twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రుద్రమదేవి' ‌: తెలంగాణాలో సరే..మరి ఆంధ్రాలో??

    By Srikanya
    |

    హైదరాబాద్‌: గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'రుద్రమదేవి' చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయించింది.

    ఈ నేపధ్యంలో ఆంధ్రాలో ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తారా అనే విషయం లేదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. రుద్రమదేవి..వరంగల్లు కి చెందిన వీర వనిత అయినా ఆమె భర్త వీరభద్రుడు ..మాత్రం..ఆంధ్రాప్రాంతానికి చెందిన వారే. దాంతో ఈ కథలో ఆంధ్రాప్రాంతానికి కూడా తగిన ప్రయారిటీ ఉంది. ఇలాంటి వీర వనిత కథని తెలుసుకోవటానికి తెలుగు రాష్టాలు రెండింటిలోనూ టాక్స్ మినహాయింపు ఇస్తే బాగుటుంది అనేది నిపుణుల సూచన. అయితే ఇప్పటికే కేసీఆర్ మిహాయింపు ఇచ్చేసారు. మరి ఆంధ్రా ముఖ్యమంత్రి..చంద్రబాబు నాయుడు ..ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

    దర్శకుడు గుణశేఖర్‌, నిర్మాత దిల్‌ రాజు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రుద్రమదేవి చిత్రాన్ని చూడాల్సిందిగా కేసీఆర్‌ను గుణశేఖర్‌ కోరారు. దీనికి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. కాకతీయ వీరవనిత రుద్రమదేవి గొప్పదనాన్ని చిత్రంగా తీసినందుకు గుణశేఖర్‌ను కేసీఆర్‌ అభినందించారు. రుద్రమదేవి లాంటి చారిత్రక నేపధ్యమున్న చిత్రాలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు.

    ఈ సందర్భంగా రుద్రమదేవి చిత్రానికి వినోదపు పన్ను మినహాయిస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. రుద్రమదేవి చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

     Rudramadevi: tax free in Andra state?

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్‌ త్రీడీ ద్విభాషా చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తుది దశ వీఎఫ్‌ఎక్స్‌ పనులు చేపడుతున్నారు. కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతోందీ ఈ చిత్రం. 'రుద్రమదేవి' చిత్రంలో అనుష్క రుద్రమదేవిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కథలో ప్రధాన పాత్రల్లో ఒకటైన మహామంత్రి 'శివదేవయ్య' పాత్రను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ పోషించారు.

    దర్శకనిర్మాత మాట్లాడుతూ '' సాంకేతికంగా సినిమాని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మరి కొంత సమయం తీసుకుంటున్నాం. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు దేశవిదేశాల్లో చేపడుతున్నాం. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించేలా ఉంటుంది. రుద్రమదేవిగా అనుష్క, పోరుగడ్డపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ అభినయం ఆకట్టుకుంటుంది'' అన్నారు.

    మరో ప్రక్క గుణశేఖర్ తన తాజా చిత్రం 'రుద్రమదేవి' కి కొత్త ప్రయోగంతో ముందుకు వస్తున్నారు. కళ్లద్దాలు లేని త్రీడిలో తమ సినిమాని చూడెపడతాను అంటున్నారు. ఆ ఎక్సపీరియన్స్ పూర్తి డిటేల్స్ ఇక్కడ...

    సాధారణంగా త్రీడి సినిమాలను చూడడానికి ప్రత్యేక కళ్లజోళ్లను పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే కళ్లజోళ్లు అవసరం లేకుండానే త్రీడీ సినిమా చూడగలిగితే అనే ఆలోచనను నిజం చేయబోతున్నారు. అలాంటి ఎక్సపీరియన్స్ నే 'రుద్రమదేవి' సినిమా ఇవ్వనుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో సరికొత్త సాంకేతిక విధానాన్ని వినియోగించారు దర్శకుడు గుణశేఖర్‌.

    'ఎన్‌హ్యాన్స్‌డ్‌ డెప్త్‌ సొల్యూషన్‌' (ఈడీఎస్‌) అనే విధానం ఉపయోగిస్తున్నారు. అమెరికాకు చెందిన 'యింగ్‌ గ్రూప్‌' సంస్థ ఆధ్వర్యంలో జేమ్స్‌ ఆష్‌బే, మైల్స్‌ ఆడమ్స్‌ బృందం ఈ పనులు నిర్వహిస్తోంది. 'కింగ్‌ కాంగ్‌', 'కుంగ్‌ ఫూ పాండా', 'ఇన్‌సెప్షన్‌', 'అవతార్‌' వంటి చిత్రాలకు త్రీడీ విభాగంలో ఈ సంస్థ పని చేసింది.

    గుణశేఖర్ మాట్లాడుతూ ''రుద్రమదేవి'ని టూడీ, త్రీడీ విధానాల్లో తెరకెక్కించారు. అయితే త్రీడీలో సినిమా చూసే అవకాశం అందరికీ ఉండదు. అన్ని ప్రాంతాల్లో థియేటర్లకు త్రీడీ కళ్లద్దాలను అందించలేని పరిస్థితి. అందుకే అందరికీ త్రీడీ అనుభూతి కలిగించాలని యింగ్‌ గ్రూప్‌ను సంప్రదించాం. వాళ్లకు త్రీడీ విధానంలో మంచి అవగాహన ఉంది. టూడీ థియేటర్లలోనూ త్రీడీ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగించే ఈడీఎస్‌ విధానం గురించి చెప్పారు. అలా టూడీలో చిత్రీకరించిన సినిమాను ఈడీఎస్‌ ద్వారా మార్పు చేశాం'' అని వివరించారు.

    ఈడీఎస్‌ విధానంలో ఫొటో డెప్త్‌ను పెంచాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి ప్రతి ఫ్రేమ్‌ మీద రెండు సార్లు పనిచేయాల్సి ఉంటుంది. అయితే డెప్త్‌ పెంచే క్రమంలో రీల్‌లోని బొమ్మల రంగులు మారాయి. దాంతో మరింత శ్రద్ధ తీసుకుని ఆ తేడా కనిపించకుండా చేశారు. ఫైట్ సీన్స్ విషయంలో ఈడీఎస్‌ మార్పు కష్టమైంది. అయినా జాగ్రత్తగా కొనసాగించారు. సుమారు ఎనిమిది నెలలుగా ఈ కార్యక్రమం సాగుతోంది.

    ఈడీఎస్‌ ద్వారా మార్చిన రీల్‌లో ఇమేజ్‌ షార్ప్‌నెస్‌ కొద్దిగా తగ్గినట్టు అనిపించినా సన్నివేశాలన్నీ సహజంగా కనిపిస్తాయి. మరోవైపు కళ్లజోళ్లు పెట్టుకుని చూసేలా కూడా కొన్ని ప్రింట్లను రూపొందిస్తున్నారు. మొత్తానికి 'రుద్రమదేవి' సినిమాను రెండు విధాలుగా చూడొచ్చన్నమాట.

    సుమన్‌, ప్రకాష్‌రాజ్‌, నిత్య మేనన్‌, కేథరిన్‌, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మేనన్‌, అజయ్‌ తదితరులు నటించారు. చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌, మాటలు: పరుచూరి బ్రదర్స్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సమర్పణ: రాగిణీగుణ.

    English summary
    Telangana chief minister, KCR has decided to make Rudrama Devi​ tax free in his state.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X