twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అశ్లీల సైట్లపై బ్యాన్ ఎత్తివేత: రామ్ గోపాల్ వర్మ హ్యాపీ...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పోర్న్(అశ్లీల) సైట్స్‌పై కేంద్రం ప్రభుత్వం నిషేదం విధించడాన్ని కొందరు సమర్థించినా... అనేక మంది ప్రముఖులు వ్యతిరేకించారు. ఇలా చేయడం స్వేచ్ఛకు భంగం కలిగించడమే అంటూ మండి పడ్డారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పోర్న్ సైట్లను నిషేదించిన మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

    జూలై 31న సెక్షన్ 79(3) ఐటీ యాక్ట్-2000 కింద సుమారు 857 పోర్న్ సైట్స్‌ను కేంద్రం బ్యాన్ చేసింది. ఈ చర్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసి చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో కేంద్రం తాత్కాలికంగా నిషేదాన్ని ఎత్తివేసింది. నిషేదాన్ని చైల్డ్ పోర్నోగ్రఫీకి మాత్రమే పరిమితం చేసింది.

     RGV tweet about ban

    తాజాగా పోర్న్ సైట్లపై వర్మ నిషేదం ఎత్తివేసిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ హర్షం వ్యక్తం చేసారు. ప్రభుత్వం పోర్న్‌సైట్స్‌పై బ్యాన్ విధించడం ద్వారా ఏం సాధించదలిచింది. ప్రభుత్వ చర్యతో ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు సైతం బహిరంగంగానే పోర్న్ చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నాయి. నా స్నేహితుడి నానమ్మ, తల్లి, తాత ఇంట్లోనే పోర్న్‌చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదే గత ఆరు రోజుల క్రితం ఐతే ఇటువంటి సంభాషణ చేసేందుకు వారు సహాసించేవారు కాదు. రహస్యంగా బ్యాన్ చేయడం ఆపై నిషేదాన్ని ఎత్తివేయడం వంటి ప్రభుత్వ చర్యలకు కృతజ్ఞతలు. ప్రజలు ఇప్పుడు బహిరంగంగానే గర్వంతో పోర్న్ చిత్రాలను చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారని వర్మ పేర్కొన్నారు.

    నిషేదం అనంతరం వర్మ చేసిన విమర్శలు....
    తాలిబాన్, ఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థలు స్వేఛ్చను ఎలా హరిస్తున్నాయో మన ప్రభుత్వాలు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నాయని మండి పడ్డారు. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తే అది ఆదేశ సామాజిక స్థితిని ప్రభావం చూపుతుందని, అశ్లీల చిత్రాలు లైంగిక నేరాలను పెంచవని, లైంగిక నేరాలను నిరోధించడానికి అశ్లీల సైట్లను నిషేధించడమే శాశ్వత పరిష్కారం కాదన్నారు. లైంగిక కోరికల నిగ్రహానికి అశ్లీల సైట్లు ఒక సురక్షిత మార్గమని పలు అంతర్జాతీయ సర్వేలు నిరూపించాయని వర్మ ట్వీట్‌ చేశారు.

    పోర్న్‌ సైట్లపై నిషేధం విధించడం కన్నా, అశ్లీల సైట్లను తప్పుడు మార్గంలో వెళ్లకుండా చూడాలని, ఇత‌ర ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను వెతుక్కోవాలన్నారు. ప్రభుత్వం తీరు మారకపోతే ఎన్నికల్లో ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందని వర్మ వ్యాఖానించారు.

    English summary
    "What the Government managed to do with temporary ban on porn is that Porn is now being openly discussed even in middle class living rooms. My friend's grandma,his mom and grandpa were discussing porn in the living room which would hav been impossible even 6 days ago before ban. What used to be secretly dealt with guilt and embarrassment thanks to ban came into open and people ar now proudly saying they watch porn" RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X