»   » ‘ఆంధ్రా సీఎం కిడ్నాప్- తెలంగాణపై సీఎం సస్పెక్టెడ్’

‘ఆంధ్రా సీఎం కిడ్నాప్- తెలంగాణపై సీఎం సస్పెక్టెడ్’

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాలకు మారు పేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద సినిమా టైటిల్ ప్రకటించారు. నా తర్వాతి సినిమా ‘ఆంధ్రా సీఎం కిడ్నాప్డ్'...దాని ట్యాగ్ లైన్ ‘తెలంగాణ సీఎం సస్పెక్టెడ్' అని వర్మ ట్వీట్ చేసారు. ఇలాంటి కాంట్రవర్సీ టైటిళ్లు వర్మ గతంలో చాలా ప్రకటించారు. అందులో చాలా వరకు తెరకెక్కలేదు. ఇదీ కూడా అలాంటిదే అంటన్నారు. త్వరలో విడుదల కాబోతున్న ‘కిల్లింగ్ వీరప్పన్' సినిమాకు పబ్లిసిటీ పెంచడానికే వర్మ ఇలాంటి వివాదాలు క్రియేట్ చేస్తున్నారని అనేవారూ లేకపోలేదు.

గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టడానికి పోలీసులు ఎలాంటి వ్యూహాలు అనుసరించారు అనే విషయాలను వెల్లడిస్తూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్'. తెలుగు, కన్నడం, తమిళంలో విడుదల కాబోతోంది. సందీప్‌ భరద్వాజ్‌, శివరాజ్‌ కుమార్‌, రాక్‌లైన్‌ వెంకటేష్‌, పరుల్‌ యాదవ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. బి.వి.మంజునాథ్‌, ఇ.శివప్రకాష్‌, బి.ఎస్‌.సుధీంద్ర నిర్మాతలు.

''కిల్లింగ్ వీరప్పన్'' రిలీజ్ ఆపేయ్యాలని వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పెట్టిన కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన భర్త ఎంతో మంచి వాడని....కానీ సినిమాలో చెడ్డ వాడిగా చిత్రీకరించారని ఆమె ఆరోపించారు. కేసులో ఆమె పేర్కొన్న అంశాలు డిఫరెంటుగా ఉన్నాయి.

 RGV next

లంచగొండి ప్రభుత్వం, నయవంచక ఆటవిక అధికారుల నుండి అడవులని సంరక్షించడానికి తన జీవితాన్ని ధారపోసిన వీరప్పన్ ని ఈ చిత్రంలో చెడ్డవాడిగా చూపబోతున్నారు, చాలా మంది తమిళులు వీరప్పన్ ని దైవ సమానుడిగా భావిస్తారు. ఈ చిత్రంలో వీరప్పన్ ని చూపించే విధానాన్ని బట్టి రెండు రాష్ట్రాల ప్రజల మధ్యన పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి అంటూ ఆమె తన నోటీసుల్లో పేర్కొన్నారు.

అంతే కాకుండా......సెన్సార్ బోర్డు కూడా రామ్ గోపాల్ వర్మ తో చేతులు కలిపి నా భర్త కీర్తి ప్రతిష్టలను పాడు చెయ్యడానికి సిద్ధమవుతోంది అంటూ ఆమె తన నోటీసుల్లో పేర్కొన్నారు. ముత్తు లక్ష్మి ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇస్తూ...."ప్రతి బిడ్డ తన తల్లికి ముద్దొచ్చినట్టుగానే,ప్రతి భార్య తన భర్త మంచివాడనుకుంటుంది...ఒసామా బిన్ లాడెన్ భార్య ప్రకారం కూడా తన భర్త కన్నా మంచివాడు ప్రపంచంలోనే లేడు..ఇప్పుడు నా ప్రశ్నేంటంటే.. ఒసామా బిన్ లాడెన్,వీరప్పన్ కూడా మంచి వాళ్ళే అయితే మరి మహాత్మా గాంధీ గారి సంగతేంటి? అంటూ ప్రశ్నించారు.

English summary
"My next film title is "Andhra CM kidnapped" and tagline is Telangana CM suspected" RGV tweeted.
Please Wait while comments are loading...