Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నందమూరి ఫ్యామిలీతో హ్యాట్రిక్ అవుతుంది...
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీఆర్ గారితో మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాను. అది సూపర్ హిట్టయింది. అలాగే బాలయ్య బాబుతో చాలా సినిమాలు చేసాను. అందులో ఆయన పోలీస్ రోల్ చేసిన రౌడీ ఇన్స్ స్పెక్టర్ లో కూడా నటించాను. అది కూడా సూపర్ హిట్టయింది. ఇపుడు కళ్యాణ్ రామ్ పటాస్ చేసాను. ఇది మాస్ ఎంటర్టెనర్. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో నాకు నందమూరి ఫ్యామిలీతో హాట్రిక అవుతుంది అన్నారు...నటుడు సాయికుమార్.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'పటాస్'. శ్రుతి సోడి హీరోయిన్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా గ్రాండ్ గా విడుదలవుతోంది. సాయి కుమార్ మాట్లాడుతూ....అనిల్ వచ్చి కళ్యాణ్ రామ్ గారితో సినిమా చేస్తున్నానని, ఆ సినిమాలో ఓ పోలీస్ క్యారెక్టర్ నేను చేయాలని అన్నాడు. సరే అని కథ విన్నాను. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సిన్సియర్ పోలీస్ అధికారి పాత్ర. పోలీస్ అంటే సిన్సియర్ గా ఉండనక్కర్లేదు అనుకునే హీరో క్యారెక్టర్, అసలు పోలీస్ అంటేనే సిన్సియారిటీ అనే డి.జి.పి క్యారెక్టర్ మధ్య ఎలాంటి ఘర్షణ జరిగిందో ఈ సినిమాలో చూపిస్తున్నాం అన్నారు.
కళ్యాణ్ రామ్ ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. యూనిట్ అంతా ఒక సైడ్ అయితే కళ్యాణ్ రామ్ మరో సైడ్ ఉంటుంది. ఆ రోల్ కళ్యాణ్ చాలా సిన్సియర్ గా నటించాడు. ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా ఉండే క్యారెక్టర్. సెకండాఫ్ అంతా చాలా సర్ ఫ్రైజెస్ తో సాగే క్యారెక్టర్. చాలా టఫ్ రోల్. తను సూపర్ గా నటించాడు అని తెలిపారు.
సాయికుమార్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్ మురారి, ఎడిటింగ్: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి.