twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీరప్పన్‌ చనిపోయిన రోజునే రామ్ గోపాల్ వర్మ...

    By Srikanya
    |

    హైదరాబాద్‌: చందనం చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవితచరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కిల్లింగ్‌ వీరప్పన్‌'. ఈ చిత్రం రెండో ట్రైలర్ ని విడుదల తేదీని,సమయాన్ని ట్వీట్ చేసారు వర్మ.

    ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఈ చిత్రం ట్రైలర్‌-2ను వీరప్పన్‌ మృతి చెందిన రోజు అదే సమయానికి అంటే.. ఈ నెల 18న రాత్రి 10.40 గంటలకు విడుదల చేయనున్నట్లు రామ్‌గోపాల్‌వర్మ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు.

    గందపుచెక్కల దొంగ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతు మరీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6న ఈ చిత్రం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కన్నడ,హిందీ, తెలుగులో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఆ మధ్యన చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూసిన వారు..వర్మ ఈజ్ బ్యాక్ అంటున్నారు.

    వీరప్పన్‌ కథాంశంతో ‘కిల్లింగ్‌ వీరప్పన్‌' అనే టైటిల్ తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. అలాగే ఇప్పుడు ఆయన ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా విడుదలకానుంది. కన్నడ హీరో శివరాజ్ కుమార్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. పరుల్ యాదవ్, యజ్ఞ శెట్టి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర పోషిస్తున్నాడు.

    గతంలో రాజ్‌ కుమార్‌ను వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శివరాజ్‌ కుమార్‌ను ఈ సినిమాకు హీరోగా ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. కన్నడం, హిందీ, తెలుగు మరియు తమిళంలో ఈ సినిమాను విడుదల చేస్తాను అంటూ వర్మ ప్రకటించాడు. చాలా సినిమాలు చేస్తున్న వర్మ ఈ సినిమాను ఎప్పటికి పూర్తి చేస్తాడో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    RGV 's Killing veerappan trailer 2 release 18th October

    ఇక వీరప్పన్‌గా రామ్ గోపాల్ వర్మ ఓ థియేటర్ ఆర్టిస్ట్‌ను ఎంపిక చేయడం విశేషం. ఢిల్లీకి చెందిన... థియేటర్ ఆర్టిస్ట్ సందీప్ భరద్వాజ్ రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్‌'లో వీరప్పన్‌గా నటిస్తున్నారు. వీరప్పన్ లుక్స్, మ్యానరిజం ఇలా అన్నింటినీ తెలుసుకొని ఆ పాత్రలో సందీప్ ఒదిగిపోయి నటిస్తున్నాడని వీరప్పన్ ఎలా ఉండనున్నాడనే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తూ వర్మ తెలిపారు. రీసెంట్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

    వర్మ మాట్లాడుతూ... వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత అతడు ఎంత డేంజరస్ వ్యక్తి అనే విషయం అర్థమైందని, అలాంటి క్రిమినల్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథే ఈ ‘కిల్లింగ్ వీరప్పన్' అని వర్మ తెలిపారు. వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని వర్మ తెలిపాడు. ఒసామా బిన్ లాడెన్ కన్నా శక్తిమంతుడైన వీరప్పన్ ఎంతో మంది పోలీసులను, అడవి జంతువులను చంపి తిరుగులేని క్రిమినల్‌గా అవతరించాడని వర్మ చెప్పుకొచ్చాడు.

    RGV 's Killing veerappan trailer 2 release 18th October

    అలాంటి క్రిమినల్‌ను చంపిన పోలీస్ కథే ‘కిల్లింగ్ వీరప్పన్'గా వర్మ తెలిపాడు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వీరప్పన్‌ను చంపే ఆఫీసర్‌గా నటించటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది. సినిమా అద్భుతంగా రూపొందనుందని ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని వర్మ ఈ సందర్భంగా తెలిపాడు.

    కన్నడం, హిందీ, తెలుగు మరియు తమిళంలో ఈ సినిమాను విడుదల చేస్తాను అంటూ వర్మ ప్రకటించాడు. ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇది నిజ జీవితానికి చెందిన రియల్ లైఫ్ స్టోరీ అని చెప్తున్నారు వర్మ.

    English summary
    Director Ram Gopal Varma tweeted:"Killing veerappan" trailer 2 release 18th October 10.40 pm on the same day and same time as Veerappan was killed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X