»   » అవార్డులు-డౌట్స్: మహేష్ సరే, బాహుబలి ఏది? అవమానమా? గుణశేఖర్‌కా, అనుమానం

అవార్డులు-డౌట్స్: మహేష్ సరే, బాహుబలి ఏది? అవమానమా? గుణశేఖర్‌కా, అనుమానం

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:సాక్షి ఎక్సలెన్స్ అవార్డులలో మోస్ట్ పాపులర్ హీరోగా మహేష్ బాబు, లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుకు సినీ దర్శకుడు విశ్వనాథ్ ఎంపికయ్యారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ప్రముఖులతో కూడిన జ్యూరీ ద్వారా 2015 సంవత్సరానికి గాను అవార్డు గ్రహీతలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో కొత్త చర్చకు ఈ అవార్డ్ దారి తీసింది.

అదేమిటంటే...తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి భారతీయ సినిమా రంగంలో ఒక ప్రముఖ స్థానాన్ని సృష్టించిన 'బాహుబలి' కాని ఆ సినిమా దర్శకుడు రాజమౌళికి కాని సాక్షి పత్రిక అందచేసిన ఎక్సలెన్స్ అవార్డులలో ఒక్క విభాగంలో కూడ అవార్డును గెలుచుకోలేకపోవడం ఇప్పుడు సిని వర్గాల్లో మీడియా సర్కిల్స్ లో హాట్ టాపికి గా మారింది.

జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన 'బాహుబలి' కి నిన్న కన్నుల పండుగగా జరిగిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డు ఫన్క్షంలో ఒక విధంగా అవమానమే జరిగింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బాహుబలిని ప్రక్కన పెట్టి రుద్రమదేవి చిత్రానికి మోస్ట్ పాపులర్ అవార్డ్ ఇవ్వటం కూడా చర్చకు తావిచ్చింది.


స్లైడ్ షోలో...అవార్డ్ లతో పాటు.. మిగతా విశేషాలు..

మోస్ట్ పాపులర్ మూవీ

క్రితం సంవత్సరం విడుదలైన మోస్ట్ పాపులర్ మూవీ అవార్ద్ 'శ్రీమంతుడు' సినిమా దక్కించుకుంది.

 

అలాగే..


మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మహేష్ బాబు సొంతం చేసుకున్నాడు.

మోస్ట్ పాపులర్ డైరక్టర్ ...

 

ఆఫ్ ది ఇయర్ సత్కారాన్ని 'రుద్రమదేవి' సినిమా దర్శకుడు గుణశేఖర్ కు ఇచ్చారు.

 

జ్యూరీ అవార్డ్ ను..

 

ఇక స్పెషల్ జ్యూరీ అవార్డును క్రిష్ 'కంచె' కు ఇచ్చారు.

 

ఇదే షాకింగ్ న్యూస్

 

చరిత్ర సృష్టించిన 'బాహుబలి' సినిమాకు కానీ దర్శకుడు రాజమౌళికి కాని కనీసం ఆసినిమాలో నటించిన నటీనటులకు కాని ఒక్క అవార్డు కూడ లేకపోవడం అత్యంత షాకింగ్ న్యూస్ గా మారింది.

 

అభిమానులు...అవమానం

 

అవార్డ్ కు ఎంపిక చేయకపోవటంతో రాజమౌళికి తీరని అవమానం జరిగింది అంటూ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు.

 

మరీ అతి శయోక్తి

 

దర్శకుడు కళా తపస్వి కె. విశ్వనాథ్ మాట్లాడుతూ తాను భగవద్గీత మీద ప్రమాణం చేసి మనస్పూర్తిగా చెపుతున్నాను అంటూ ఈరోజు తనకు వచ్చిన ఈ జీవన సాఫల్య పురస్కారం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంతో సమానం అని చేసిన కామెంట్స్ అతిశయోక్తిగా అనిపించాయంటున్నారు.

 

హీరోయిన్..


రకుల్ ప్రీత్ సింగ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా ఎంపికైంది.

పాపులర్ పాటల రచయిత..

 

శ్రీమంతుడు మోస్ట్ పాపులర్ పాటల రచయిత- సిరివెన్నెల సీతారామశాస్త్రి గా ఎంపికయ్యారు.

 

తొలుక..

 

ఈ కార్యక్రమంలో తొలుత సిపాయి ముస్తాక్ అహ్మద్ కు మరణానంతర అవార్డును ప్రకటించారు.

 

చేతుల మీదుగా


సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి, ప్రఖ్యాత జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌.. ఈ అవార్డును ముస్తాక్ అహ్మద్ భార్యకు అందజేశారు.

యంగ్ అచీవర్..

 

యంగ్ అచీవర్-సోషల్ సర్వీసు అవార్డును సోనీవుడ్ నూతలపాటి అందుకున్నారు.

 

తల్లి తండుల..

 

సాక్షి మీడియా అందించిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని సోనీవుడ్ నూతలపాటి అన్నారు. తన తల్లిదండ్రుల మార్గమే సేవాగుణం నేర్పిందని, సేవా కార్యక్రమాల్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

 

మంచి సీన్స్..

 

సాక్షి ఎక్సలెన్స్ అవార్డులో ఈరోజు మొట్టమొదటి అవార్డు అందుకున్న అమర జవాను ముస్తాక్ అహ్మద్ భార్య, ఓ చేతిలో బిడ్డతో వచ్చి అవార్డు తీసుకోవడం కన్నా తనకు మంచి సీన్స్ ఎక్కడ దొరుకుతాయని కె.విశ్వనాథ్ గారు అభిప్రాయపడ్డారు.

 

భాధ్యతతో చేసాను

 

వృత్తిగా చేయవలసిన బాధ్యతతో మూవీలు చేశామని పేర్కొన్నారు.

 

సొంతంగా ఎదిగారు

 

సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి ఎంతో మంది తెలివైనవాళ్లున్నారని, వారికి తాను మెరుగులు దిద్దలేదని సొంతంగా వారే ఎదిగారని అన్నారు.

 

ధన్యువాదాలు

 

ఇండస్ట్రీకి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ తనను గుర్తుపెట్టుకుని మరీ గౌరవించిన సాక్షి సంస్థకు ధన్యావాదాలు తెలిపారు.

 

English summary
Everyone was shocked for Sakshi Excellence Awards. It's because the highest grosser of Tollywood movie “Baahubali” was kept aside and the most popular film award won by Superstar Mahesh Babu starrer “Srimanthudu”. The Sakshi media group honored the talents across the fields with the excellence awards. Mahesh Babu, who bagged the Popular Actor award last year, walked away with the Most Popular Actor award for the year 2015, too.
Please Wait while comments are loading...