twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది!(‘మా’ఎలక్షన్ ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.......దాదాపు 700 మంది సభ్యులు ఉండే ఒక సినిమా నటుల సంఘం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ‘మా' అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలకు ఇంత హైప్ రావడానికి కారణంగా ప్రముఖ నటులంతా రెండు వర్గాలుగా విడిపోయి ఎన్నికల్లో పోటీకి దిగడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రాజేంద్రప్రసాద్ వర్గం వెనక చిరంజీవి, జయసుధ వర్గం వెనక దాసరి నారాయణరావు ఉన్నాడనే ప్రచారం కూడా ఈ ఎన్నికలు రసవత్తరంగా మారడానికి మరో కారణం.

    ఇంతకు ముందు ‘మా' అధ్యక్షుడిగా మురళీ మోహన్ కొనసాగారు. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని ప్రకటిచడంతో....రాజేంద్రప్రసాద్ ‘మా' అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తొలుత ఈ విషయాన్ని ఆయన నాగబాబు, కాదంబరి కిరణ్, శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్ తదితరులకు వెల్లడించారు. వారి మద్దతు కూడా లభించడంతో మీడియా ముందుకు వచ్చి ‘మా' ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

    అప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న మురళీ మోహన్, మరికొందరికి రాజేంద్రప్రసాద్ ‘మా' అధ్యక్షుడు అవ్వడం ఇష్టం లేదు. ఆయన ఎందుకు అవ్వ కూడదు అని నాగబాబు వెళ్లి అడిగితే రాజేంద్రప్రసాద్ అర్హుడు కాదంటూ వ్యాఖ్యానించారు. నాగబాబు మురళీ మోహన్ వ్యాఖ్యలతో విబేధించారు. ఆయన్నే మేం నిలబెడతాం అంటూ తెగేసి చెప్పారు.

    దీంతో తన మాట నెగ్గించుకోవాలని నిర్ణయించుకున్న మురళీ మోహన్...రాజేంద్రప్రసాద్ ను ఓడించడానికి జయసుధను రంగంలోకి దింపారు. జయసుధ వర్గంలో ప్రముఖ నటులందరినీ తీసుకొచ్చారు. రాజేంద్రప్రసాద్‌కు ఎవరూ మద్దతు ఇవ్వకుండా తన శక్తిమేర ప్రయత్నించారు. జయసుధ ప్యానెల్ లో ఉన్న మంచు లక్ష్మీప్రసన్న వైస్ ప్రెసిడెంట్ పదవికి ఏకగ్రీవంగా ఎంపికైన విషయం తెలిసిందే. ఇంకా జయసుధ ప్యానెల్ లోతనికెళ్ల భరణి, శివకృష్ణ, నరేశ్, అలీ, రఘుబాబు, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జాబితాలో ఛార్మి ఉంది. అసలు ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు జయసుధ వర్గం జోరు చూసి గెలుపు ఆమెదే అని అంతా అనుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...

    రాజేంద్రప్రసాద్

    రాజేంద్రప్రసాద్

    తనను ఓడించడానికి మురళీ మోహన్ అండ్ కో చేస్తున్న ప్రయత్నాలను ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎండగట్టారు రాజేంద్రప్రసాద్. కుళ్లు రాజకీయాలు చేస్తున్నారంటూ మురళీ మోహన్ మీదన, జయసుధ మీద మండి పడ్డారు.

    గెలుపు

    గెలుపు

    ఈ వ్యవహారం మొత్తాన్ని పరిశీలిస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు చివరకు రాజేంద్రప్రసాద్ ను గెలిపించారు. మొత్తం 702 ఓట్లకుగాను, 394 ఓట్లు పోలయ్యాయి. ఇందులో జయసుధపై 85 ఓట్ల తేడాతో గెలుపొందారు రాజేంద్రప్రసాద్.

    కోర్టు కేసు

    కోర్టు కేసు

    ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల మొదట్లోనే వెలువడాల్సి ఉంది. అయితే ఓ కళ్యాణ్ ఈ ఎన్నికలపై కోర్టుకెళ్లారు. ఎన్నికలు నిబంధనలకు విరుద్దంగా జరిగాయని, ఎన్నికలను రద్దు చేయాలంటూ కోర్టు కెక్కారు. అయితే ఆయన పిటీషన్ ను సిటీ సివిల్ కోర్టు కొట్టి వేయడంతో ఫలితాల వెల్లడికి మార్గం సుగమం అయింది.

    ‘మా'రాజు

    ‘మా'రాజు

    గెలుపొందిన అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ....ఎన్నికల్లో తనను రకరకాలుగా ఇబ్బంది పెట్టిన విషయాలను చెప్పుకొచ్చారు. నాకు మద్దతుగా ఉన్న వారిని భయ పెట్టారు, ప్రలోభ పెట్టారు. నన్ను ఒంటిరిని చేసి అభిమన్యుడిలా వేసేద్దామనుకున్నారు. కానీ నేను అర్జునుడి లాంటి వాడినని గ్రహించలేక పోయారు అని వ్యాఖ్యానించారు.

    మా డబ్బుతో టీ కూడా తాగడంట

    మా డబ్బుతో టీ కూడా తాగడంట

    ‘మా' డబ్బుతో టీ కూడా తాగను, నేను చెప్పిన పనులు తూచ తప్పకుండా చేస్తాను. నా ప్రాణాలు పనంగా పెట్టయినా సరే అందరికీ న్యాయం చేస్తాను అని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.

    English summary
    After a lot of hullaboloo, MAA election result is out. Rajendra Prasad has won the president post, leading with 87 votes on Jayasudha. Hopefully, its a curtains down for all the allegations and controversies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X