twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ కేసు పేపర్లు కాలిపోయాయంట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ముంబై సెషన్స్ కోర్టు విధించిన ఈ తీర్పుపై సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా బెయిల్ లభించింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కాశ్మీరులో తన సినిమాలకు సంబంధించిన షూటింగులో పాల్గొనడంతో పాటు కుటుంబ సభ్యులతో పాటు అక్కడి చల్లని వాతావరణంలో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

    కాగా...సల్మాన్ కేసుకు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ‘హిట్ అండ్ రన్' కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు కాలిపోయాయంట. ఈ కేసులో ప్రభుత్వం నుండి నియమితులైన న్యాయ సలహాదారులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్లు, ఈ కేసుకు ప్రభుత్వం చేసిన ఖర్చు తదితర వివరాలు తెలపాలంటూ మహారాష్ట్ర హోంశాఖ, న్యాయశాఖలకు ఆర్టీఐ ఉద్యమకారుడు మన్సూర్ దర్వేష్ ఓదరఖాస్తు పెట్టుకోగా సంబంధిత పేపర్లు కాలిపోయాయని సమాధానం వచ్చింది. 2012లో మహారాష్ట్ర సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ పేపర్లు కాలిపోయాయని అధికారుల నుండి సమాధానం వచ్చింది.

    Salman Khan's case papers lost in fire

    సల్మాన్ ఖాన్ కేసు విషయానికొస్తే...
    సల్మాన్ ఖాన్ కు హిట్ అండ్ రన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే సల్మాన్ హై కోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా తీర్పును నిలిపి వేస్తూ నెల రోజు పాటు బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణ జూన్ 15న జరుగనుంది. విచారణ తర్వాత సల్మాన్ ఖాన్ భవితవ్యం తేలనుంది.

    మరో వైపు కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు చుక్కెదురైంది. ఈ ఘటనకు సంబంధించి సాక్షులను మరోసారి విచారించాలని సల్మాన్‌ఖాన్ పెట్టుకున్న అభ్యర్థనను జోధ్‌పూర్ కోర్టు తోసిపుచ్చింది. సల్మాన్‌ఖాన్ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణజింకను వేటాడటంపై రాజస్థాన్ కోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే.

    హిట్ అండ్ రన్ కేసుకు తోడు జింకల కేసులో కూడా సల్మాన్ ఖాన్ కు శిక్ష పడితే.......పరిస్థితి ఎలా ఉంటుందో? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బాలీవుడ్లో టాప్ స్టార్ గా ఎదిగిన సల్మాన్ ఖాన్ కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే ఈ కేసుల వల్ల ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయింది.

    English summary
    The Maharashtra government does not have any "information" on Bollywood actor Salman Khan's 2002 hit-and-run case as the files pertaining to it were gutted in a fire at Mantralaya, an RTI query has revealed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X