Don't Miss!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్‌జున్‌వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
కొలంబస్ ..ఇప్పుడు బస్ కండక్టర్ (ఫస్ట్ లుక్)
హైదరాబాద్ : రీసెంట్ గా 'కొలంబస్' అంటూ పలకరించిన సుమంత్ అశ్విన్ .. త్వరలో కండక్టర్ గా కనిపించి అలరించనున్నారు. మళయాళ చిత్రం ఆర్డనరీ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి 'రైట్ రైట్' అనే టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ని దీపావళి సందర్బంగా విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
శ్రీ సత్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నూతన దర్శకుడు మను దర్శకత్వంలో జె. వంశీకృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 7న ఆరంభం కానుంది.
ఈ చిత్రవిశేషాలను జె. వంశీకష్ణ తెలియజేస్తూ - "మంచి కథలు, పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ సాగిస్తున్న సుమంత్ అశ్విన్ ఖాతాలో ఇది మరో మంచి చిత్రం అవుతుంది. ఇప్పటివరకూ ఆయన చేసిన చిత్రాలకు, పాత్రలకు పూర్తి భిన్నంగా సాగే చిత్రం ఇది.
మలయాళంలో ఘనవిజయం సాధించిన ఓ సంచలన చిత్రానికి ఇది రీమేక్. 'మర్యాద రామన్న', 'బాహుబలి' చిత్రాల్లో విలన్ గా చేసిన ప్రభాకర్ ఇందులో కామెడీ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆ పాత్ర ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.
విజయనగరం, అరకు లోయ పరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాం. యూత్, ఫ్యామిలీస్ ని ఆకట్టుకునే విధంగా ఈ 'రైట్ రైట్' ఉంటుంది'' అని చెప్పారు.
ఈ చిత్రానికి మాటలు: 'డార్లింగ్' స్వామి, కెమెరా: శేఖర్ వి. జోసఫ్, సంగీతం: జె.బి, ఆర్ట్: కె.ఎం. రాజీవ్, సహ నిర్మాత: జె