twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుక్కలా?...ఇదేనా సల్మాన్ మంచితనం, చివరకు చిరు కూడా!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అసలే డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఆపై తప్పతాగి నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణాకి, నలుగురు గాయ పడటానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో 13 ఏళ్ల విచారణ అనంతరం సల్మాన్ ఖాన్‌కు శిక్ష పడిన సంగతి తెలిసిందే. సెషన్ కోర్టు తీర్పు అనంతరం సల్మాన్ ఖాన్ స్నేహితుల కొందరు మూర్ఖంగా రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు.

    అసలు సల్మాన్ ఖాన్ ఏ తప్పూ చేయలేదు....తప్పంతా రోడ్డు పక్కన పడుకునప్న వాళ్లదే. వారికి సరైన నివాస సౌకర్యాలు కల్పించకుండా రోడ్డుపై పడుకోవడానికి కారణమైన ప్రభుత్వానిది అంటూ ఆయన స్నేహితులు వాదిస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా అది కేవలం ప్రమాదం మాత్రమే, కావాలని చేసింది కాదు...అంటూ సల్మాన్ ఖాన్‌ను వెనకేసుకొచ్చారు. సల్మాన్ కు శిక్ష పడటం బాధగా ఉందని, పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది కదా అంటూ...వ్యాఖ్యానించారు.

    సల్మాన్ స్నేహితుల్లో ఒకరైన బాలీవుడ్ సింగర్ అభిజిత్ భట్టాచార్య స్పందిస్తూ...అసలు సల్మాన్ ఏ తప్పూ చేయనట్లే ట్వీట్ చసారు. రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద పడుకున్నారు, రోడ్డుపై పడుకుంటే కుక్కులు కూడా చస్తాయి అంటూ ట్వీట్ చేసారు. మరొకరేమో మనిషి రైలు కింద పడితే రైలు డ్రైవర్‌కు శిక్ష వేస్తారా? ఆత్మహత్య అనేది నేరమే కదా... వాహనాలు వెళతాయని తెలిసి కూడా రోడ్డు పక్కన పడుకోవడం ఆత్మహత్య లాంటిదే అంటూ మరికొందరు ట్వీట్.

    Salman Khan Friends blame people sleeping on roads

    సల్మాన్ ఖాన్ ఇంత పెద్ద తప్పు చేసినా...తప్ప తాగి డ్రైవింగ్ చేసినా...ఒకరి ప్రాణాలు బలిగొన్నా ఎవరికీ పెద్ద తప్పుగా కనిపించడం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, రాజ్యసభ సభ్యురాలుగా పని చేసిన హేమా మాలిని కూడా సల్మాన్ ఖాన్ మీదన సానుభూతి చూపించారు. ఆయనకు తక్కువ శిక్ష పడాలని ప్రార్థించారు.

    సల్మాన్ ఖాన్ మంచి పనులు చేసాడు...అతనికి శిక్ష పడకుండా ఉంటే బావుండు అని మరికొందరు బాలీవుడ్ స్టార్స్ తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. మరి ఆనాడు యాక్సిడెంట్ జరిగిననాడు అతనితో మంచి తనం ఏమైంది? పొరపాటున యాక్సిడెంట్ జరిగిందని అనుకుందాం. కనీసం గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించలేదు. చస్తే చావండి అంటూ వారిని అలానే వదిలేసి వెళ్లి పోయాడు. ఇదేనా సల్మాన్ ఖాన్ మంచితనం? అని ప్రశ్నించే వారు లేక పోలేదు. నిన్న మొన్నటి వరకు సల్మాన్ ఖాన్ మీద కొంత జాలి జనాల్లో ఉండేది. తాజాగా ఆయన స్నేహితులు చేస్తున్న ఈ మూర్ఖత్వపు ట్వీట్స్ మూలంగా సల్మాన్ మీద ఉన్న ఆ జాలి కూడా ఆవిరైపోతోంది.

    English summary
    Amid Bollywood’s tweets for Salman Khan, jewellery designer Farah Khan Ali and singer Abhijeet upset other Twitter users with posts blaming the government for failing to provide people with housing and suggesting this forced people like the hit-and-run victims to sleep on footpaths.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X