Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చూడండి : డైలాగ్ ప్రోమో వదిలారు (వీడియో)
ముంబై: బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్‌లు జంటగా నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రంలోని సరికొత్త డైలాగ్ ప్రోమో విడుదలైంది. చిత్ర బృందం తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.
సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం తెలుగులో 'ప్రేమ లీల' అనే టైటిల్‌తో విడుదలకు సిద్ధమౌతోంది.
అలాగే... 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రంలోని ఓ కొత్త పాట విడుదలైంది. వీడియో లింక్‌ను పోస్ట్ చేశారు.
ఈ పాట ప్రస్తుతం ట్విట్టర్ ఇండియన్ ట్రెండింగ్స్‌లో మొదటి పది స్థానాల్లో చోటు సంపాదించింది. సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం తెలుగులో 'ప్రేమ లీల' అనే టైటిల్‌తో విడుదల అవుతోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
పాకిస్దాన్ లోనూ...
మరో ప్రక్క... 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' పాకిస్థాన్‌లోనూ సందడి చేయనుంది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్‌కు జంటగా సోనమ్ కపూర్ నటించింది. ఇటీవల విడుదలైన 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాపై పాకిస్థాన్‌లో ఎన్ని వివాదాలు వచ్చినా సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
దీంతో 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రాన్ని పాకిస్థాన్‌లోనూ విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీపావళి కానుకగా వనంబర్ 12 విడుదల కానున్న ఈ చిత్రాన్ని అదే రోజున పాకిస్థాన్‌లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నీల్ నితిన్ ముఖేశ్‌లు ముఖ్యపాత్రల్లో నటించారు.
గతంలో సల్మాన్‌ఖాన్‌తో దర్శకుడు సూరజ్ బర్‌జాత్యా మైనే ప్యార్ కియా, హమ్ సాత్ సాత్ హై,హమ్ ఆప్ కే కౌన్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తీశాడు. ఈ కాంబినేషన్ తాజాగా నాలుగోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.