twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రుద్రమదేవి’ సంక్రాంతికి కాదు, రిలీజ్ వాయిదా...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అనుష్క టైటిల్ రోల్‌లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి'. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన ‘గోన గన్నారెడ్డి' పాత్రను అల్లు అర్జున్ పోషించాడు. రుద్రమదేవి భర్త పాత్రలో రానా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెస్తామంటూ గత కొన్ని రోజులుగా నిర్మాతలు చెబుతూ వచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఫిబ్రవరికి వాయిదా వేసినట్లు సమాచారం. త్వరలో అఫీషియల్‌గా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

    రుద్రమ దేవి సినిమా గురించి దర్శకుడు గుణశేఖర్ కొన్ని రోజుల క్రితం మీడియాకు తెలిపుతూ....‘2002లో రుద్రమదేవి చిత్రానికి సంబంధించిన చారిత్రక పరిశోధన, కథా రూపకల్పన పనులు ప్రారంభం కాగా, 2012 ఫిబ్రవరి నుండి ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. 2013 ఫిబ్రవరిలో వరంగల్ లోని వేయి స్థంబాల గుడిలో ఈ చిత్రం ముహూర్తం జరుపుకోగా, 2014 సెప్టెంబర్ 4న హైదరాబాద్ గోపన్నపల్లిలో వేసిన ఏడు కోటగోడల సెట్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. తెలుగుజాతి చరిత్ర, సాహసం కళ్లకి కట్టేలా భారీ స్థాయిలో ఈ చారిత్రాత్మక చిత్రం రూపొందింది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో స్టీరియో స్కోపిక్ 3డిలో నిర్మాణమైన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఈ త్రీడి టెక్నాలజీ ఖచ్చితంగా ప్రేక్షకులకి అంతర్జాతీయ స్థాయి విజువల్ థ్రిల్ కలిగించబోతోంది. ఆ నమ్మకంతోనే పలు ప్రాంతాల్లోని ఎగ్జిబిటర్లు త్రీడి ప్రదర్శనకు అనుకూలంగా తమ థియేటర్లని సిద్ధం చేసుకోవడానికి ముందుకి రావడం ఎంతో ఆనందంగా ఉందని చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ అన్నారు.

    Rudramma Devi release postponed to February

    త్రీడితో పాటు రెగ్యులర్ 2డి విధానంలో కూడా ఈ సినిమా విడుదలవుతుంది. ఓ మహాయజ్ఞంలా సాగిన ఈ సినిమా షూటింగులో, ఇది తమ సినిమాగా భావించి సహకరించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, వేలాది మంది కార్మికులందరికీ ఈ సందర్భంగా దర్శక నిర్మాత గుణశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో గోనగన్నారెడ్డిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రానా, కృష్ణం రాజు, సుమన్, ప్రకాష్ రాజ్, నిత్య మీనన్, కేథరిన్, ప్రభ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్ కుమార్, వేణు మాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీ రాజా, సమ్మెట గాంధీ, అదితి చెంగప్ప, సన, రక్ష తదితర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్: పద్మశ్రీ, తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్ట్యూమ్ డిజైనర్: నీతా లుల్లా, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల, ఫైట్స్: విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయిబాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్ గోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.

    English summary
    Director Gunashekhar’s forthcoming epic movie ‘Rudhramma Devi’ which is supposed to release for Sankranthi has been postponed to February 2015 due to some reasons.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X