twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మే 6 తీర్పు: నేరం రుజువైతే సల్మాన్‌కు పదేళ్ల జైలు, 200 కోట్ల నష్టం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ భవితవ్యం మే 8న తేలనుంది. గత కొన్నేళ్లుగా విచారణ సాగుతున్న ఈ కేసు విచారణ పూర్తయింది. మే 6న తుది తీర్పు వెల్లడి కానుంది. నేరం రుజువైతే సల్మాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

    ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే ఆందోళన బాలీవుడ్ వర్గాల్లో నెలకొంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపతున్నారు. ఆయనకు శిక్ష పడితే షూటింగులు ఆగిపోనున్నాయి. ఆయా సినిమాలపై నిర్మాతలు దాదాపు రూ. 200 కోట్ల పెట్టబడి పెట్టారు. ఒక వేళ సల్మాన్‌కు శిక్ష పడితే నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది.

    విచారణ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన వాంగ్మూలంలో ‘ముంబైలో అర్థరాత్రి ప్రమాదం జరిగిన సమయంలో కారును తాను నడపలేదని సల్మాన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తన డ్రైవర్ అశోక్ సింగ్ కారును నడుపుతున్నాడు' అని వివరించారు. అదే సమయంలో తాను మద్యం తాగి ఉన్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని..తాను ఎలాంటి మద్యం తీసుకోలేదని స్పష్టం చేశారు సల్మాన్.

    Salman Khan

    2002 సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి సల్మాన్ కారులో వస్తుండగా రోడ్డుపై నిద్రిస్తున్నవారిపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. కేసును విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు.. ఇప్పటివరకు 25 మంది నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. చివరిగా సల్మాన్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.

    సల్మాన్ ఖాన్ కారు డ్రైవర్ విచారణ సందర్భంగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు.‘ముంబైలో అర్థరాత్రి ప్రమాదం జరిగిన సమయంలో కారును తానే నడుపుతున్నానని, సల్మాన్ నడపలేదని స్పష్టం చేసాడు. ఈ కేసుకు సంబంధించిన సల్మాన్ ఖాన్ డ్రైవర్ కోర్టుకు హాజరు కావడం ఇదే తొలిసారి.

    ఇది డమ్మీ సాక్ష్యం అని పబ్లిస్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ వాదించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సల్మాన్‌ఖాన్ ఇంతకు ముందు ఎప్పుడూ డ్రైవర్ అశోక్‌సింగ్ పేరును ప్రస్తావించలేదని అన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగానూ జరిగిన వాదనలను పిపి కోర్టు దృష్టికి తెచ్చారు. మరి వాదనలు విన్న కోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మే 6వ తేదీన వచ్చే తీర్పు కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    English summary
    A court trying Bollywood actor Salman Khan in the 2002 hit-and-run case has fixed May 6 as the date of pronouncement of verdict after prosecution and defence concluded their arguments Monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X