» 

ఇదైనా రిలీజ్ అవుతోంది...హ్యాపీసూ

Posted by:

హైదరాబాద్: శర్వానంద్ కు గత కొద్ది కాలంగా హిట్ అనేది దూరంగా ప్రయాణం చేస్తూ వస్తోంది. నిత్యామీనన్ కాంబినేషన్ లో చేసిన ఏమిటో ఈ మాయ చిత్రం బిజినెస్ కాకపోవటంతో విడుదల కూడా కాకుండా హార్డ్ డిస్క్ ల్లోనే మగ్గుతోంది. ఈ నేపధ్యంలో మిర్చి నిర్మాతలు అతనికి రిలీఫ్ ఇవ్వటానికా అన్నట్లు సినిమా ప్రారంభించి, విడుదలకు సిద్దం చేసారు. ఈ చిత్రం హిట్ అయితే కాస్త ఒడ్డున పడదామనే ఆశలో ఉన్నాడు శర్వానంద్. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'రన్ రాజా రన్' జూలై 11న విడుదల కానుంది. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. సీరత్ కపూర్ హీరోయిన్. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. సుజిత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ "మా సంస్థలో రూపొందుతున్న తొలి చిత్రం 'మిర్చి' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 'రన్ రాజా రన్' రెండో సినిమా ఇది. దర్శకుడు చెప్పిన కథ, కథనం నచ్చింది. ప్రతి ఒక్కరూ థ్రిల్ ఫీలయ్యేలా ఉంది. వినూత్నమైన లవ్ ఎంటర్‌టైనర్. సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకు మది కెమెరా హైలైట్ అవుతుంది. గిబ్రాన్ మంచి సంగీతాన్నిచ్చారు. జూలై 11న సినిమాను విడుదల చేస్తాం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఆడియో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మా సంస్థలో మంచి సినిమాలు వస్తాయని నమ్ముతున్న ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను రూపొందించాం'' అని చెప్పారు.

అడవి శేషు, సంపత్, జయప్రకాష్‌రెడ్డి, అలీ, వెన్నెల కిషోర్, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: మది, సంగీతం: గిబ్రాన్.యం., ఎడిటర్: మధు, ఆర్ట్: ఎ.యస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.

Read more about: sarwanand, mirchi, prabhas, gopichand, శర్వానంద్, మిర్చి, ప్రభాస్, గోపీచంద్
English summary
Sharwanand Starrer Run Raja Run is all set to make a grand release on July 11th .
Please Wait while comments are loading...