twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేప్ కి గురైన అమ్మాయిలా ఉన్నాను: సల్మాన్ కి కారు వాడటమే కాదు నోరు వాడటం కూడా రాదా.!?

    |

    సెలబ్రిటీ అంటేనే పబ్లిక్ ప్రాపర్టీ లాంటివాళ్ళు ప్రతీ చిన్న విషయాన్ని ఆలోచించి మాట్లాడాలి. ముందూ వెనకా చూసుకోకుండా అడ్డదిడ్డంగా మాట్లాడితే., ఇదిగో ఇలాగే సల్మాన్ ఖాన్ పరిస్తితే అవుతుంది.మామూలుగానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం మనోడికిరాదు..ఆ మధ్య కారు..,ఇప్పుడు నోరూ సల్మాన్ కి రెండూ వాడటం రాదని అర్థమయ్యింది..ఇంతకీ ఏమైందంటారా....

    బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.తాజా సినిమా "సుల్తాన్" సినిమాలో మల్లయోధుడిగా నటించడం ఎలా ఉందని అడగ్గా... "అత్యాచారానికి గురైన మహిళలా" ( "When I used to walk out of that ring, it used to be actually like a raped woman walking out.") అంటూ తన వెకిలి తనాన్ని బయట పెట్టుకున్నాడు. ఇదే మొదటిసారేం కాదు..కొన్ని రియాలిటీ షోలలో "మైకోల్తా హై తూ పకడ్" (నేను విప్పుతాను నువ్వు పట్టుకో) లాంటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

    "షూటింగ్ లో రోజుకు ఆరు గంటలు బరువులు ఎత్తడం, కుస్తీ పట్టడం చేశాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. బరువులు ఎత్తడం నాకు పెద్ద సమస్య కాదు. 120 కిలోల మనిషిని 10 భంగిమల్లో 10 సార్లు పైకి ఎత్తగలను. కానీ రింగ్ లో తోసుకుంటూ కింద పడడం, నిజంగా ఫైటింగ్ చేయాల్సి రావడం చాలా కష్టంగా అనిపించింది.

    Salman Khan Refers to Himself as a Raped Woman

    షాట్ ముగించుకుని రింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను నేను రేప్ కు గురైన మహిళలా భావించేవాణ్ని. సరిగా నడవలేకపోయేవాడిని" అంటూ తన వొంటి పరిస్థితి ఎలా ఉండేదో చెప్పటానికి ఈ అసంబద్దమైన పోలిక వాడాడు.

    అయితే సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ట్విటర్ లో పెద్ద ఎత్తునే వ్యతిరేకత వచ్చింది. తనను అత్యాచార బాధితురాలితో పోల్చుకోవడంతో సల్మాన్ అన్ని కోల్పోయాడని ట్విటర్ యూజర్ బీనా వ్యాఖ్యానించారు. సల్మాన్ వాడిన పదాలు చాలా భయంకరంగా ఉన్నాయని మరొకరు కామెంట్ చేశారు.

    అంతే కాదు. "సల్మాన్ నువ్వెన్ని సార్లు రేప్ కి గురయ్యావు, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పటానికి నువ్వు మనిషివేనా?" అని ఒకమ్మాయి ప్రశ్నించింది. అయితే ఈ విమర్శలకి సల్మాన్ ఇంకా ఏమాత్రం చలించలేదు. కానీ చూస్తూంటే ఈ వివాదం ఇంకాస్త ముదిరేటట్టే కనిపిస్తోంది.

    English summary
    In an interview, Salman Khan reportedly compared the impact of his gruelling shooting schedule for Sultan to be similar to feeling 'like a raped woman’. Twitter is abuzz with outrage on the star's comment, but some have stepped out in support.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X