» 

ధనలక్ష్మిపై...రామ్ గోపాల్ వర్మ మూడో పిటీషన్

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

ధనలక్ష్మిపై...రామ్ గోపాల్ వర్మ మూడో పిటీషన్
హైదరాబాద్: ఫిలిమ్ సెన్సార్ బోర్డు సభ్యురాలు ధనలక్ష్మిపై దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ మంగళవారం మూడోసారి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. వర్మ దర్శకత్వంలో నిర్మించిన 'సత్య-2' చిత్రం సెన్సార్ విషయంలో ధనలక్ష్మి ఇబ్బందుల పాలు చేసారని, వివక్ష ప్రదర్శించారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

గతంలో కూడా వర్మ రెండు సార్లు ధనలక్ష్మిపై కోర్టులో పిటిషన్లు వేశారు. అయితే తమ పరిధిలోకి రాదని కోర్టు తోసిపుచ్చింది. రెండు సార్లు తిరస్కారానికి గురైనా వర్మ...మూడో సారి పిటీషన్ దాఖలు చేయడం చర్చనీయాంశం అయింది. వర్మకు పలువురు సినీ ప్రముఖుల మద్దతు ఉండటం గమనార్హం.

మొదటి పిటీషన్ దాఖలు చేయడానికి ముందు వర్మ మీడియా లైవ్ షోలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఇండస్ట్రీ పెద్దలు మద్దతు ప్రకటించారు. వర్మకు మద్దతుగా నిలిచిన వారిలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, మోహన్ బాబు కాడా ఉన్నారు. ఇప్పటి వరకు సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ధనలక్ష్మి గురించి ఎవరికీ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు నిర్మాతలు వాపోయారు.

కాగా.. సినిమాల సెన్సార్ విషయంలో తాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదని, రివ్యూ కమిటీ సభ్యులంతా కలిసే సెన్సార్ చేస్తామని, వర్మ పిటీషన్ దాఖలు చేసే ముందు రివ్యూ కమిటీని సంప్రదించి ఉండాల్సిందని సెన్సార్ ఆఫీసర్ దనలక్ష్మి వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Topics: ram gopal varma, satya 2, dhanalakshmi, mohan babu, రామ్ గోపాల్ వర్మ, సత్య 2, ధనలక్ష్మి, మోహన్ బాబు
English summary
The Nayampalli Court in Hyderabad yesterday (25 November, 2013) dismissed petition filed by director Ram Gopal Varma against Censor Board Officer Dhanalakshmi. RGV today filed another petition against Dhanalakshmi. It is the third petition.

Telugu Photos

Go to : More Photos