twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా సమస్యలు చాలా చిన్నవే: మీడియాపై సల్మాన్ రుసరుస

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఐదేళ్లు జైలు శిక్ష పడిన ‘హిట్ అండ్ రన్ 'కేసులో బెయిల్ దొరకడంతో సల్మాన్ ఖాన్ తన తాజా సినిమా ‘భజరంగి భాయిజాన్' షూటింగులో బిజీ అయిపోయాడు. షూటింగు గ్యాపులో తన సోదరి అర్పిత, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ విహార యాత్ర ఎంజాయ్ చేస్తున్నాడు.

    ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ కు మీడియా ఎదురు పడింది. ఈ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులు ఆయన్ను హిట్ అండ్ రన్ కేసు గురించి ప్రశ్నించింది. వారి ప్రశ్నలకు కాస్త అసహనానికి గురైన సల్మాన్ ఖాన్ ‘నా సమస్యలు చెప్పుకునేంత పెద్దవేమీ కాదు. చాలా చిన్నవి. మేం ప్రస్తుతం విహార యాత్రలో ఉన్నాం. దానికి మాట్లాడుకుందాం' అని సమాధానం ఇచ్చాడు.

    కోర్టు కేసులు...
    సల్మాన్ ఖాన్ కు హిట్ అండ్ రన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే సల్మాన్ హై కోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా తీర్పును నిలిపి వేస్తూ నెల రోజు పాటు బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణ జూన్ 15న జరుగనుంది. విచారణ తర్వాత సల్మాన్ ఖాన్ భవితవ్యం తేలనుంది.

    Salman Khan has decided to stay away from media

    మరో వైపు కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు చుక్కెదురైంది. ఈ ఘటనకు సంబంధించి సాక్షులను మరోసారి విచారించాలని సల్మాన్‌ఖాన్ పెట్టుకున్న అభ్యర్థనను జోధ్‌పూర్ కోర్టు తోసిపుచ్చింది. సల్మాన్‌ఖాన్ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణజింకను వేటాడటంపై రాజస్థాన్ కోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే.

    హిట్ అండ్ రన్ కేసుకు తోడు జింకల కేసులో కూడా సల్మాన్ ఖాన్ కు శిక్ష పడితే.......పరిస్థితి ఎలా ఉంటుందో? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బాలీవుడ్లో టాప్ స్టార్ గా ఎదిగిన సల్మాన్ ఖాన్ కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే ఈ కేసుల వల్ల ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయింది.

    English summary
    After going through intense media scrutiny recently, Salman Khan has decided to stay away from media. Owing to the recent developments in the 2002 hit-and-run case, Salman thinks that the media will invariably ask him about his court hearings and the sentence suspension if he is part of the promotional activities.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X