twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: ‘శ్రీమంతుడు’ సినిమాపై వర్మ ట్వీట్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో విడుదల కాబోతున్న ‘శ్రీమంతుడు' సినిమా గురించి చేసిన ట్వీట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ఒక రకంగా అభిమానుల్లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. శుక్రవారం రాత్రి వర్మ చేసిన ఆ ట్వీట్స్ ఏమిటో మీరూ ఓ లుక్కేయండి.

    ‘ఇప్పుడే నైజాం డిస్ట్రిబ్యూటర్లను కలిసాను. బాహుబలితో సంబంధం లేకుండా శ్రీమంతుడు మంచి బిజినెస్ ఎలా చేస్తుందని వారు అంటున్నారు. శ్రీమంతుడు రిలీజైన తర్వాత కూడా బాహుబలి బిజినెస్ పెరుగుతుందని అంటున్నారు. శ్రీమంతుడు, బాహుబలి గురించి వారి మాటల్లో అర్థం నాకు బోధ పడలేదు. సినిమాల బిజినెస్ ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు' అంటూ ట్వీట్ చేసారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లుక్ ఫెంటాస్టిక్ అంటూ మరో ట్వీట్ చేసాడు వర్మ.

    కాగా...శ్రీమంతుడు' మూవీ మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది. సినిమా ఓవరాల్ బిజినెస్ రూ. 80 కోట్లు క్రాస్ అయింది. ఇప్పటికే ఈచిత్రానికి వివిధ ప్రాంతాల్లో థియేట్రికల్ రైట్స్(తెలుగు వెర్షన్) ద్వారా రూ. 58 కోట్లు వసూలు కావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

    ‘శ్రీమంతుడు' సినిమా మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంతకు ముందు మహేష్ బాబు నటించిన ‘దూకుడు' సినిమా విడుదలైన తర్వాత రూ. 56 కోట్లు వసూలు చేసింది. ‘శ్రీమంతుడు' సినిమా విడుదల ముందే ఆ మార్కును క్రాస్ చేయడం గమనార్హం.

    English summary
    "Just met Nizam distributor who said irrespective of how good Srimanthudu is,Bahubali's collections wil increase after Srimanthudu's release. I don't know what this Nizam distributor means about Srimanthudu, Bahubali because I don't understand how film business works" RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X