twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీడియాను నిషేదించాలన్న సల్మాన్ పిటీషన్ కొట్టివేత

    By Bojja Kumar
    |

    ముంబై: 2002 హిట్ అండ్ రన్ కేసు విచారణ సందర్భంగా తన స్టేట్మెంట్ రికార్డు చేసే సమయంలో మీడియాను నిషేదించాలంటూ నటుడుసల్మాన్ ఖాన్ చేసిన అభ్యర్థనను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు జడ్జి డీడబ్ల్యూ దేశ్ పాండే సల్మాన్ ఖాన్ పిటీషన్ తిరస్కరించారు. సల్మాన్ ఖాన్ స్టేట్మెంట్ రికార్డ చేయడం పూర్తయిన తర్వాతే మీడియా వార్తలు ప్రసారం చేయాలని జడ్జి ఆదేశించారు.

    కారు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమై, నలుగురిని గాయ పరిచారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌.. కోర్టులో శుక్రవారం బోనులో నిలబడి తన వాదనలు వినిపించారు. 2004లో జరిగిన ఆ ఘటనకు సంబంధించి తన వాదన వినిపించడానికి ఖాన్‌కు ఇదొక కీలకమైన అవకాశం. సల్మాన్‌ఖాన్ వాంగ్మూలంతో కేసు విచారణ దాదాపు పూర్తయినట్లే. అనంతరం కోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేరం రుజువైతే సల్మాన్‌ఖాన్‌కు ఎలాంటి శిక్షపడుతుందన్న దానిపై చర్చలు జోరందుకున్నాయి.

    Salman Khan's Request to Ban Media in Hit-And-Run Case Hearing Rejected

    2002 సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి సల్మాన్ కారులో వస్తుండగా రోడ్డుపై నిద్రిస్తున్నవారిపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. కేసును విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు.. ఇప్పటివరకు 25 మంది నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. చివరిగా సల్మాన్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ను శుక్రవారం రికార్డు చేసింది.

    English summary
    Salman Khan is recording his statement in a court in Mumbai today in a 13-year-old hit-and-run case. The 49-year-old actor is accused of running over pavement dwellers with his SUV in the early hours of September 28, 2002. One person was killed and four were injured.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X