగారు నా సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. అంత పెద్ద డైరెక్టర్‌ నా సినిమాకి సంగీతాన్నివ్వడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నా. ఆయనతో ఈ పాట గురించి మాట్లాడినప్పుడు తనే ట్యూన్స్‌ ఇస్తానన్నారు. ఒక మంచి డాన్స్‌ నెంబర్‌ ఇచ్చారు. తొమ్మిది పాటలున్నా ఎక్కడా బోర్‌కొట్టదు. పాటలు ఎప్పుడొచ్చి ఎలా వెళ్లాయో కూడా తెలీనంతగా కథలో అవి ఇమిడిపోయాయి. మరాఠీలో ఈ పాటలు సూపర్‌ హిట్టయ్యాయి. తెలుగు పాటలు కూడా చాలా బాగున్నాయంటున్నారు. మరాఠీలో మాదిరిగానే తెలుగులోనూ టాప్‌ రైటర్స్‌ పాటలు రాశారు. చంద్రబోస్‌, వెన్నెలకంటి, రాకేందుమౌళి, భువనచంద్ర రాశారు.

    హీరోయిన్ గురించి

    హీరోయిన్ గురించి

    ‘మర్డర్‌ 2'లో చేసిన సులజ్ఞా పాణిగ్రాహి ఇందులో హీరోయిన్‌. ఇదివరకే హిందీ సీరియల్స్‌లో ఆమె ఫేమస్‌. ఎస్‌.జె. సూర్య తమిళంలో డైరెక్ట్‌ చేసిన ‘ఇసై' సినిమాలో ఆమె హీరోయిన్‌. త్వరలో అది విడుదల కాబోతోంది.

    హీరో ఎవరంటే...

    హీరో ఎవరంటే...

    మరాఠీ సినిమాలో పేరుపొందిన మహేశ్‌ కొఠారే కుమారుడు ఆదినాథ్‌ కొఠారే హీరోగా చేశాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది.

    అదే కథ...

    అదే కథ...

    ఇది వెరీ ఫ్రెష్‌ యంగ్‌ ఫిల్మ్‌. హీరో హీరోయిన్ల మధ్య నడిచే గొడవలు ఈ సినిమా. ఇది యూనివర్సల్‌ పాయింట్‌. అందరూ ఎంజాయ్‌ చేయదగ్గ ఫ్యామిలీ ఫిల్మ్‌. దీనికి భాషతో పనిలేదు. యువత.. పెళ్లి.. ఈ నేపథ్యంలో సున్నితమైన భావోద్వేగాలతో సాగే సరదా సినిమా ఇది. ఇందులో సామాజిక సమస్యలు కానీ, రాజకీయ సమస్యలు కానీ లేవు. రెండు గంటల సినిమాలో తొమ్మిది పాటలున్నాయి. ఓ అబ్బాయి, అమ్మాయి కలుసుకుంటారు. ప్రేమించుకుంటారు. గొడవ పడతారు. చివరకు వాళ్ల గొడవ ఎలా పరిష్కారమైందనేది కథ.

    ఎందుకు డబ్ చేస్తున్నానంటే...

    ఎందుకు డబ్ చేస్తున్నానంటే...


    ఈ సినిమాని నేను రాశాను, డైరెక్ట్‌ చేశాను, ప్రొడ్యూస్‌ చేశాను. ఈ సినిమాని తెలుగులో డబ్‌ చెయ్యాలని మొదట అనుకోలేదు. దీనికి ముందు మరాఠీలో ‘మంగళాష్టక్‌ ఒన్స్‌ మోర్‌' సినిమాను నిర్మించాను. అది పెద్ద హిట్టయ్యింది. అప్పట్నించీ తెలుగువాళ్లు నన్ను తెలుగులో సినిమాని డబ్‌ చెయ్యమని అడుగుతూనే ఉన్నారు. అప్పుడు ప్లాన్‌ చెయ్యలేదు. ఇప్పుడు ‘ఇష్క్‌ వాలా లవ్‌'ను నా డైరెక్షన్‌లోనే నిర్మించాను. ఈ సినిమా పబ్లిసిటీని మొదలు పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చాలా ఫ్రెష్‌ ఫీల్‌ కనిపిస్తోందనీ, దీన్నెందుకు తెలుగులో డబ్‌ చెయ్యకూడదనీ అడగడం మొదలుపెట్టారు.

    ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

    ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌


    నేను చాలామంది అమ్మాయిలను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ల మనస్థితి ఎలా ఉందనే విషయం గురించి మాట్లాడాను. వాళ్లంతా పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నవాళ్లు. పెళ్లి చేసుకుంటే కెరీర్‌ ఎఫెక్ట్‌ అవుతుందని వాళ్లలో చాలామంది చెప్పారు. ఈ విషయాన్ని మేం సీరియస్‌గా కాకుండా వినోదాత్మకంగా చూపించాం. పెళ్లి విషయంలో, అనుబంధాల విషయంలో, కెరీర్‌ విషయంలో నేటి తరం అమ్మాయిలు, అబ్బాయిల మనస్థితి ఎలా ఉందనే అంశాన్ని చూపించాం. ఇది నైస్‌ ఫన్‌ ఫిల్మ్‌. ఇది ‘యు' సర్టిఫికెట్‌ పొందిన వెరీ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.

    తెలుగులోనూ తీస్తా

    తెలుగులోనూ తీస్తా

    సమయం వచ్చినప్పుడు తెలుగులోనూ సినిమాలు తీస్తా. ప్రస్తుతానికి మరాఠీలో రెండు చిత్రాల్ని తెరకెక్కించే ఆలోచనలున్నాయి. హిందీలో సినిమా తీయాలనేది నా కోరిక. త్వరలో అక్కడ ఓ చిత్రాన్ని తీస్తా

    పవన్ ని డైరక్ట్ చేయాలంటే...

    పవన్ ని డైరక్ట్ చేయాలంటే...

    ఇష్క్ వాలా లవ్ చిత్రంతో దర్శకురాలిగా నేను తొలి అడుగువేశాను. పవన్‌కల్యాణ్ పెద్ద హీరో. ఆయన్ని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదగాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదు.

     ఎంత కష్టమో అర్దమైంది

    ఎంత కష్టమో అర్దమైంది

    జీవితంలో మొదటిసారి నేనే డైరెక్ట్‌ చేస్తూ, ప్రొడ్యూస్‌ చేశాను. ఈ రెండు పనులూ ఒక్కరే చెయ్యడం ఎంతకష్టమో అర్థమైంది. భవిష్యత్తులో నేను ప్రొడ్యూస్‌ చేస్తే, డైరెక్టర్‌ మరొకరు ఉంటారు. నేను డైరెక్ట్‌ చెయ్యాలనుకుంటే వేరే ప్రొడ్యూసర్‌తో చేస్తాను.

    ఆ స్ధాయిలో ఉంటే చేస్తా...

    ఆ స్ధాయిలో ఉంటే చేస్తా...

    తెలుగులో చెయ్యమని చాలామంది అడుగుతున్నారు. కానీ ఆ విషయంలో ఇంకా నేను నిర్ణయం తీసుకోలేదు. నేను చివరిసారి కల్యాణ్‌బాబుతో ‘జానీ' చేశాను. మళ్లీ ఆ స్థాయి ప్రొడక్షన్‌, ఆ స్థాయి డైరెక్టర్‌ ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్‌ వస్తే కచ్చితంగా పరిశీలిస్తాను.

    పవన్ ప్రేరణ...

    పవన్ ప్రేరణ...


    నేను డైరెక్టర్‌ కావడానికి, నా జీవితానికి ఒక్కరే ఇన్‌స్పిరేషన్‌. ఆయనెవరో నేను చెప్పను. దీన్ని మీరెలాగైనా అర్థం చేసుకోండి.

    అది అత్తల్లు...ఇది పుట్టిల్లు

    అది అత్తల్లు...ఇది పుట్టిల్లు



    హైదరాబాద్‌లో 1999 నుంచి ఉన్నాను. పూణే నుంచి ‘బద్రి' సినిమా షూటింగ్‌ కోసం పద్దెనిమిదేళ్ల వయసులో వచ్చాను. తెలుగు ప్రేక్షకులకు ఎక్కువ సన్నిహితంగా భావిస్తాను. నాకు హైదరాబాద్‌ పుట్టిల్లులా, పూణే అత్తవారిల్లులా అనిపిస్తుంటుంది. ఇప్పుడు హైదరాబాద్‌ వస్తే అమ్మ ఇంటికి వచ్చినట్లుగా ఉంది.

    రిలీజ్ ఎప్పుడు

    రిలీజ్ ఎప్పుడు


    మొదట 17న రిలీజ్‌ అనుకున్నాం. ఉత్తరాంధ్ర తుఫాను కారణంగా 24కు పోస్ట్‌పోన్‌ చేశాం. రేణు దేశాయ్ స్వీయ నిర్మాణంలో 'ఇష్క్‌ వాలా లవ్‌' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. మరాఠీలో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలవుతోంది. ఆదినాథ్‌ కొఠారి, సులగ్న పాణిగ్రాహి జంటగా నటించారు. పవన్‌కల్యాణ్‌, రేణుదేశాయ్‌ తనయుడు అకిరానందన్‌ కీలక పాత్రలో నటించాడు.

    English summary
    The Telugu version of Ishq Wala Love is all set to release on October 24. It is directed by Renu Desai, ex-wife of actor Pawan Kalyan. Adinath Kothare and Sulagna Panigrahi are playing the lead roles in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X