» 

గిమ్మిక్కులు ఏవో చేయాలి తప్పదు: సంపత్ నంది

Posted by:

హైదరాబాద్: ''ఒకే పాత్రకి రెండు షేడ్స్‌ పెట్టాలనేది అనుకొని చేసింది కాదు. కథ రాసుకుంటూ వచ్చినప్పుడు ఒక్కోసారి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ప్రేక్షకుడిని ఒకటో సన్నివేశం నుంచి 60వ సన్నివేశం వరకు కుర్చీలో కూర్చోబెట్టాలంటే ఇలాంటి గిమ్మిక్కులు ఏవో చేయాలి. మరోవైపు ఇలాంటి ట్విస్టులకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది కూడా'' అని సంపత్ నంది తన హిట్ చిత్రం రచ్చ చిత్రంలో ట్విస్టు లు గురించి వివరిస్తూ అన్నారు.

'రచ్చ'లో తండ్రీకూతురుగా ముఖేష్‌రుషి, తమన్నా నటించారు. కూతురంటే పంచప్రాణాలు ఉన్న వ్యక్తిగా నటించాడు ముఖేష్‌. ఇంటర్వెల్ సన్నివేశానికి వచ్చేటప్పటికి 'ట్విస్ట్‌' వచ్చి కథ మొత్తాన్ని మెలికతిప్పుతుంది. అసలు అతడు తండ్రేకాదని.. ఆ ప్రేమంతా ఆస్తికోసమేనని తెలిసేసరికి సగటు ప్రేక్షకుడు షాక్ అవుతాడు.


ఇలాంటి ట్విస్ట్ లతో కథ నడిపి హిట్ కొట్టి తన మూడో సినిమాకే పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు దర్శకుడు సంపత్ నంది. ప్రస్తుతం తను చేస్తున్న 'గబ్బర్ సింగ్-2' చిత్రం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 'గబ్బర్ సింగ్-2' చిత్రం సరికొత్త కథతో చేస్తున్నామని చెప్పిన సంపత్......ఈ సినిమా గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రీక్వెల్ గానీ, సీక్వెల్ గానీ కాదని స్పష్టం చేసాడు. జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలు దేనికది ఎలా ప్రత్యేకమో, గబ్బర్ సింగ్-2 చిత్రం కూడా ప్రత్యేకమైన కథతో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.

గబ్బర్ సింగ్-2 ఆలోచన తనది కాదని, తాను వేరే కథతో పవన్ కళ్యాన్ ను కలిస్తే.....ముందు గబ్బర్ సింగ్-2 చేసిన తర్వాత ఆ సినిమా చేద్దామని పవన్ కళ్యాణ్ చెప్పాడట. పవన్ కోరిక మేరకు గబ్బర్ సింగ్ -2 చిత్రం కోసం 2 నెలల్లో స్క్రిప్టు రెడీ చేసాడు సంపత్ నంది. ఆయన మాటలు బట్టి గబ్బర్ సింగ్-2 చిత్రం తర్వాత ఆయనతో పవన్ మరో సినిమా చేయబోతున్నాడన్నమాట.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే..... సంపత్ నంది మదిలో 'బెంగాల్ టైగర్' అనే టైటిల్ ఆలోచన ఉందట. అవకాశం వస్తే 'గబ్బర్ సింగ్-2' టైటిల్ 'బెంగాల్ టైగర్'గా మారుస్తానని అంటున్నాడు. అయితే ఈ విషయాన్ని తాను ఇప్పుడే ఖరారు చేయలేనని స్పష్టం చేస్తున్నాడు సంపత్. 'ఖుషి' చిత్రంలో పవన్ చెప్పిన 'ఐయామ్ రాయల్ బెంగాల్ టైగర్...సిద్ధూ సిద్ధార్థ రాయ్' అనే డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

Read more about: pawan kalyan, gabbar singh 2, sampath nandi, harish shankar, పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ 2, సంపత్ నంది, హరీష్ శంకర్
English summary
Director Sampath Nandi’s pretty happy about his upcoming movie with Pawan Kalyan. The director will be directing Pawan Kalyan for a film which will be a sequel to Gabbar Singh.

Telugu Photos

Go to : More Photos