»   » అదిరింది: సింగం-3 అఫీషియల్ టీజర్

అదిరింది: సింగం-3 అఫీషియల్ టీజర్

Posted by:
Subscribe to Filmibeat Telugu

తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు.

తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఇక సింగం-3 తెలుగు, తమిళ భాషల్లో బాక్సాఫీస్ కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నాడు.

కాగా ఈ చిత్ర తమిళ, తెలుగు భాషల టీజర్‌ను సోమవారం సాయంత్రం 8 గంటలకు రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై తెలుగులో కూడా భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు మించే విధంగా ఈ చిత్రం వుంటుంది. ఈ చిత్రంలో సూర్య నట విశ్వరూపం చూడబోతున్నారు అని తెలిపారు.

గతంలో సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందిన సింగం, సింగం-2 చిత్రాలకు మించిన విజయం ఈ చిత్రం సాధిస్తుంది. ఇటీవల విడుదలైన తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ చక్కటి స్పందన లభించింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. తెలుగు ప్రేక్షకుల్ని అలరించే ఈ నెలాఖరున చిత్ర గీతాల్ని విడుదల చేసి, డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరీస్ జైరాజ్.

English summary
Presenting you the official Telugu teaser of #S3 - Yamudu 3. S3 - Yamudu 3 is an upcoming action film Written & Directed by Hari.Cast : Suriya, Anushka Shetty, Shruti Haasan, Thakur Anoop Singh, Soori, Robo Shankar, Krish & Others. Written & Directed By: Hari.
Please Wait while comments are loading...