»   »  పవన్ కళ్యాణ్ కి నేనే అంటూ ట్వీట్ : తమన్ షాక్ బాగానే తగిలింది

పవన్ కళ్యాణ్ కి నేనే అంటూ ట్వీట్ : తమన్ షాక్ బాగానే తగిలింది

Posted by:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మస్తు జోరుగా మీదున్నాడు. వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడని టాక్. ఓ చిత్రం షూటింగ్ లో ఉండగానే మరో చిత్రానికి సైన్ చేసేస్తున్నాడు. ఆయన తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మాటల మాంత్రికుడు 'తివిక్రమ్' తో సినిమా చేయడానికి 'పవన్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొన్ననే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. తాజాగా తమిళ దర్శకుడు 'ఆర్ టి నేసన్' డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు టాక్. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా 'తమన్' ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్వయంగా 'థమన్' ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. '

అర్ధరాత్రి వేళ అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు తమన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాకు తానే సంగీత దర్శకుడినంటూ సోమవారం అర్ధరాత్రి దాటాక అతను ఆశ్చర్యకర ప్రకటన చేశాడు. తమిళ డైరెక్టర్ టీఎన్ నీశన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఎ.ఎం.రత్నం నిర్మించే ఈ చిత్రం దసరాకు ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఈ చిత్రానికి తనే సంగీత దర్శకుడినంటూ చాలా ఎగ్జైట్ అయిపోతూ చెప్పాడు తమన్. ఐతే ఉదయమో.. సాయంత్రమో చెబితే తమన్ హాట్ టాపిక్ అయ్యేవాడు కానీ.. ఎందుకో అర్ధరాత్రి ముహూర్తాన్ని ఎంచుకున్నాడు కుర్రాడు.

కెరీర్ ఆరంభంలోనే:

 
రవితేజ లాంటి స్టార్ హీరోతో ‘కిక్' సినిమా ద్వారా తెలుగులో తన సంగీత ప్రయాణాన్ని ఆరంభించిన తమన్.. కెరీర్ ఆరంభంలోనే చాలామంది స్టార్ హీరోలతో పని చేశాడు. మహేష్ బాబుతో కూడా చాలా త్వరగానే అవకాశం దక్కించుకున్నాడు.

అవకాశం దక్కింది:


కానీ.. పవన్ తో సినిమా చేయడానికే చాలా ఆలస్యమైంది. అనూప్ రూబెన్స్ లాంటి సంగీత దర్శకులకు కూడా ఛాన్సిచ్చిన పవన్.. తమన్ మీద శీతకన్నేశాడు. ఐతే ఎట్టకేలకు అతడికి అవకాశం దక్కింది.

టాప్‌ హీరోలందరికీ :


టాలీవుడ్‌లో ఇప్పటివరకు టాప్‌ హీరోలందరికీ పనిచేసిన తమన్‌కు చిరంజీవి తన 151 సినిమా బాధ్యతలు ఇవ్వగా, ఇప్పుడు మొదటిసారిగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాకు పనిచేయబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు తమన్‌.

కాపీ క్యాట్ అపవాదు:


సౌత్ లో క్రేజీ మ్యూజిక్ డైరక్టర్స్ లో తమన్ కూడా ఒకరని చెప్పాలి. రొటీన్ కు భిన్నంగా సరికొత్త స్టైల్ లో మ్యూజిక్ అందిస్తాడని తమన్ కు మంచి పేరుంది. అంతేకాదు అప్పుడప్పుడు కాపీ క్యాట్ అపవాదు మూటకట్టుకున్నాడు. కిక్ సినిమాతో తన కెరియర్ ప్రారంభించిన తమన్ అతి తక్కువ టైంలోనే స్టార్స్ కు మ్యూజిక్ అందించడంలో సక్సెస్ అయ్యాడు.

పవర్ స్టార్ సినిమాకు మ్యూజిక్:


ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న తమన్ త్వరలో పవర్ స్టార్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వబోతున్నాడట. ఇప్పటిదాకా పవన్ తో కలిసి చేసే అవకాశం రాకపోవడంతో నిరాశ పడ్డ తమన్ నేసన్ డైరక్షన్లో పవర్ స్టార్ చేస్తున్న సినిమాకు తాను మ్యూజిక్ డైరక్టర్ గా ఓకే అవడంతో ఆ విషయం అర్ధరాత్రి ఎనౌన్స్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నాడు.

వేదాళం రీమేక్‌:


దీంతో తన కల నెరవేరబోతుందని సంతోషాన్ని వ్యక్తం చేశాడు తమన్‌. ఎమ్‌ రత్నం నిర్మాతగా వ్యవహరించబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. తమిళ వేదాళం రీమేక్‌గా ఇది తెరకెక్కనుంది.

ఎక్కువగా రమణ గోగుల:


ప్రతి హీరో ఒక్కో టైంలో ఒక్క సంగీత దర్శకుడిని ప్రిఫర్ చేస్తుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఎక్కువగా రమణ గోగులతో పని చేసేవాడు. ఆ తర్వాత మణిశర్మతో కొన్ని సినిమాలు చేశాడు. ఆపై ఎక్కువ సినిమాలు చేసింది దేవిశ్రీ ప్రసాద్‌తోనే.

తమన్ కు ఇవ్వలేదు:

గత ఏడాదే అనూప్ రూబెన్స్‌తో తొలిసారి ‘గోపాల గోపాల'కు వర్క్ చేశాడు. ఇప్పుడు అనూప్ రూబెన్స్‌తోనే ‘కాటమరాయుడు' చేస్తున్నాడు పవన్. ఐతే ఇప్పటిదాకా పవన్.. ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ అయిన తమన్ కు మాత్రం అవకాశం ఇవ్వలేదు.

మొదటిసారి పవన్ కు:


మహేష్, ఎన్టీఆర్ లాంటి వారికి ఎప్పటి నుండో మ్యూజిక్ ఇస్తున్న తమన్ మొదటిసారి పవన్ కు మ్యూజిక్ అందించే ఛాన్స్ వచ్చింది. మరి ఈ అవకాశాన్ని తమన్ ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.

English summary
Young music composer SS Thaman has a great news to cheer up. He has been approached to compose the tunes for Pawan Kalyan’s next film and he signed the movie on spot. He even took his twitter to share the joy.
Please Wait while comments are loading...