twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదంలో సల్మాన్ ఖాన్ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్

    By Bojja Kumar
    |

    ముంబై: ఫ్యాన్స్ ని అలరించటానికి హీరోలు రకరకాల మార్గాలు ఎన్నుకుంటున్నారు. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ అభిమానులకి ఓ వినూత్నంగా తాను కొత్తగా మొదలెట్టిన ఆన్ లైన్ పోర్టల్ ఎడ్రస్ ఇచ్చాడు. ట్విట్టర్‌ ద్వారా ‘ఖాన్‌ మార్కెట్‌ ఆన్ లైన్ డాట్ కామ్' అనే పేరుతో ఓ ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌ని ప్రారంభించాడు. ఈ పోర్టల్‌ ద్వారా అభిమానులు షాపింగ్‌ చేసుకోవచ్చు అని తెలియచేసాడు.

    అయితే ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సల్మాన్‌ పేర్కొన్నారు. తాజాగా ఈ పోర్టల్ వివాదంలో పడింది. ఢిల్లీలో ఇదే పేరుతో 65 ఏళ్ల పాప్యులర్ 'ఖాన్ మార్కెట్' ఉంది. దానికి ట్రేడ్ మార్క్ కూడా ఉంది. ఈ మార్కెట్ కు అంతర్జాతీయంగా ఎంతో పేరుంది.

    Salman Khan may face fresh legal trouble over Khan market

    అయితే ఇప్పుడు సల్మాన్ అదే పేరును తన సొంత బ్రాండ్ కు పెట్టుకోవడం వివాదంగా మారింది. దానిపై ఖాన్ మార్కెట్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ మెహ్రా మాట్లాడుతూ, సల్మాన్ తో ఈ విషయమై మాట్లాడతామని చెప్పారు. లేదంటే కేసు పెడతామని తెలిపారు.

    ఇటీవలే సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు నుండి బయట పడ్డాడు. ఇపుడు ఈ ఆన్ లైన్ మార్కెట్ వివాదం కూడా కోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే సల్మాన్ ఖాన్ మళ్లీ కోర్టు చిక్కులు తప్పేట్లు లేదు.

    English summary
    Actor Salman Khan’s controversial decision to name his online venture khanmarketonline has split traders at Delhi’s posh Khan Market down the middle, with some shopkeepers backing the Bollywood star and others fuming over a supposed attempt to benefit from the high-profile destination’s reputation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X