twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాయిధరమ్ తేజ ‘సుప్రీమ్’టాక్ ఏంటి, హిట్టేనా..?

    By Srikanya
    |

    హైదరాబాద్: మెగా హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన 'సుప్రీమ్' . ఈ చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే చాలా చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. అయితే అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాకే వస్తోంది.

    ఇప్పిటికే సినిమా చూసినవారు చెప్తున్నదాని ప్రకారం..సినిమా డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్. అంతకు మించి ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా వెళ్తే చక్కగా నవ్వుకుని, పాటలు, ఫైట్స్, సెంటిమెంట్స్ సీన్ ల ని ఎంజాయ్ చేసి రావచ్చు. ఎక్కడా సహనానికి పరీక్ష పెట్టకుండా , రెగ్యులర్ సినీ గోయిర్స్ కు నచ్చేలా సినిమాని దర్శకుడు డిజైన్ చేసారు.

    ముఖ్యంగా రాశిఖన్నా, సాయిధరమ్ తేజ మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ గా ఉన్నాయని టాక్. రొటీన్ క్లైమాక్స్ తో నింపినా సినిమా బాగుందని చూసినవాడు ధియోటర్ నుంచి బయటికు వచ్చి చెప్పేలా ఉందని అంటున్నారు.

    Sai dharma Teja's Supreme talk

    అయితే పటాస్ స్దాయి కామెడీ లేకపోయినప్పటికీ కామెడీ బాగా పండిందని చెప్తున్నారు. రాబోతున్న చిత్రాలు అ..ఆ, బ్రహ్మోత్సవం పూర్తిగా క్లాస్ మూవిస్ లాగ ఉండటంతో ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ కావటంతో సినిమాకు ఎక్కడా ఎదురు ఉండదని అంచనాలు ట్రేడ్ లో వినపడుతున్నాయి. సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ అని కాకుండా చక్కటి గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా ఇది నిలబడుతుందని, అనీల్ రావిపూడి కు తదుపరి పెద్ద హీరోల చిత్రాలు ఆఫర్స్ వస్తాయని చెప్తున్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ...ఒక ట్యాక్సీ డ్రైవర్‌ కథ ఇది. రామాయణంలో శ్రీరాముడి కోసం హనుమంతుడు వాయువేగంతో వెళ్లాడు. హనుమంతుడు లాంటి ఓ ట్యాక్సీ డ్రైవర్‌ కూడా ఈ కథలో ఒకరి కోసం ప్రయాణం చేయాల్సొస్తుంది. అది ఎవరికోసమన్నది మాత్రం తెరపైనే చూడాలి. సినిమాలో క్యాబ్‌ పేరే సుప్రీమ్‌. క్యాబ్‌కి కూడా ఓ పేరుంటే బాగుంటుందనుకొన్నప్పుడు సుప్రీమ్‌ అనే పేరు తట్టింది. ఆ పేరే సినిమాకి పెట్టాం'' అన్నారు.

    అలాగే''భావోద్వేగంతో కూడిన కథ. హీరో ప్రయాణంలోని సంఘటనలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి.ప్రతి పాత్ర ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ కథ ఏ భాషకయినా సరిపోయేలా ఉంటుంది. 20 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ సీన్స్ ఇదివరకు ఏ తెలుగు సినిమాలోనూ చూడని విధంగా వుంటాయి. అక్కడ ముఖ్యమైన ఆరుగురు నటీనటులు కనిపిస్తారు. వారెవరనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే''. అన్నారు.

    దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సాయి కార్తీక్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి టాక్ ని సంపాదించుకోగా, సాయి ధరమ్ తన స్టెప్పులతో ఏ రేంజ్ లో అలరిస్తాడా అని మెగా అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.ఇక ఇప్పటికే సుప్రీమ్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక షో వేయించుకొని మరి చూశారట.

    Sai dharma Teja's Supreme talk

    నిన్న సాయంతం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సుప్రీమ్ స్పెషల్ షో వేశారు. ఈ షోను మెగాస్టార్ సుప్రీమ్ టీమ్ తో కలిసి చూశారు. ఇక సినిమా చూశాక చిరు తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ను బాగా మెచ్చుకున్నారట. మంచి కమర్షియల్ అంశాలతో సినిమా బాగా అలరించిందని తెలుపుతూ, సినిమా యూనిట్‌కు చిరు మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా కాంబినేషన్ చాలా బాగుందని, 'అందం హిందోళం' రీమిక్స్ పాటకు వీరి స్టెప్పులు తనకు బాగా నచ్చాయని చిరు ఈ సందర్భంగా తెలిపినట్టు సమాచారం.

    బ్యానర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
    నటీనటులు: సాయిధరమ్‌తేజ్, రాశిఖన్నా, రాజేంద్రప్రసాద్, రవికిషన్, సాయికుమార్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్‌రెడ్డి, మురళీమోహన్, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు
    రచనాసహకారం:,సాయికృష్ణ
    ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్,
    ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్,
    సంగీతం: సాయి కార్తీక్
    ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ,
    కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అనిల్ రావిపూడి.
    సమర్పణ: దిల్ రాజు
    నిర్మాత: శిరీష్
    విడుదల తేదీ: మే 5, 2016.

    English summary
    Sai dharma Teja's Supreme movie is decent commercial entertainer in the recent past. Never tests your patience, Easy watch for regular movie goers; Falls short of Pataas in comedy, though.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X