twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్పీ బాలుకు మరో పురస్కారం

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ గాయకుడు,గాన గాంధర్వుడు బిరుదాంకితుడు అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం కు మరో పురస్కారం లభించింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు జయంతి సందర్భంగా రసమయి సంస్థ గత పదమూడేళ్లుగా ఓ పురస్కారాన్ని అందజేస్తోంది. ఈయేడాది ఆ గౌరవం ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకు దక్కింది.

    సాలూరి రాజేశ్వరరావు 93వ జయంతి సందర్భంగా ఈనెల 25న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని బాలుకు అందజేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి, డా||సి.నారాయణరెడ్డి, కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి, సాలూరి కోటి, వాసూరావు తదితరులు పాల్గొంటారు.

     Saluri Rajeswara Rao award for S.P.Balu

    ఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ...‘‘నా పదిహేనో ఏట... నేను ఓ ఆర్కెస్ట్రాలో పాడుతుంటే.. ఆ కార్యక్రమానికి సాలూరివారు అతిథిగా వచ్చారు. అప్పుడు నేను ఆయన ఆటోగ్రాఫ్ అడిగితే- నా పూర్తిపేరు, భవిష్యత్తులో గాయకునిగా గొప్ప కీర్తి ప్రతిష్టలు సాధించాలని సంతకం చేశారు. సాలూరివారి కంపోజిషన్ చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో గాయకులు ఆయన కంపోజిషన్‌లో పాడటానికి భయపడిపోయేవారు.'' అని అన్నారు.

    పాడుతా తీయగా కార్యక్రమంతో పాటు ఇతర అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం . వయస్సు మీద పడుతున్నా గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, టీవీ కార్యక్రమాల ద్వారా ప్రఖ్యాతి గాంచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ చురుకుగా సంగీత సాగరంలో ముగిని తేలుతున్నారు.

    English summary
    Rasamayi which honours the best in music in the name of late composer Saluri Rajeshwara Rao has chosen singer Balasubrahmanyam for Rasamayi – Saluri Talent Award this year. The award ceremony will be held on Oct 25 at Ravindra Bharathi in the city.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X