twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న చిరు, నేడు సమంత..శ్వేతా బసు నో (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మూడు జాతీయ అవార్డులతో పాటు ఐదు అంతర్జాతీయ అవార్డులు పొందిన తెలుగు చిత్రం ‘నా బంగారు తల్లి'. ఈ నెల 21న వంద థియేటర్లలో విడుదలయింది. రాజేశ్‌ టచ్‌రివర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎం.ఎస్‌. రాజేశ్‌, డాక్టర్‌ సునీతా కృష్ణన్‌ సంయుక్తంగా నిర్మించారు.

    అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపే ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌' నేపథ్యంలో తీసిన సినిమా అయినా ఎలాంటి అసభ్యతకూ, అశ్లీలతకూ చోటు లేకుండా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేవిధంగా దర్శకుడు రూపొందించారు. మంచి సినిమా కావడంతో ఈ చిత్రానికి పబ్లిసిటీ చేయడానికి పలువురు సెలబ్రిటీలు ముందు కొస్తున్నారు. ఇటీవల ఈచిత్రం ఫంక్షన్లో చిరంజీవి పాల్గొన్నారు. నటి అక్కినేని అమల సినిమా విడుదలకు తన సహకారం అందించింది.

    తాజాగా ఈచిత్రానికి పబ్లిసిటీ చేయడానికి సమంత ముందుకొచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన మీడియా సమావేశంలో సమంత మాట్లాడుతూ.... ''సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి అందరం మాట్లాడుతుంటాం. కానీ, విజువల్ గా చూసినప్పుడే ఎక్కువగా ప్రభావితం చెందుతాం. విజువల్స్ కి అంత శక్తి ఉంది. వుమన్ ట్రాఫికింగ్ గురించి విజువల్ గా చూపించాలని ఈ దర్శక, నిర్మాతలు చేసిన ప్రయత్ననం అభినందనీయం'' అని సమంత అన్నారు. ఇటీవలే వ్యభిచార కేసులో ఇరుక్కున్న శ్వేతబసు గురించి ప్రస్తావించగానే.. ఇది సినిమా ప్రమోషన్‌ అంటూ దాట వేసింది.

    స్లైడ్ షోలో ఫోటోస్

    నా బంగారు తల్లి

    నా బంగారు తల్లి

    ప్రజ్వల సమర్పణలో సన్ టచ్ ప్రొడక్షన్స్ పతాకంపై సునీతకృష్ణన్, ఎం.ఎస్. రాజేష్ నిర్మించిన చిత్రం 'నా బంగారు తల్లి'. అంజలి పాటిల్, సిద్ధిఖీ, లక్ష్మీమీనన్, రత్నశేఖర్ తదితరరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించారు.

    సమంత

    సమంత

    ''నా బంగారు తల్లి అద్భుతమైన చిత్రం. ఇది వాస్తవ కథ. మంచి మనుషులు ఎప్పుడూ విజయం సాధించాలని కోరుకుంటాను. ఈ సినిమా తీసింది కూడా మంచి మనుషులు కాబట్టి, వాళ్లకి విజయం చేకూరాలి అని సమంత ఆకాంక్షించింది.

    సాహసం చేయను

    సాహసం చేయను

    ఇలాంటి మంచి చిత్రాన్ని విమర్శించే సాహసం చేయను. ఎందుకంటే ఇదొక కళాఖండం. ఈ చిత్రంలో నాకు నచ్చని అంశం అంటూ ఏదీ లేదు. ఇది ఎంటర్ టైన్ చేసే చిత్రం కాదు. ఎడ్యుకేట్ చేసే చిత్రం. నాకు కమర్షియల్ చిత్రాలంటే ఇష్టం. ఎందుకంటే అన్ని సమస్యలు మర్చిపోయి రెండు గంటలు సినిమా చూసేస్తాం. కానీ, 'నా బంగారు తల్లి'లాంటి సినిమాలు కూడా రావాలి అని సమంత చెప్పుకొచ్చారు.

    రిటైర్ అయ్యే లోపు...

    రిటైర్ అయ్యే లోపు...

    ఇది సినిమా కాదు. నిజం. ఆర్ట్ సినిమా అని కూడా చెప్పను. కమర్షియల్ సినిమానే. ఇది ప్రయోజనాత్మక చిత్రం కాబట్టి, నాలుగు మంచి మాటలు చెప్పడానికి నా అంతట నేను ముందుకువచ్చాను. నేను రిటైర్ అయ్యేలోపు ఖచ్చితంగా ఇలాంటి సినిమా ఒకటి చేస్తాను అని సమంత చెప్పుకొచ్చారు.

    English summary
    Samantha, who watched the premiere show of 'Naa Bangaru Talli',said that the film is very heart touching and everybody should watch it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X