twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండో రోజుకే థియోటర్స్ నుంచి తీసేసారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : సినిమాకు రెవిన్యూ రాకపోతే థియోటర్స్ వారు భరించే రోజులు వెళ్లిపోయాయి. గతంలోలాగ రెండు వారాలు చూద్దాం..ఇంకో నాలుగు రోజులు చూద్దాం ...పికప్ అవుతుందేమో అని ఎవరూ వెయిట్ చేయటంలేదు. రిలీజ్ రోజు, మహా అయితే రెండో రోజు కలెక్షన్స్ చూస్తున్నారు. మినిమం వస్తే ఉంచుతున్నారు. లేకపోతే నిర్ధాక్ష్యణ్యంగా థియోటర్స్ నుంచి తీసేస్తున్నారు. ఇప్పుడు ఐస్ క్రీమ్ 2కు అదే పరిస్ధితి ఎదురైందని ట్రేడ్ వర్గాల సమాచారం.

    తొలి రోజు తొలి ఆట నుంచే ఈ చిత్రం కలెక్షన్స్ మందగించాయి. ఓపినింగ్స్ సైతం తెచ్చుకోలేని ఈ చిత్రం మరీ దారుణంగా భాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. దాంతో రెండో రోజుకే ఈ చిత్రం తీసేసారని తెలుస్తోంది. ఆ చిత్రం ప్లేస్ లో పూజ, కార్తికేయ చిత్రాలు వేసారని చెప్తున్నారు. వీటితో మినిమం కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. ఐస్ క్రీమ్ చిత్రం ఎఫెక్టు ఈ ఐస్ క్రీమ్ 2 పై పడిందని విశ్లేషిస్తున్నారు. ఆ చిత్రం దారుణంగా ఉండటంతో ఈ సీక్వెల్ అదే తరహాలో ఉంటుందని భావించి థియోటర్స్ కు దూరంగా ఉన్నారని చెప్తున్నారు.

    Rgv's Ice Cream 2 terminated in TWO days!

    కథ ఏమిటంటే.... ఐదుగురు క్లోజ్ ఫ్రెండ్స్ ఓ షార్ట్ ఫిలిం చేయాలని నిర్ణయించుకుంటారు.షూటింగ్ కోసం ఓ అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ కు వెళ్తారు. అక్కడకి వెళ్లి వెళ్లగానే..ఇలాంటి సినిమాల తరహాలో అక్కడ చిత్రమైన, భయపెట్టే సంఘటనలు జరగటం మొదలెడతాయి.అక్కడ నుంచి వారు తప్పించుకునిపోదామని అనుకుంటే..వారు సిక్కా(జెడీ చక్రవర్తి)చేతికి చిక్కుతారు. సిక్కా అతని గ్యాంగ్ బ్యాంక్ దొంగలు..వాళ్ళు వీళ్ళని కిడ్నాప్ చేసారన్నమాట. అప్పుడు ఊహించని ట్విస్ట్ పడుతుంది. కిడ్నాప్ జరిగిన నాటి నుంచి గ్రూప్ లో ఒక్కొక్కరూ చనిపోవటం మొదలెడతారు. అసలు ఏం జరుగుతోంది. ఎవరు ఎవర్ని చంపుతున్నారు. ఎవరైనా మిగులుతారా...ఆ షార్ట్ ఫిల్మ్ ఫినిష్ చేసారా తర్వాత ఏం జరిగింది అనే విషయం తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

    ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్, నవీన, శాలిని, గాయత్రిలు ప్రధాన పాత్రలు పోషించారు. గతంలో వచ్చిన ‘ఐస్ క్రీం' చిత్రానికి ఇది సీక్వెల్. ‘ఐస్ క్రీమ్' చిత్రాన్ని రెండే రెండు మెయిన్ క్యారెక్టర్స్‌తో ఒకే ఒక ఇంటిలో షూట్ చేసారు. ‘ఐస్ క్రీమ్-2'ను మొత్తం ఔట్ డోర్ లో పదహారు ప్రధాన పాత్రలతో తీసారు. కథాపరంగా రెంటికీ సంబంధం లేదు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : తుమ్మలపల్లి అంజని కుమార్ - టి భరత్ కుమార్, నిర్మాత : తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ!

    English summary
    Ram Gopal Varma's latest offering Ice Cream 2 has been terminated with immediate effect and has been replaced by films like Karthikeya and Pooja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X