twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరీంనగర్లో ఫిలిం ఇండస్ట్రీ: రామ్ గోపాల్ వర్మ ప్లాన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సాంకేతిక రంగాల్లో రోజురోజుకు మారుతోన్న అనేక టెక్నికల్ పెను విప్లవాల పుణ్యమా అని, ప్రపంచం మొత్తం ఓ చిన్న ‘గ్లోబల్ విలేజ్'గా మారిపోతూ, లక్షల కోట్ల మైళ్ల దూరంలో ఉన్న అంగారకుడిపై కదలికలను సైతం నిల్చున్న చోటు నుంచే చూపిస్తున్న ఆధునిక యుగంలో...ఓ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లోనో, ముంబైలోనో, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి విజయవాడలోనో, వైజాగ్‌లోనో ఇంకా అదేదో ఫలానా చోట ఉండాలని ఫిక్స్ అవ్వడం చాలా పాతకాలపు ఆలోచనలతో కూడిన మూర్ఖపు అవివేకం అంటున్న దర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ తన వాదనను ఇపుడు ఆచరణ రూపంలో పెట్టబోతున్నారు.

    RGV's New Telugu Film Industry In Karimnagar!

    ‘తెలంగాణ ఉద్యమ పరిటిగడ్డ' కరీంనగర్ లో నవంబర్ 18వ తేదీ ఉదయం 11 గంటలకు శాతవాహన యూనివర్శిటీలోని ఒక బహిరంగ వేదిక ద్వారా ‘అవగాహన సదస్సు'ను ఏర్పాటు చేసి..‘హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీలో పని చేసే ఒక్క వ్యక్తి కూడా తెలియకపోయినా, ఎలా కరీంనగర్ లోనే ఓ సినిమా ఇండస్ట్రీ పెట్టి మిగతా ప్రాంతాలతో ఏ మాత్రం సంబంధాలు లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా కూడా సినిమాలు తీసి వాటిని ఎలా రిలీజ్ చేయ్యచ్చో వివరిస్తానని ఆర్జీవి చెబుతున్నారు.

    కరీంనగర్ ఫిలిం ఇండస్ట్రీలో పాల్గొనడానికి ఆసక్తి ఉండి, కరీంనగర్ లో ఉన్నవాళ్లెవరైనా సరే ఈ నవంబర్ 18న మీటింగుకి రావచ్చని రామ్ గోపాల్ వర్మ పిలుపునిచ్చారు.

    English summary
    Sensational director Ram Gopal Varma is all set to launch new Film Industry at Karimnagar. He will announce the launch on November 18th at 11 O clock from Satavahana University Open Forum.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X