twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశాఖలో వారాహి టీం: మరో 25 లక్షల విరాళం(ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి తన దాతృత్వాన్ని ఘనంగా చాటుకొన్నారు. హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం 100 టన్నుల బియ్యాన్ని ప్రకటించిన సాయి కొర్రపాటి..ఆ బియ్యాన్ని స్వయంగా విశాఖకు వెళ్లి అవసరార్థులకు అందించిన విషయం తెలిసిందే.

    విశాఖకు వెళ్లిన సాయి కొర్రపాటి అక్కడ తుఫాన్ కారణంగా దెబ్బతిన్నవసతి గృహాలను, ప్రభుత్వ కార్యాలయాలను చూసి చలించిపోయారు. పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణంతో ఎల్లప్పుడూ ఆహ్లాదభరితంగా ఉండే విశాఖను నేడు ఇటువంటి పరిస్థితిలో చూసిన సాయి కొర్రపాటి...తాను పంచి పెడుతున్న బియ్యం వారి కడుపు నింపుతుంది కానీ..వాళ్ల కళ్లలో ఆనందాన్నినింపలేదని గ్రహించి వివిధ శాఖలకు దాదాపు రూ. 25 లక్షల ధన సహాయం అందించారు.

    స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివరాలు, ఫోటోలు...

    విరాళాలు...

    విరాళాలు...

    సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షల రూపాయల చెక్ అందించారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఆంధ్రాయూనివర్శిటీకి రూ. 3 లక్షలు అందించారు.

    అంధ పాఠశాల కోసం..

    అంధ పాఠశాల కోసం..

    అంధ బాలికల పాఠశాలకు రూ. 5 లక్షల చెక్కుతో పాటు అత్యవసరానికిగాను దుస్తుల కోసం రూ. 50 వేల రూపాయలు, దెబ్బతిన్న బిల్డింగ్ బాగు చేయిస్తానని మాట ఇచ్చారు.

    వివిధ శాఖలకు

    వివిధ శాఖలకు

    బాధితుల సహాయార్థం పగలు రాత్రి తేడా లేకుండా పని చేస్తున్న పోలీస్ డిపార్ట్ మెంట్, ఫైర్ డిపార్ట్ మెంట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విద్యుత్ బృందాలకు లక్ష చొప్పున రూ. 4 లక్షల విరాళాన్ని అందించారు.

    ఆసుపత్రి కోసం...

    ఆసుపత్రి కోసం...

    విక్టోరియా ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో ఏసీలు, మరియు ఆసుపత్రిలో ఫ్యాన్స్ అందించారు. పేద ప్రజలకు అన్నదానం చేయాల్సిందిగా కోరుతూ...ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరంకు రూ. 1.50 లక్షలు అందించారు.

    ఆదుకుంటానన్నారు

    ఆదుకుంటానన్నారు

    ఇవి మాత్రమే కాకుండా...తన చేతనైనంతలో విశాఖ వాసులను ఆదుకుంటానని హామీ ఇచ్చి, అక్కడి ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. సాయి కొర్రపాటితో పాటు పలువురు దాతలు తమను ఆదుకున్నందుకు కృతజ్ఞతగా విశాఖ వాసులు ‘వారాహి చలన చిత్రం' ఆధ్వర్యంలో ఓ ర్యాలీని నిర్వహించి...అందరికీ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో...

    ఈ కార్యక్రమంలో...

    సాయి కొర్రపాటి, శ్రీనివాస్ అవసరాల, త్రికోఠి, అజయ్, రాశి ఖన్నా, వారాహి చలన చిత్రం టీం పాల్గొన్నారు.

    English summary
    Producer Sai Korrapti has donated 100 tons of rice to the cyclone victims in Vizag. Latest update is that he has also donated an extra 25 lakhs to the relief fund.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X