twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ రాజమౌళి‌: ఇదీ 'బాహుబలి' టీజర్‌కు స్పందన

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ప్రముఖ దర్శకులు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'బాహుబలి' శనివారం రాత్రి 7.30 గంటలకు విడుదలైన ఈ చిత్రం టీజర్‌ ఆన్‌లైన్‌లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ టీజర్‌ను ఐదు లక్షల మందికి పైగా వీక్షించారు. విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం భారత టీజర్, పోస్టర్స్ తో సినీచరిత్రలోనే అద్భుత చిత్రంగా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది.

    అలాగే... ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం ఉదయం 10.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్‌ విడుదలైన వెంటనే అభిమానుల ఫేస్‌బుక్‌ పేజీపై వాల్‌పోస్ట్‌ పొందేందుకు ప్రత్యేక సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ఇలా వాల్‌పోస్టు పొందేందుకు 17 వేల మంది అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ సంఖ్య మరింత పెరుగుతోంది.

    Roaring Response for 'Bahubali' Teaser

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మరో ప్రక్క 'బాహుబలి సినిమాకోసం వినియోగించిన వస్తువులతో ప్రత్యేకంగా ఓ మ్యూజియంని ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా ఒక సినిమా కోసం మ్యూజియం ఏర్పాటు చేయడం మన దేశంలో ఇదే తొలిసారి. 'బాహుబలి'లో నటీనటులు వాడిన ఆయుధాలు, వాళ్లు ధరించిన దుస్తులు, కవచాలు ఈ మ్యూజియంలో ప్రదర్శనకి ఉంచబోతున్నారు. రాజమౌళి ఆలోచనల మేరకే ఈ మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు.

    ఇక టీజర్ విషయానికి వస్తే...

    శనివారం రాత్రి 7.30కి 'బాహుబలి'కి సంబంధించిన ఓ టీజర్‌ని విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసారు...అభిమానులను ఆనందపరిచారు. 20 సెకన్లపాటు సాగే ఆ టీజర్‌ 'బాహుబలి' సినిమా స్థాయి ఏమిటో చాటి చెబుతోంది. వేలాది మంది సైనికులు పోరాటంలోకి దిగుతుండగా... రానా కత్తి దూసేందుకు సన్నద్ధమవుతూ ఆ టీజర్‌లో కనిపించాడు. చివరిగా ప్రభాస్‌ కళ్లను మాత్రమే చూపించారు. జూన్‌ 1న 2 నిమిషాల ట్రైలర్‌ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

    భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్‌ హీరోగా నటించారు. అనుష్క, తమన్నాహీరోయిన్స్. రానా విలన్ గా కనిపిస్తారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. కీరవాణి సంగీతం అందించారు.

    English summary
    Ace director SS Rajamouli's prestigious period drama, 'Bahubali's teaser released .Teaser got tremendous response as the video already got 5 lakh hits in Youtube within a single day
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X