twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్‌ కేసు తీర్పు రేపే.. భారీ బందోబస్తు

    By Srikanya
    |

    ముంబై‌: బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ 'హిట్‌ అండ్‌ రన్‌' కేసులో రేపు తీర్పు వెలువడనుంది. కేసు విషయమై సల్మాన్‌ అభిమానులు అధిక సంఖ్యలో కోర్టు వద్దకు వచ్చే అవకాశం ఉండటంతో కోర్టు ఆవరణ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు, కోర్టు సిబ్బందిని మాత్రమే రేపు కోర్టు ఆవరణలోకి అనుమతించనున్నారని సమాచారం.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    సల్మాన్‌ఖాన్‌ రేపు ఉదయం 11గంటల 15 నిమిషాలకు కోర్టుకు హాజరుకావాల్సిందిగా న్యాయమూర్తి దేశ్‌పాండే తెలిపారు. 2002 ముంబయిలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఫుట్‌పాత్‌ మీదకు దూసుకెళ్లి, ఒకరు మృతిచెందగా, నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే.

    కేసు పూర్వాపరాల్లోకి వెళితే..

    Salman Khan faces possible jail time over hit-and-run case

    సల్మాన్‌ఖాన్ హిట్ అండ్ రన్ కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఇప్పుడు డమ్మీ సాక్ష్యం ఇచ్చాడని పబ్లిస్ ప్రాసిక్యూటర్ అంటున్నారు. 2002లో ఖాన్ నిర్లక్ష్యంగా కారునడిపి ఒకరి మృతికి కారణమయ్యాడన్నది అభియోగం. సబర్బన్‌బంద్రాలో 2002 సెప్టెంబర్ 28 రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ విచారణ తుది దశకు చేరుకుంది.

    ఇటీవలే సల్మాన్‌ఖాన్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. రెండ్రోజుల క్రితం ఖాన్ ఫ్యామిలీ డ్రైవర్ అశోక్ సింగ్ సాక్ష్యం చెబుతూ ప్రమాదం జరిగే సమయంలో లాండ్ క్రూయిజ్ కారు తానే నడుపుతున్నట్టు తెలిపాడు. అయితే డ్రైవర్ వాంగ్మూలంతో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘారట్ ఏకీభవించలేదు.

    సెషన్స్ కోర్టులో కేసు తుది విచారణ సందర్భంగా ప్రదీప్ వాదనలు వినిపిస్తూ ప్రధాన నిందితుడిగా ఉన్న సల్మాన్‌ఖాన్ ఇంతకు ముందు ఎప్పుడూ డ్రైవర్ అశోక్‌సింగ్ పేరును ప్రస్తావించలేదని అన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగానూ జరిగిన వాదనలను పిపి కోర్టు దృష్టికి తెచ్చారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ కేసు విచారణలో మొదటి నుంచీ కారు తనసొంతమేనని ప్రమాదంతో తనకు సంబంధం లేదని నిందితుడు చెబుతూ వచ్చాడని ప్రదీప్ అన్నారు. హఠాత్‌గా డ్రైవర్ అశోక్‌సింగ్‌ను తెరమీదకు తెచ్చారని ఆయన ఆరోపించారు. ప్రమాదం జరిగే సమయంలో సల్మాన్‌ఖాన్ మద్యం తాగి ఉన్నాడని, అంతేకాకుండా అతడికి లైసెన్స్ లేదని ప్రాసిక్రూషన్ అభియోగం.

    కేసు వివరాల్లోకి వెళితే...

    2002 సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి సల్మాన్ కారులో వస్తుండగా రోడ్డుపై నిద్రిస్తున్నవారిపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. కేసును విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు.. ఇప్పటివరకు 25 మంది నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. చివరిగా సల్మాన్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది.

    తాను కృష్ణజింకల వేట కేసులో జోధ్‌పూర్ కోర్టుకు హాజరవ్వాల్సి ఉన్నందున స్టేట్‌మెంట్ రికార్డును వాయిదా వేయాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ముంబై స్థానిక కోర్టు హాజరై.. వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. నేరం రుజువైతే సల్మాన్‌ఖాన్‌కు పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

    English summary
    Bollywood star Salman Khan, known for his bulging biceps and off-camera temper tantrums, faces jail this week if convicted of drunkenly driving over sleeping homeless men 12 years ago, killing one of them.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X