twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీకేమైనా పిచ్చెక్కిందా సంపూ..? ‘కొబ్బరిమట్ట’ వేషాలేంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హృదయ కాలేయం' ఇచ్చిన కిక్కుతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మరో క్రేజీ ప్రాజెక్టు ‘కొబ్బరిమట్ట' ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ మొదలు పెట్టాడు. రేపు (ఏప్రిల్ 15) కొబ్బరి మట్ట పాట విడుదల చేస్తున్న సందర్భంగా....సంపూర్ణేష్ బాబు విడుదల చేసిన ప్రకటన చూస్తే ఆయనకు పిచ్చెక్కిందని మీరంతా సందేహ పడటం ఖాయం.

    ఏప్రిల్ 15న మనకు తెల్లదొరలు నుండి స్వాతంత్ర్యం వచ్చిందని చప్పుకొచ్చిన సంపూ....కుటుంబం అంటే పాక అని, భార్య అంటే మనకు నచ్చి తెచ్చుకునే తవుడు అని, పిల్లలు అంటే మనం ఇష్టంగా కలుపుకునే కుడితి అంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

    ఏప్రిల్ 15, 1947 తెల్లదొరల పాల నుండి భారతీయులు విడుదల అయిన వేళ.. ఏప్రిల్ 15, 2015 కొబ్బరి మట్ట పాట విడుదల అవుతున్న వేళ.. నా ప్రియమైన తెలుగు ప్రజలారా..నా తొలి చిత్రం ‘హృదయ కాలేయం'ని ఆదరించి నన్ను ఎంతగానో ఆదరిస్తున్న భారతీయులకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.

    Sampoornesh Babu's 'Kobbari Matta' song release date

    69 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 15న అమెరికన్ ల చెర నుండి బయట పడిన భరతమాతకి రుణంగా ఏమివ్వగలం...ఒక్క పాట తప్ప. ‘హృదయ కాలేయం' టీంతో మరోసారి పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా 3 పాత్రలతో మీ ముందుకు రాబోతున్నాను.

    ‘కొబ్బరి మట్ట' ఒక కుటుంబ కథా చిత్రం... నా దృష్టిలో కుటుంబం అంటే ఒక పాక, భార్య అంటే నచ్చి తెచ్చుకునే తవుడు, ఇక పిల్లలు అంటే మన ఇష్టంతో కలుపుకునే కుడితి.... కానీ నా దృష్టిలో తండ్రి అంటే పాలిచ్చే మగ ఆవు. ఇలాంటి గొప్ప సెంటిమెంట్ కథా చిత్రంలో గుండెని హత్తుకునే ఒక పాటని మీ కోసం నేను స్వయంగా పాడాను...భారత స్వాతంత్ర్య ఫలాలని 68 సంవత్సరాలుగా ఆస్వాదించిన మీరు..ఈ చిత్ర గీత స్వరాలని అలాగే ఆదరిస్తారని నమ్ముతున్నాను.... అంటూ ప్రకటన విడుదల చేసారు.

    ఈ చిత్రానికి నిర్మాత: ఆది కుంభగిరి, కథ-స్క్రీన్ ప్లే, మాటలు: స్టీవెన్ శంకర్, కూర్పు : కార్తీక శ్రీనివాస్, స్టంట్స్: జాషువ, సంగీతం: కమ్రన్, లైన్ ప్రొడ్యూసర్: సురేష్, దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్.

    English summary
    Burning star Sampoornesh Babu starrer 'Kobbari Matta' movie makers decided to release a song of tomorrow (April 15th).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X