twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్‌గోపాల్ వర్మ 'స్పాట్' వెనక కథ (వర్మ వాయిస్ లో...)

    By Srikanya
    |

    హైదరాబాద్ : హిట్, ఫ్లాపులతో సంభందం లేకుండా ...విలక్షణ కథాంశాలకు సాంకేతిక హంగులను జోడించి చిత్రాలను తెరకెక్కించడంలో ముందుంటారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఇటీవలే ఫ్లోకామ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసూ అతి తక్కువ వ్యయంతో ఐస్‌క్రీమ్ చిత్రాన్ని, దాని సీక్వెల్ ని తెరకెక్కించారాయన. ఇప్పుడు అదే పరిజ్ఞానంతో మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ చిత్రానికి స్పాట్ అనే పేరును ఖరారు చేసారు. నూతన తారాగణం కీలక పాత్రల్ని పోషించనున్న ఈ చిత్రం కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన ఆడియో పోస్టర్ ని వర్మ విడుదల చేసారు. ఈ క్రింద లింక్ ద్వారా మీరు వర్మ వాయిస్ లో దాన్ని వినవచ్చు.

    https://soundcloud.com/spot-10/spot-announcement

    ఇక వర్మ తాజా చిత్రాల విషయానికి వస్తే...

    Rgv's Spot audio release poster

    ఐస్ క్రీమ్ 2 చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. తొలి రోజు తొలి ఆట నుంచే ఈ చిత్రం కలెక్షన్స్ మందగించాయి. ఓపినింగ్స్ సైతం తెచ్చుకోలేని ఈ చిత్రం మరీ దారుణంగా భాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. దాంతో రెండో రోజుకే ఈ చిత్రం తీసేసారని తెలుస్తోంది. ఆ చిత్రం ప్లేస్ లో పూజ, కార్తికేయ చిత్రాలు వేసారని చెప్తున్నారు. వీటితో మినిమం కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. ఐస్ క్రీమ్ చిత్రం ఎఫెక్టు ఈ ఐస్ క్రీమ్ 2 పై పడిందని విశ్లేషిస్తున్నారు. ఆ చిత్రం దారుణంగా ఉండటంతో ఈ సీక్వెల్ అదే తరహాలో ఉంటుందని భావించి థియోటర్స్ కు దూరంగా ఉన్నారని చెప్తున్నారు.

    కథ ఏమిటంటే.... ఐదుగురు క్లోజ్ ఫ్రెండ్స్ ఓ షార్ట్ ఫిలిం చేయాలని నిర్ణయించుకుంటారు.షూటింగ్ కోసం ఓ అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ కు వెళ్తారు. అక్కడకి వెళ్లి వెళ్లగానే..ఇలాంటి సినిమాల తరహాలో అక్కడ చిత్రమైన, భయపెట్టే సంఘటనలు జరగటం మొదలెడతాయి.అక్కడ నుంచి వారు తప్పించుకునిపోదామని అనుకుంటే..వారు సిక్కా(జెడీ చక్రవర్తి)చేతికి చిక్కుతారు. సిక్కా అతని గ్యాంగ్ బ్యాంక్ దొంగలు..వాళ్ళు వీళ్ళని కిడ్నాప్ చేసారన్నమాట. అప్పుడు ఊహించని ట్విస్ట్ పడుతుంది. కిడ్నాప్ జరిగిన నాటి నుంచి గ్రూప్ లో ఒక్కొక్కరూ చనిపోవటం మొదలెడతారు. అసలు ఏం జరుగుతోంది. ఎవరు ఎవర్ని చంపుతున్నారు. ఎవరైనా మిగులుతారా...ఆ షార్ట్ ఫిల్మ్ ఫినిష్ చేసారా తర్వాత ఏం జరిగింది అనే విషయం తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

    ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్, నవీన, శాలిని, గాయత్రిలు ప్రధాన పాత్రలు పోషించారు. గతంలో వచ్చిన ‘ఐస్ క్రీం' చిత్రానికి ఇది సీక్వెల్. ‘ఐస్ క్రీమ్' చిత్రాన్ని రెండే రెండు మెయిన్ క్యారెక్టర్స్‌తో ఒకే ఒక ఇంటిలో షూట్ చేసారు. ‘ఐస్ క్రీమ్-2'ను మొత్తం ఔట్ డోర్ లో పదహారు ప్రధాన పాత్రలతో తీసారు. కథాపరంగా రెంటికీ సంబంధం లేదు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : తుమ్మలపల్లి అంజని కుమార్ - టి భరత్ కుమార్, నిర్మాత : తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ!

    English summary
    Spot is a telugu film directed by Ram Gopal Varma in Telugu Language to be released in 2015. Spot Film covers how OB.Reddy main accused put 'SPOT' drawing sketch to eliminate Paritala Ravi. Sirasri already penned lyrics for title song for Spot which runs 'Raamudu Vaaliki pettinderaa spot,".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X