twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసలే అసంతృప్తిలో ఎస్.జానకి ఫ్యాన్స్, మరో వైపు సోషల్ మీడియాలో దారుణం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: గోరు చుట్టుపై రోకలి పోటు... అనే సామెత వినే ఉంటారు. ప్రముఖ గాయని ఎస్.జానకి అభిమానులకు ఇటీవల ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. 60 ఏళ్లపాటు సంగీతమే శ్వాసగా జీవించిన ఈ మహాగాయని ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాటలు పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు.

    'ది నైటింగేల్‌ ఆఫ్‌ సౌత్‌' అని అభిమానులు సగర్వంగా పిలుచుకునే జానకమ్మ తన పాటల ప్రస్థానాన్ని మలయాళ సినిమా '10 కాల్పానికాల్‌' చిత్రంలో 'అమ్మ పూవిను' అనే పాటతో ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే తన చివరి పాట అని, ఇకపై నేను ఏ రికార్డింగ్‌ల్లోనూ, స్టేజ్‌ ప్రోగ్రామ్‌ల్లో కూడా పాడను ప్రకటించారు.

    జానకమ్మ ఈ ప్రకటన చేసినప్పటి నుండి ఆమె అభిమానుల మనసు మనసులో లేదు. తమ అభిమాన గాయని పాటలు వినే భాగ్యం ఇకపై లేదాని చాలా మంది ఫ్యాన్స్ బాధలో ఉన్నారు. ఓ వైపు ఈ అసంతృప్తిలో ఉన్న అభిమానులు..... సోషల్ మీడియాలో జరిగుతున్న దారుణం చూసి మరింత షాకయ్యారు.

     ఇలాంటివి తరచూ

    ఇలాంటివి తరచూ

    ఒక వ్యక్తిని బత్రికుండగానే చనిపోయడని ప్రచారం చేయడం ఎంత దారుణం. ఈ సోషల్ మీడియా కాలంలో ఇలాంటి దారుణాలు తరచూ చూస్తూనే ఉన్నాం. సినీ తారల విషయంలోనే ఎక్కువగా ఇలాంటివి జరుగుతున్నాయి.

    ఇపుడు జానకమ్మ విషయంలో

    ఇపుడు జానకమ్మ విషయంలో

    సోషల్‌ మీడియా బాధితుల జాబితాలో ఈసారి లెజెండరీ సింగర్‌ ఎస్‌.జానకమ్మ చేరిపోయారు. ఇకపై పాటలు పాడను అని ఆమె ప్రకటిస్తే.. ఏకంగా ఆమె చనిపోయిందనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజా నిజాలు తెలుసుకోకుండా వందల సంఖ్యలో నెటిజన్లు ఆమె ఫోటోలను షేర్‌ చేస్తూ.. సంతాప సందేశాలను పోస్ట్‌ చేస్తున్నారు.

    జానకమ్మ గురించి

    జానకమ్మ గురించి

    జానకి గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు.

     చిన్నతనం నుండే

    చిన్నతనం నుండే

    చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. లతామంగేష్కర్‌, పి.సుశీల, జిక్కీ, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు 1957లో తమిళ సినిమా ‘విదియిన్‌ విళయాట్టు'తో గాయనిగా రంగప్రవేశం చేశారు.

    48వేల పాటలు

    48వేల పాటలు

    1938లో జన్మించిన జానకి తన 78 ఏళ్ల జీవితంలో 60 ఏళ్లపాటు సంగీతాన్నే శ్వాసించారు, శాసించారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ, జపనీస్‌, జర్మన్‌, లాటిన్‌, ఉర్దూ, అరబిక్‌.. ఇలా ఎన్నో భాషల్లో ఇప్పటివరకు దాదాపు 48వేల పాటలు పాడారు.

    జాతీయ అవార్డులు

    జాతీయ అవార్డులు

    ‘సింధూర పూవె' (16 వయథినిలే) అనే తమిళ పాటకు గానూ 1977లో తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1981లో ‘ఎత్తు మనూరమ్‌ బాలతి' (ఒప్పోల్‌-మలయాళం), 1984లో వెన్నెల్లో గోదారి అందం (సితార-తెలుగు), 1992లో ‘ఇంజి ఇడుప్పూఝఘ' (దేవర్‌ మగన్‌-తమిళ్‌) పాటలకు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇవి కాకుండా 29 సార్లు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు అందుకున్నారు.

    పద్మ అవార్డు తిరస్కరించి సంచలనం

    పద్మ అవార్డు తిరస్కరించి సంచలనం

    2013లో ఆమెకు భారత ప్రభుత్వం ఇచ్చిన ‘పద్మ భూషణ్‌' అవార్డును ఆమె తిరస్కరించారు. తనను గుర్తించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందనీ, దక్షిణాది కళాకారులను గుర్తించే విషయంలో కేంద్ర పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందంటూ ఆమె పురస్కారాన్ని స్వీకరించడం లేదని ప్రకటించిన సంచలనం సృష్టించారు.

    ఇకపై పాటలు పాడనని ప్రకటన

    ఇకపై పాటలు పాడనని ప్రకటన

    ‘ది నైటింగేల్‌ ఆఫ్‌ సౌత్‌' అని అభిమానులు సగర్వంగా పిలుచుకునే జానకమ్మ తన పాటల ప్రస్థానాన్ని మలయాళ సినిమా ‘10 కాల్పానికాల్‌' చిత్రంలో ‘అమ్మ పూవిను' అనే పాటతో ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే తన చివరి పాట అని, ఇకపై నేను ఏ రికార్డింగ్‌ల్లోనూ, స్టేజ్‌ ప్రోగ్రామ్‌ల్లో కూడా పాడను ప్రకటించారు.

    English summary
    Popular playback singer S Janaki has become the latest victim of death hoax on social media. On Thursday, the death rumours started doing the rounds on cyber space after the legendary musician announced her retirement from singing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X