Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్‌పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సాహసం సేయరా డింభకా ట్రైలర్
హైదరాబాద్: శ్రీ (ఈరోజుల్లో ఫేమ్), హమీద, సమత హీరోహీరోయిన్లుగా, హంసవాహిని టాకీస్ పతాకంపై తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన హర్రర్ అండ్ కామెడీ చిత్రం ‘సాహసం సేయరా డింభకా'. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలయింది.
చిత్ర నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ, దర్శకుడు తిరుమలశెట్టి కిరణ్ ఓ మంచి చిత్రాన్ని తెరకెక్కించారని, మా బ్యానర్‌కి, మాకు ఈ ‘సాహసం సేయరా డింభకా' మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నారు. తెలుగు ప్రేక్షకులు ఇంతకుముందు వచ్చిన హర్రర్ అండ్ కామెడీ చిత్రాలని ఎంత చక్కగా ఆదరించారో.. అలాగే ఈ చిత్రాన్ని కూడా పెద్ద హిట్ చేయాలని కోరుతున్నానని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని అన్నారు.
త్వరలోనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు. శ్రీ, హమీద, ఆలీ, షకలక శంకర్, పూర్ణిమ, జ్యోతి, జబర్దస్త్ అప్పారావ్, ఎఫ్.ఎమ్.బాబాయ్ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, పాటలు: కరుణాకర్ అడిగర్ల. నిర్మాత: ఎమ్.ఎస్.రెడ్డి (ఎమ్బిఎ.ఎల్ఎల్బి) కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరుమలశెట్టి కిరణ్.