»   » శుభం... సమంతా నాగచైతన్యల పెళ్ళి డేట్ ఫిక్సయ్యింది....

శుభం... సమంతా నాగచైతన్యల పెళ్ళి డేట్ ఫిక్సయ్యింది....

Posted by:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని అభిమానులే కాకుండా తెలుగు సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాగచైతన్య, సమంత పెళ్లికి ముహూర్తం దాదాపు ఖారారైనట్లే. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ 23న హైదారబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఈ జంట ఒక్కటవనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం నాగచైతన్య ప్రేమమ్ అనే సినిమా చేస్తున్నాడు. అటు సమంత కూడా జనతా గ్యారేజీ సినిమాతో బిజీగా ఉంది. ఈరెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చి... ఇద్దరూ ఫ్రీ అయ్యేసరికి సెప్టెంబర్ రెండోవారం పడుతుంది. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ పెట్టుకోవాలని బేసిక్ గా భావిస్తున్నారు. అయితే ఇంకా అఫీషియల్ గా ఇటు అక్కినేని ఫ్యామిలీ గానీ అటు సమంత గానీ ఏ ప్రకటనా చేయలేదు. త్వరలోనే ఈ తీపికబురు స్వయంగా నాగార్జున నే రివీల్ చేయాలనుకుంటున్నాడట.

Samantha and Naga Chaitanya Wedding Date and Venue Confirmed?

ప్రస్తుతం సమంత సినిమాలకు దాదాపు బై చెప్పేసింది. జనతా గ్యారేజ్ మూవీనే ఆమెకు చివరి సినిమా కావొచ్చు. పెళ్లి తర్వాత ఇక కెమెరా ముందురు రాకూడదనే నాగార్జున కండిషన్ కు సమంత ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే జనతా గ్యారేజ్ తర్వాత చేయాల్సిన సినిమాలన్నింటినీ ఆమె రద్దుచేసుకుంది.

'ప్రేమమ్' తర్వాత సమంతకు చైతూ మూడు ముళ్లు వేస్తాడని, సమంతకు 'జనతా గ్యారేజ్' చివరి సినిమా అని ఫిలింనగర్ జనాలు చెవురు కొరుక్కుంటున్న టైంలో 'జనతా గ్యారేజ్ నా చివరి సినిమా కాదు. ఇంకా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను' అని తన సినీ కెరీర్‌పై స్పష్టత ఇచ్చిన సమ్మూ పెళ్లి వ్యవహారంపై మాత్రం సైలెంట్‌గా ఉంది. దీంతో చైతూతో పెళ్లి కంచెకు చేరిందా? అని అందరూ అనుకున్నారు. ఈ టైంలో సెప్టెంబర్ 23న నోవాటెల్ హోటల్‌లో చైతూ, సమ్మూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఏదేమైనా, ఈ 'చకోర' పక్షుల పెళ్లికి 'ముహూర్తం' దాదాపు ఖరారు అయినట్టే.

English summary
The latest reports are to be believed, the love birds are going to get married on September 23rd at Novotel Hotel, Hyderabad.this news has been not yet confirmed officially. Soon we will expect an official announcement from Akkineni family.
Please Wait while comments are loading...