twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వింటే షాక్: ‘బాహుబలి’ గ్రాఫిక్స్ ఖర్చు ఎంతో తెలుసా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాకు సంబంధించి బయటకు పొక్కుతున్న విషయాలు ఒక్కొక్కటి ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ఏమంటే ఈ చిత్రంలో కేవలం గ్రాఫిక్స్ కోసమే రూ. 70 కోట్ల మేర ఖర్చు చేసారట.

    నేషనల్ అవార్డు విన్నర్, ‘మ్యాజిక్ మ్యాజిక్', ‘శివాజి', ‘రోబో' చిత్రాలకు సూపర్ వైజింగ్ చేసిన విఎఫ్ఎక్స్ ఎక్స్‌పర్ట్ శ్రీనివాస్ మోహన్ ‘బాహుబలి' చిత్రానికి కూడా పని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా 600 మంది మంది గ్రాఫిక్స్ నిపుణులు పని చేస్తున్నారు.

    Rs 70 crore for Baahubali Graphics

    సాధారణంగా 10 సెకన్ల నిడివిగల విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కోసం రూ. 50 వేలు ఖర్చవుతుంది. బాహుబలి సినిమాలో 95 శాతం గ్రాఫిక్స్ మాయాజాలమే. అందుకే నిర్మాతలు ఏ మాత్రం వెనకాడకుండా రూ. 70 కోట్లు గ్రాఫిక్స్ కోసం ఇప్పటికే ఖర్చు చేసారు. గతంలో ఇండియాలో వచ్చిన గ్రాఫిక్స్ ప్రధాన మైన సినిమాలు ‘రోబో', ‘రా.వన్' చిత్రాలకు కూడా ఈ రేంజిలో ఖర్చు పెట్టలేదు.

    ‘బాహుబలి' సినిమా చూడబోయే ప్రేక్షకులకు ఏది రియల్, ఏ గ్రాఫిక్స్ తెలియనంత అద్భుతంగా ఉండబోతోందట. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు..... ఇండియన్ సినీ పరిశ్రమకు చెందిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్టులు ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జులై 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

    English summary
    Usually, A 10 Seconds of Visual Effects work costs around Rs 50,000. As 95% of 'Baahubali' scenes have graphics, Makers have spent a whooping Rs 70 crore for it already. This is a figure not even heard for either 'Robo' or Shahrukh Khan's 'Ra.One'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X